India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కాంట్రాక్టు పద్ధతిన 1,040 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ల నియామకానికి SBI నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులు తప్పనిసరిగా గ్రాడ్యుయేషన్, మాస్టర్స్‌తో పాటు సంబంధిత రంగంలో 3-5ఏళ్ల అనుభవం కలిగి ఉండాలి. sbi.co.inలో నేటి నుంచి ఆగస్టు 8 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల దరఖాస్తులను పరిశీలించి షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూకి పిలుస్తారు. మరిన్ని వివరాలకు పైన పేర్కొన్న వెబ్‌సైట్లో చూడండి.
TG: నియోజకవర్గాల్లో సెమీరెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటుపై అధికారులు ఫోకస్ పెట్టాలని CM రేవంత్ ఆదేశించారు. ప్లేస్కూల్ తరహాలో అంగన్వాడీలోనే 3వ తరగతి వరకు విద్యాబోధన అందించేందుకు అదనపు టీచర్ నియామకానికి ప్రణాళికలు రూపొందించాలన్నారు. గ్రామాల నుంచి సెమీరెసిడెన్షియల్ స్కూల్‌కు ప్రభుత్వమే రవాణా సదుపాయం కల్పించేలా చూడాలన్నారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటుపై అధికారులతో CM భేటీ అయ్యారు.
జింబాబ్వే పర్యటనలో అంతగా ఆకట్టుకోకపోయినా శ్రీలంకతో వన్డే, T20 సిరీస్‌లకు రియాన్ పరాగ్‌ను ఎంపిక చేయడం పలువురిని ఆశ్చర్యపరిచింది. మరోవైపు అదే సిరీస్‌లో సత్తా చాటిన అభిషేక్, రుతురాజ్‌లను పక్కన పెట్టడం చర్చనీయాంశంగా మారింది.. పరాగ్‌ను IPL ప్రదర్శన ఆధారంగానే సెలక్ట్ చేసినట్లు టాక్. అలాగే విజయ్ హజారే, SMATలో విశేషంగా రాణించడంతో జట్టులో చోటు కల్పించారు. మరోవైపు రంజీ ట్రోఫీలో కూడా నిలకడగా రాణిస్తున్నారు.
TG: రాష్ట్రంలో త్వరలోనే రేషన్ కార్డులు ఇస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు ప్రభుత్వం సన్నాహకాలు చేస్తోందన్నారు. రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు వేర్వేరుగా ఇస్తామని ఆయన వివరించారు. కరీంనగర్‌లోని బొమ్మకల్‌లో రైతు భరోసా పథకంపై ఏర్పాటు చేసిన రైతుల అభిప్రాయ సేకరణ కార్యక్రమంలో ఆయన ఈ ప్రకటన చేశారు.
జపాన్‌లో ఓ పాఠశాలకు చెందిన 14 మంది విద్యార్థులు స్పైసీ పొటాటో చిప్స్ తిని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీటిని భారత్‌లో దొరికే భూట్ జోలోకియా అనే మిరపకాయతో తయారు చేస్తారు. అస్సాం, నాగాలాండ్, మణిపుర్‌లో లభించే ఈ మిర్చికి హాటెస్ట్ చిల్లీగా గిన్నిస్ రికార్డ్ ఉంది. ఈ చిప్స్‌ని 18 ఏళ్లలోపు వారు తినకూడదనే హెచ్చరిక ఉన్నప్పటికీ విద్యార్థులు తినడంతో మంటను తట్టుకోలేపోయారు. దీంతో వారిని ఆస్పత్రికి తరలించారు.
కోలీవుడ్ హీరో విక్రమ్ నటిస్తున్న పీరియాడికల్ యాక్షన్ మూవీ ‘తంగలాన్’ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. ఈ సినిమాను ఆగస్టు 15న పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు. పా.రంజిత్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో మాళవిక మోహనన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమాలో విక్రమ్ ట్రైబల్ లీడర్‌గా కనిపించనున్నారు.
విండోస్‌లో తలెత్తిన సమస్యను పరిష్కరించినట్లు మైక్రోసాఫ్ట్ తెలిపింది. బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్‌కు కారణమైన క్రౌడ్ స్ట్రైక్ అప్డేట్ వెనక్కి తీసుకున్నట్లు వెల్లడించింది. దీనికి డీబగ్ ఫిక్స్ చేసి సమస్య పరిష్కరించినట్లు పేర్కొంది. కాగా ప్రపంచవ్యాప్తంగా సిస్టమ్‌లు షట్‌డౌన్/రీస్టార్ట్ అయ్యాయి. దీంతో పలు రంగాల్లో వివిధ రకాల సేవలకు అంతరాయం కలిగింది. మిలియన్ల కొద్దీ యూజర్లు తీవ్ర అవస్థలు పడ్డారు.
<<13657021>>ముస్లిం చట్టాలు<<>> బాల్య వివాహాలను ప్రోత్సహిస్తున్నాయన్న అస్సాం CM హిమంత వ్యాఖ్యలను లక్నోకు చెందిన ఇమామ్ మౌలానా కొట్టిపారేశారు. ‘ఏ ముస్లిం ఆర్గనైజేషన్ బాల్య వివాహాలను ప్రోత్సహించదు. ఆడవాళ్లకు 18, మగవాళ్లకు 21ఏళ్లు పెళ్లి వయసుగా చట్టమే నిర్ణయించింది. షరియా చట్టం, ఉమెన్ ప్రొటెక్షన్ యాక్ట్ జాతీయ స్థాయిలో అమలులో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలను రద్దు చేయాల్సిన అవసరం లేదు’ అని అన్నారు.
ప్రతిసారిలాగే ఈ సారి కూడా టీమ్ ఇండియా వికెట్ కీపర్ సంజూ శాంసన్‌కు అన్యాయం జరిగిందని ఫ్యాన్స్ అంటున్నారు. శ్రీలంకతో టీ20 సిరీస్‌కు అవకాశమిచ్చిన సెలక్టర్లు వన్డేలకు మాత్రం మొండిచేయి చూపారు. భారత్ చివరిసారిగా దక్షిణాఫ్రికాతో ఆడిన వన్డేలో శాంసన్ సెంచరీ చేశారు. అయినా ఆయనను బీసీసీఐ పరిగణనలోకి తీసుకోలేదు. దూబే లేదా పరాగ్‌లలో ఎవరో ఒకరి స్థానంలో సంజూకు చోటివ్వాల్సిందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
TG: త్వరలో ఉద్యోగ ఖాళీలపై జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ‘ఓవర్ ల్యాపింగ్ లేకుండా ఎగ్జామ్స్ నిర్వహిస్తాం. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారి కోసం త్వరలో ప్రతి అసెంబ్లీ స్థానంలో అంబేడ్కర్ నాలెడ్జ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. ఇందులో ఉ.10 నుంచి సా.5 వరకు ఆన్‌లైన్‌లో ఉచిత శిక్షణ ఇస్తాం. ఇప్పటికే నిపుణులను ఎంపిక చేశాం’ అని భట్టి వివరించారు.
Sorry, no posts matched your criteria.