India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
టీ20 మహిళల వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. వెస్టిండీస్‌తో జరిగిన రెండో సెమీ ఫైనల్లో ఆ జట్టు 8 పరుగుల తేడాతో గెలిచింది. 129 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన విండీస్ 120/8కే పరిమితమైంది. ఆ జట్టులో డాటిన్ (33) పోరాడినా ఫలితం లేకుండా పోయింది. కివీస్ బౌలర్లలో కార్సన్ 3, కెర్ 2 వికెట్లు తీశారు. ఎల్లుండి దుబాయ్‌లో జరిగే ఫైనల్లో సౌతాఫ్రికాతో న్యూజిలాండ్ తలపడనుంది.
AP: అక్టోబర్ 22 నుంచి ఆధార్ ప్రత్యేక క్యాంపులు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. గ్రామ, వార్డు సచివాలయాలు, కాలేజీలు, స్కూళ్లు, అంగన్‌వాడీ సెంటర్లలో 4 రోజుల పాటు ఈ క్యాంపులు నిర్వహించనుంది. ఇందుకోసం ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు తగిన చర్యలు తీసుకోవాలంది. ఈ క్యాంపుల్లో కొత్త ఆధార్ నమోదు, బయోమెట్రిక్ అప్‌డేట్, డెమోగ్రాఫిక్ అప్‌డేట్, ఈ-ఆధార్ వంటి సేవలు అందించనున్నారు.
US అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్‌తో పోలిస్తే డొనాల్డ్ ట్రంప్‌కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని బెట్టింగ్ సైట్లు తేల్చిచెబుతున్నాయి. వీరిద్దరిలో గెలుపెవరిదన్నదానిపై అంతర్జాతీయంగా బెట్టింగ్స్ జోరుగా సాగుతున్నాయి. ట్రంప్ గెలిచేందుకు 60శాతం అవకాశముందని పాలీమార్కెట్ పేర్కొనగా, బెట్‌ఫెయిర్, స్మార్కెట్స్ సైట్లు చెరో 58శాతం, కాల్షీ 57శాతం, ప్రెడిక్టిట్ 54శాతం ఛాన్స్ ఉన్నట్లు అభిప్రాయపడ్డాయి.
TG: కొడంగల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ(KADA)కి రూ.43.75 కోట్ల నిధులు విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధులతో KADA పరిధిలోని కొడంగల్ నియోజకవర్గం, వికారాబాద్, నారాయణ్‌పేట్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టాలని ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు ప్రణాళిక శాఖ తరఫున జీవో జారీ అయ్యింది.
మోహన్‌బాబు, సౌందర్య జంటగా వచ్చిన ‘శివ్‌శంకర్’ సినిమా షూటింగ్ సమయంలో సౌందర్య కన్నుమూశారు. ఆ ఘటనపై ఆ మూవీ డైరెక్టర్ రాజేంద్ర ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘షూటింగ్‌లో నిర్మాత మోహన్‌బాబు ఎవరికీ సెలవులిచ్చేవారు కాదు. ఎన్నికల ప్రచారం ఉండటంతో సౌందర్యకు మాత్రం సెలవిచ్చారు. ఒకవేళ ఆయన అనుమతి నిరాకరించి ఉంటే ఆమె బతికేవారేమో. ఆమె మరణం కారణంగా సినిమా సరిగ్గా తీయక ఫ్లాపైంది’ అని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
AP: కడప DSA స్టేడియంలో NOV 10 నుంచి 15 వరకు ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించారు. కర్నూలు, NLR, ATP, YSR, GNT, ప్రకాశం, CTR, బాపట్ల, పల్నాడు, నంద్యాల, TPTY, అన్నమయ్య, శ్రీసత్యసాయి జిల్లాల వారే పాల్గొనాలి. అగ్నివీర్ ట్రేడ్స్‌మన్‌కు 8వ తరగతి అర్హత. మిగతా వాటికి టెన్త్ పాసవ్వాలి. FEBలో నోటిఫికేషన్ విడుదలవగా, అభ్యర్థులు సంబంధిత పత్రాలు తీసుకురావాలని అధికారులు చెప్పారు.
TG: హైడ్రా, మూసీ ప్రక్షాళనకు వ్యతిరేకంగా ఈ నెల 25న భారీ ధర్నా చేపడతామని బీజేపీ శాసనసభ పక్షనేత ఏలేటి మహేశ్వర్ తెలిపారు. ఈ నెల 23, 24 తేదీల్లో మూసీ పరీవాహక ప్రాంతంలో పర్యటిస్తామన్నారు. నేడు పార్టీ ముఖ్య నేతలతో ఆయన సమావేశమయ్యారు. తర్వలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ వ్యూహంపై ఈ భేటీలో చర్చించినట్లు తెలిపారు. అలాగే ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థుల ఎంపిక, వ్యూహాలపై సుదీర్ఘంగా చర్చించామన్నారు.
టెస్టు క్రికెట్ చరిత్రలో ఓ క్యాలెండర్ ఇయర్‌లో 100 సిక్సర్లు బాదిన జట్టుగా భారత్ నిలిచింది. ఈ ఏడాది ఇప్పటివరకు టీమ్ ఇండియా 102 సిక్సర్లు బాదింది. అంతకుముందు ఇంగ్లండ్(89-2022) పేరిట ఈ రికార్డు ఉంది. ఆ తర్వాతి స్థానంలోనే భారత జట్టు(81-2021) ఉండటం విశేషం.
TG: రాష్ట్ర విద్యా కమిషన్ సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పీఎల్ విశ్వేశ్వర్ రావు, వెంకటేశ్, జ్యోత్స్నను నియమించింది. అంతకుముందు కమిషన్ ఛైర్మన్‌గా ఆకునూరి మురళిని నియమించిన సంగతి తెలిసిందే.
AP: స్టార్ షట్లర్ పీవీ సింధు ఆన్‌డ్యూటీ సదుపాయాన్ని ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ప్రస్తుతం డిప్యూటీ కలెక్టర్ హోదాలో ఉన్న సింధు హైదరాబాద్‌లో ఏపీ అధీనంలోని లేక్‌వ్యూ అతిథిగృహం ఓఎస్డీగా కొనసాగుతున్నారు. అయితే అంతర్జాతీయ పోటీల్లో శిక్షణ కోసం ఆమెకు 2025 సెప్టెంబర్ 30 వరకు ఆన్ డ్యూటీ సౌకర్యం కల్పిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వరుసగా ఆరోసారి దీన్ని పొడిగించినట్లు వెల్లడించింది.
Sorry, no posts matched your criteria.