India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మరో 2 గంటల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ADB, జగిత్యాల, భూపాలపల్లి, గద్వాల్, కామారెడ్డి, ASF, MBNR, మంచిర్యాల, MDK, ములుగు, నాగర్‌కర్నూల్, నారాయణపేట్, నిర్మల్, పెద్దపల్లి, SRD, వనపర్తి, భువనగిరి జిల్లాల్లో వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. జనగామ, కరీంనగర్, MHBD, NZB, సిరిసిల్ల, వరంగల్‌లో మోస్తరు వర్షాలు పడతాయంది.
TG: సీఎం రేవంత్ నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. 2 రోజుల పాటు సాగే ఈ పర్యటనలో కాంగ్రెస్ అగ్రనేతలతో పాటు పలువురు కేంద్రమంత్రులతో ఆయన భేటీ అవుతారు. మంత్రి వర్గ విస్తరణ, పీసీసీ కొత్త అధ్యక్షుడి నియామకంపై కాంగ్రెస్ పెద్దలతో.. విభజన హామీల అమలు, పెండింగ్ ప్రాజెక్టుల గురించి కేంద్రమంత్రులతో చర్చిస్తారని తెలుస్తోంది. వరంగల్‌లో ఈ నెలాఖరులో నిర్వహించే భారీ బహిరంగ సభకు రాహుల్ గాంధీని రేవంత్ ఆహ్వానించనున్నారు.
TG: రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టులకు వరద పోటెత్తింది. SRSPకి 15 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతోంది. ప్రస్తుత నీటి మట్టం 1,067 అడుగులుగా ఉంది. మరోవైపు భద్రాచలం వద్ద వరద ఉద్ధృతి పెరుగుతోంది. గోదావరి నీటిమట్టం 36.2 అడుగులకు చేరింది. జూరాలకు ఇన్ ఫ్లో 83 వేల క్యూసెక్కులు ఉండగా ఔట్ ఫ్లో 1.17 లక్షలుగా ఉంది. ఎగువ, దిగువ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.
తెలంగాణలోని ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, <<13668481>>ఉన్నత పాఠశాలలు <<>>ఇకపై ఉదయం 9 గంటలకే ప్రారంభం అవుతాయి. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పనిచేస్తాయి. 7వ తరగతి వరకు ఉండే ప్రాథమికోన్నత స్కూళ్లు, హైస్కూళ్లు ఉదయం 9 నుంచి సాయంత్రం 4.15 వరకు నిర్వహిస్తారు. HYD, సికింద్రాబాద్‌లో మాత్రం ట్రాఫిక్ దృష్ట్యా స్కూళ్లు ఉదయం 8.45 గంటలకు మొదలై సాయంత్రం 4 గంటల వరకు పనిచేస్తాయి.
AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 16 గంటల సమయం పడుతోంది. 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 83,538 మంది భక్తులు దర్శించుకోగా 30,267 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. అదే సమయంలో స్వామివారికి రూ.4.25 కోట్ల ఆదాయం సమకూరింది.
మన జీవితాల్లో వెలుగును నింపే గురువులను స్మరించుకునేందుకే ఈ గురుపౌర్ణమి జరుపుకుంటారు. కురుక్షేత్రంలో పోరాడేందుకు అర్జునుడికి శ్రీకృష్ణుడు గీతోపదేశం చేసినట్టు, మౌర్య రాజ్య స్థాపనలో చంద్రగుప్తుడికి చాణక్యుడు అండగా నిలిచినట్టు మనందరి జీవితాల్లోనూ అలాంటి గురువులు ఉంటారు. అది అమ్మానాన్న/ స్నేహితులు కూడా కావొచ్చు. మరి ఈ గురుపూర్ణిమ సందర్భంగా మిమ్మల్ని ప్రభావితం చేసిన గురువులు ఎవరు? కామెంట్ చేయండి.
TG: రుణమాఫీ తొలి విడతలో భాగంగా 11.50 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.6098కోట్లు జమ చేసినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. 99శాతం మంది ఖాతాల్లో నగదు జమ అయ్యిందని తెలిపారు. నగదు జమ కాని వారు తమ మండల వ్యవసాయాధికారిని, విస్తరణాధికారిని కలిసి ఆధార్ కార్డు నంబర్ ఇస్తే పరిశీలించి సమాచారం ఇస్తారన్నారు. ఆధార్ కార్డులు సరిగా లేనివారి వద్ద ఇతర ఆధారాలు తీసుకునే అంశాన్ని పరిశీలిస్తామన్నారు.
అనారోగ్యంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సమంత తిరిగి ప్రాజెక్టుల జోరు పెంచారు. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కే ఫాంటసీ వెబ్ సిరీస్‌లో ఆమె నటించనున్నట్లు తెలుస్తోంది. దీనిని హారర్ థ్రిల్లర్ ‘తుంబాడ్’ మూవీ దర్శకుడు అనిల్ బార్వే తెరకెక్కించనున్నారు. మొదట సినిమాగా తీయాలనుకున్నా లెంగ్త్‌ను దృష్టిలో పెట్టుకొని వెబ్ సిరీస్‌గా మార్చారట. ఆదిత్య రాయ్ కపూర్, వామికా గబ్బీ ఇందులో నటించనున్నారు.
AP: రాష్ట్రంలో వర్షాలు, వరదలు విధ్వంసాన్ని సృష్టించాయి. ఆరుగాలం కష్టపడిన రైతన్నలకు కన్నీరు మిగిల్చాయి. ఎడతెరిపి లేని వర్షాల కారణంగా లక్ష ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు అంచనా. రెండు రోజులుగా వరి పొలాలు, నారుమళ్లు ముంపులోనే ఉన్నాయి. కొన్ని చోట్లైతే పంటభూముల్లో ఇసుక మేటలు వేసింది. బురద పేరుకుపోయింది. ఈ విపత్తు సమయంలో ప్రభుత్వం ఆదుకోవాలంటూ రైతన్నలు కన్నీటి పర్యంతమవుతున్నారు.
APలో వర్షాల ప్రభావంతో విద్యుత్ ప్రమాదాలు, సరఫరాలో అంతరాయాలు లేకుండా చూడాలని మంత్రి గొట్టిపాటి రవి అధికారులను ఆదేశించారు. విద్యుత్ తీగలు, స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు పాడైతే వెంటనే సరిచేసేలా పరికరాలను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. విద్యుత్ ఉద్యోగులు సెలవులు తీసుకోకుండా సేవలు అందించాలని ఆదేశించారు. విద్యుత్ సమస్యలపై 8500001912కు వాట్సాప్ ద్వారా సమాచారం ఇవ్వొచ్చని, 1912 నంబర్‌కు ఫోన్ చేయవచ్చన్నారు.
Sorry, no posts matched your criteria.