India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కనీసం వారంలో 3 రోజులు ఆఫీసుకు రాకుంటే వాటిని లీవ్స్‌గా పరిగణిస్తామని తమ ఉద్యోగులకు HCL తేల్చిచెప్పింది. నెలకు 12రోజులు ఆఫీసులో పనిచేయాలన్న నిబంధన ప్రస్తుతం నడుస్తోంది. అంతకంటే తక్కువగా ఆఫీసుకు వస్తే మాత్రం రాని ప్రతి రోజును సంస్థ లీవ్స్ నుంచి మినహాయించనుంది. ఒకవేళ ఉద్యోగికి లీవ్స్ అయిపోతే జీతం నుంచి రోజు శాలరీని కట్ చేస్తామని స్పష్టం చేసింది.
AP అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 22 నుంచి 5 రోజుల పాటు జరగనున్నాయి. శాసనసభ, శాసనమండలిని ఉద్దేశించి గవర్నర్ చేసే ప్రసంగంతో సమావేశాలు ప్రారంభం అవుతాయి. 4 నెలలకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ నెల 25 లేదా 26న బడ్జెట్‌కు ఆమోదం తెలపనున్నట్లు సమాచారం. అసెంబ్లీలో అర్థవంతమైన, ఫలవంతమైన చర్చలు జరగాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆకాంక్షించారు.
AP: వాయుగుండం ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో అల్లూరి, శ్రీకాకుళం, విజయనగరం, కృష్ణా, తూర్పుగోదావరి, అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లోని స్కూళ్లు, కాలేజీలకు శనివారం సెలవు ఉంటుందని కలెక్టర్లు ప్రకటించారు. మీ జిల్లాలో ఇవాళ స్కూళ్లకు సెలవు ఇచ్చారా కామెంట్ చేయండి.
TG: పంటల రుణమాఫీ పథకం అమలవుతున్న నేపథ్యంలో వ్యవసాయశాఖలో అధికారుల బదిలీలను ప్రభుత్వం నిలిపివేసింది. ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఏఈఓ, ఎంఏఓ, ఏడీ, డీఏఓల బదిలీని ఆపేస్తున్నట్లు వ్యవసాయశాఖ ప్రకటించింది. అప్పటివరకూ ప్రస్తుతం ఉన్న కేంద్రాల్లోనే పనిచేయాలని అధికారులను ఆదేశించింది. షెడ్యూల్ ప్రకారం శనివారం నుంచి బదిలీలు జరగాల్సి ఉంది.
TG: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో ఆ పార్టీ నేతలు ఈరోజు మధ్యాహ్నం రాష్ట్ర గవర్నర్‌ను కలవనున్నారు. నిరుద్యోగులపై కేసులు, పార్టీ ఫిరాయింపులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రొటోకాల్ ఉల్లంఘన వంటి విషయాలపై వారు గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపైనా చర్చిస్తారని సమాచారం.
TG: ADB, ASF, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి జిల్లాల్లో ఇవాళ అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం RED అలర్ట్ జారీ చేసింది. NZB, జగిత్యాల, సిరిసిల్ల, KRMR, భూపాలపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలకు కురుస్తాయని ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. ములుగు, కొత్తగూడెం, KMM, WGL, హన్మకొండ, VKB, SRD, కామారెడ్డి, MBNR, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
AP: వైసీపీ హయాంలో టీడీపీపై విమర్శలతో పాటు తొడగొట్టి మీసాలు తిప్పిన దానికి పోలీసు అధికారుల సంఘం ప్రతినిధులు క్షమాపణలు చెప్పారు. TDP కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్యను వారు ఈమేరకు కలిశారు. పై అధికారుల ఒత్తిడి కారణంగానే అప్పుడు అలా చేసినట్లు వివరించారు. అధికార పార్టీ విధానాలను అమలుచేయడం ప్రభుత్వ ఉద్యోగులకు తప్పదని సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ ప్రెస్‌మీట్‌లో తెలిపారు.
కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం హయాంలో రూ.300 కోట్ల స్కామ్ జరిగిందని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆరోపించారు. బీజేపీ నేతలను ఉద్దేశిస్తూ ‘ఫాదర్స్ ఆఫ్ కరప్షన్’ అని కామెంట్స్ చేశారు. యడియూరప్ప, బసవరాజు బొమ్మై నేతృత్వంలోని ప్రభుత్వాల హయాంలో ఈ కుంభకోణాలు జరిగాయని, వీటిపై విచారణ జరిపిస్తామని మీడియాతో చెప్పారు. స్కామ్ వివరాలను అసెంబ్లీలో వెల్లడిస్తామని పేర్కొన్నారు.
జావెలిన్ క్రీడకు మరింత గుర్తింపు తీసుకురావడమే తన లక్ష్యం అని భారత్ స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా తెలిపారు. స్టార్ క్రికెటర్లు ధోనీ, కోహ్లీతో తనను తాను పోల్చుకోనని స్పష్టం చేశారు. ఒలింపిక్స్ తర్వాత తనకు మంచి గుర్తింపు వచ్చిందని, కానీ క్రికెటర్లతో పోలిస్తే అది తక్కువన్న విషయం తనకు తెలుసన్నారు. దేశంలోని ప్రతి గల్లీలో క్రికెట్ ఆడతారని, అందుకే పాపులర్ అయిందని అభిప్రాయపడ్డారు.
‘తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ’ బిల్లును ఈనెల 23 నుంచి జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. HYDలో ఏర్పాటు చేసే ఈ వర్సిటీలో డిగ్రీ, డిప్లొమాతో పాటు సర్టిఫికెట్ కోర్సులను ప్రవేశపెట్టనున్నారు. తొలుత 2 వేల మందితో ప్రారంభించి క్రమంగా ఏడాదికి 20 వేల మందికి అడ్మిషన్లు కల్పిస్తారు. కోర్సులు పూర్తి చేసిన వారికి ఉద్యోగాలు కల్పించేలా ప్రణాళికలు ఉండాలని అధికారులను CM ఆదేశించారు.
Sorry, no posts matched your criteria.