India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దీపావళి సందర్భంగా 3.64 శాతం డీఏ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇది 2022 జులై 1 నుంచి వర్తిస్తుందని తెలిపింది. పెరిగిన డీఏను నవంబర్ జీతంతో కలిపి ఇవ్వనుంది. 2022 జులై నుంచి 2024 అక్టోబర్ 31 వరకు ఉన్న డీఏ బకాయిలను జీపీఎఫ్ ఖాతాలో జమ చేయనున్నారు.
‘జై హనుమాన్’లో హీరోగా రిషబ్ శెట్టి నటించనున్నారు. హనుమంతుడి పాత్రలో ఆయన రాముడి విగ్రహాన్ని హత్తుకున్న ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ దీపావళిని ‘జై హనుమాన్’ నినాదంతో మొదలుపెడదామని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ట్వీట్ చేశారు. కాగా ‘హనుమాన్’ మూవీ హిట్ కావడంతో జై హనుమాన్‌పై ఫ్యాన్స్‌కు భారీ అంచనాలున్నాయి. హనుమాన్‌లో హీరోగా తేజా సజ్జ నటించిన విషయం తెలిసిందే.
తెలంగాణలో గ్రూప్-3 ఎగ్జామ్ షెడ్యూల్ విడుదలైంది. నవంబర్ 17, 18 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఉ.10గంటల నుంచి మ.12.30గంటల వరకు పేపర్ 1, మ.3గంటల నుంచి సా.5.30గంటల వరకు పేపర్ 2 పరీక్షలు ఉంటాయి. నవంబర్ 10 నుంచి అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఈ పరీక్షల ద్వారా దాదాపు 1,380కి పైగా పోస్టులను భర్తీ చేయనున్నారు.
TG: విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. డైట్ ఛార్జీలతో పాటు కాస్మోటిక్ ఛార్జీలను పెంచినట్లు ప్రకటించింది. అన్ని ప్రభుత్వ వసతి గృహాలు, గురుకుల విద్యాసంస్థ వసతి గృహాలకు దీన్ని వర్తింపజేస్తున్నట్లు వెల్లడించింది. 3 నుంచి 7వ తరగతి వారికి రూ.950గా ఉన్న ఛార్జీని రూ.1330కి, 8 నుంచి 10వ క్లాస్ వారికి రూ.1100 నుంచి ₹1540కి పెంచింది. ఇంటర్ నుంచి పీజీ వారికి ₹1500 నుంచి రూ.2100కి పెంచింది.
TG: ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే BRSకు 100 సీట్లు వస్తాయని ఆ పార్టీ నేత హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు. రేవంత్‌కు CM పదవి KCR పెట్టిన భిక్ష అని ఆయన చెప్పారు. ‘మూసీ సుందరీకరణకు మేం అనుకూలమే. కానీ బ్యూటిఫికేషన్ పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారానికి మాత్రం వ్యతిరేకం. మూసీ అభివృద్ధి అని చెప్పి కమీషన్ల కోసం పేదల ఇళ్లు కూల్చొద్దు. మూసీని శుద్ధి చేయాలని కేసీఆర్ అప్పుడే సంకల్పించారు’ అని ఆయన పేర్కొన్నారు.
గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ఇంటర్వ్యూల కోసం జైలులో స్టూడియో తరహా ఏర్పాట్లు చేశారంటూ పంజాబ్-హరియాణా హైకోర్టు తీవ్రంగా మండిపడింది. బిష్ణోయ్ ఇంటర్వ్యూల కేసులో విచారణ ముగింపుపై సిట్ సమర్పించిన రిపోర్టు విషయమై కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. వైఫై కల్పించి ఇంటర్వ్యూలకు అనుమతించడం మరో నేర కుట్రలో భాగమని పేర్కొంది. దీనిపై విచారణకు ఆదేశించాల్సి ఉందని వ్యాఖ్యానించింది.
కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తోన్న ‘టాక్సిక్’ మూవీ చిత్రీకరణ కోసం భారీగా చెట్లను నరికివేశారని కర్ణాటక పర్యావరణ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే ఆరోపణలు చేశారు. పీణ్య-జాలహళ్లి ప్రాంతంలోని 599 ఎకరాల అటవీ భూమిలో ఉన్న వేలాది చెట్లను నరికివేశారని ఆయన పేర్కొన్నారు. అక్కడ ఒక చిన్న గ్రామాన్ని తలపించే సెట్‌ను నిర్మించినట్లు వెల్లడించారు. చిత్ర యూనిట్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన ఉన్నతాధికారులను ఆదేశించారు.
కోల్‌కతా నైట్ రైడర్స్ తమ రిటెన్షన్ లిస్టును దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, ఆండ్రీ రస్సెల్, మిచెల్ స్టార్క్‌ను రిలీజ్ చేస్తున్నట్లు సమాచారం. రింకూ సింగ్, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణాను రిటైన్ చేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. రమణ్‌దీప్ సింగ్‌ను కూడా రిటైన్ చేసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
AP: గ్రూప్-2 మెయిన్స్ పరీక్షల నిర్వహణపై APPSC కీలక ప్రకటన చేసింది. జనవరి 5న ఉదయం, సాయంత్రం ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. 13 ఉమ్మడి జిల్లాల్లో పరీక్షా కేంద్రాలు ఉంటాయని, దాదాపు లక్ష మంది అభ్యర్థులు హాజరవుతారని పేర్కొంది. వచ్చే ఏడాది జరిగే DSC, టెన్త్, ఇంటర్ పరీక్షల దృష్ట్యా జనవరి 5న పరీక్ష నిర్వహిస్తున్నట్లు APPSC ప్రకటనలో వివరించింది.
ఆయుష్మాన్ భారత్‌లో ఢిల్లీ చేరకపోవడాన్ని PM మోదీ తప్పుబట్టడంపై ఆప్ స్పందించింది. BJP పాలిత రాష్ట్రాల్లో ఈ పథకం పెద్ద స్కాం అని MP సంజయ్ సింగ్ విమర్శించారు. ఇందులోని నిబంధనల వల్ల ఒక్క ఢిల్లీ వ్యక్తికి కూడా పథకం వర్తించదన్నారు. ఫ్రిడ్జ్, స్కూటర్ ఉన్నా, ₹10 వేలకు పైగా ఆదాయం ఉంటే పథకం లబ్ధిపొందలేరని పేర్కొన్నారు. దర్యాప్తు జరిపితే పథకంలోని నిర్వహణ లోపం బయటపడుతుందన్నారు.
Sorry, no posts matched your criteria.