news

News October 18, 2024

సద్గురుకు సుప్రీంకోర్టులో ఊరట.. కేసు కొట్టివేత

image

సద్గురు/జగ్గీ వాసుదేవ్‌కు ఊరట లభించింది. బ్రెయిన్‌వాష్ చేసి తమ కుమార్తెలను ఈశా యోగా సెంటర్లోనే ఉంచుతున్నారని ఓ తండ్రి వేసిన <<14260998>>HCPని<<>> సుప్రీంకోర్టు కొట్టేసింది. తామిద్దరం మేజర్లమని, ఇష్టంతోనే అక్కడ ఉంటున్నామని, ఆశ్రమం నుంచి బయటకెళ్లే స్వేచ్ఛ తమకుందన్న కుమార్తెల వాంగ్మూలాలను కోర్టు నోట్‌ చేసుకుంది. ఈశా సెంటర్ పాటించాల్సిన ఇతర రూల్స్‌పై ఈ కేసు క్లోజింగ్ ప్రొసీజర్స్ ప్రభావం ఉండదని స్పష్టం చేసింది.

News October 18, 2024

‘గేమ్ ఛేంజర్’ సాంగ్‌కు రూ.20 కోట్ల ఖర్చు?

image

తన సినిమాల్లోని సాంగ్స్‌కు రూ.కోట్లు ఖర్చు పెట్టడం శంకర్ స్పెషాలిటీ. కనువిందు చేసే సెట్టింగ్స్, కాస్ట్యూమ్స్‌తో ప్రేక్షకుడిని మైమరిపించేందుకు ఆయన వెనకాడరు. ప్రస్తుతం ఆయన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌తో ‘గేమ్ ఛేంజర్’ మూవీ తీస్తున్నారు. అయితే, అందులో ఓ మెలోడీ సాంగ్ కోసం రూ.20 కోట్లు ఖర్చు చేసినట్లు టాక్ వినిపిస్తోంది. అదిరిపోయే లొకేషన్స్‌లో కియారా, చరణ్ మధ్య సాగిన ఈ సాంగ్ అద్భుతంగా ఉంటుందని సమాచారం.

News October 18, 2024

విజయనగరం: 8కి చేరిన డయేరియా మృతుల సంఖ్య

image

AP: విజయనగరం(D) గుర్లలో <<14366235>>డయేరియా<<>> మృతుల సంఖ్య 8కు చేరింది. ఈనెల 13న ఒకరు, 15న నలుగురు, 17న ఇద్దరు మృతిచెందగా తాజాగా మరో వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయారు. పలువురు బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరణాలు పెరగడంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.

News October 18, 2024

సుప్రీంకోర్టులో గ్రూప్-1 అభ్యర్థుల పిటిషన్

image

TG: గ్రూప్-1 మెయిన్స్‌ను వాయిదా వేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రభుత్వం రూల్ ఆఫ్ లా పాటించట్లేదని అభ్యర్థుల తరఫు లాయర్ మోహిత్ పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ సోమవారం విచారణకు రానుంది. మరోవైపు గ్రూప్-1 ప్రిలిమ్స్ ప్రశ్నపత్రాల్లో తప్పులున్నాయంటూ పలువురు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు సింగిల్ బెంచ్ కొట్టేసింది. ఆ తీర్పును వారు డివిజన్ బెంచ్‌లో సవాల్ చేశారు. దీనిపై కాసేపట్లో విచారణ జరగనుంది.

News October 18, 2024

4 ఓవర్లలో 58 రన్స్ బాదారు!

image

INDతో తొలి టెస్టులో NZ బ్యాటర్లు రెచ్చిపోతున్నారు. లంచ్ బ్రేక్‌కు ముందు టీ20 తరహాలో బ్యాటింగ్ చేశారు. చివరి 4 ఓవర్లలో ఏకంగా 58 రన్స్ బాదేశారు. దీంతో కివీస్ తొలి ఇన్నింగ్స్ స్కోరు 345/7కి చేరింది. రచిన్(104), సౌథీ(49) నాటౌట్‌గా నిలిచారు. ప్రస్తుతం NZ ఆధిక్యం 299గా ఉంది. భారత్ తొలి ఇన్నింగ్స్‌ స్కోరు 46 రన్స్ కాగా NZ పేసర్ సౌథీ ఒక్కడే టీమ్‌ఇండియా కంటే ఎక్కువ రన్స్ చేయడం గమనార్హం.

News October 18, 2024

J&Kకు రాష్ట్ర హోదా కల్పించాలని ఒమర్ క్యాబినెట్ తీర్మానం

image

J&Kకు రాష్ట్ర హోదా కల్పించాలని అక్కడి ప్రభుత్వం తీర్మానం చేసింది. నిన్న జరిగిన తొలి మంత్రివర్గ సమావేశంలో ఒమర్ సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. సీఎం తీర్మానపు కాపీతో త్వరలో ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీకి అందజేయనున్నారని తెలుస్తోంది. కాగా 2019 ఆగస్టు 5న కేంద్రం J&K రాష్ట్రాన్ని జమ్మూకశ్మీర్, లద్దాక్ కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది.

News October 18, 2024

మధ్యాహ్నం జగన్ ప్రెస్ మీట్

image

AP: మాజీ సీఎం జగన్ మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు. నూతన మద్యం పాలసీ, ఇసుక విధానాలు, వైసీపీ నేతలపై కేసులు, ఇతర అంశాలపై మాట్లాడే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో వైసీపీ కార్యాచరణను వివరిస్తారని సమాచారం.

News October 18, 2024

ఖలిస్థాన్ మూమెంట్‌ను విస్మరించిన వెస్ట్రన్ కంట్రీస్: కెనడా ఎక్స్‌పర్ట్

image

తమకు హాని లేదు కాబట్టే ఖలిస్థానీ మూమెంట్‌ను వెస్ట్రన్ కంట్రీస్ పట్టించుకోలేదని కెనడా సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్ జో ఆడమ్ జార్జ్ అన్నారు. సిక్కులంతా ఖలిస్థానీలే, ఖలిస్థానీలంతా సిక్కులే అన్న ఫండమెంటల్ ప్రాబ్లమ్ వల్లే భారత ఆందోళనను వారు అర్థం చేసుకోలేదన్నారు. ‘ప్రభుత్వాల అలసత్వాన్ని ఖలిస్థానీలు వాడుకుంటున్నారు. భయం, దాడులు, డబ్బు, బ్రెయిన్‌వాష్‌తో యువతను చేర్చుకొని ఉద్యమం నడిపిస్తున్నారు’ అని చెప్పారు.

News October 18, 2024

విషాదం.. సెలవుల తర్వాత స్కూలుకు వెళ్లిన రోజే..

image

AP: దసరా సెలవుల తర్వాత పాఠశాలకు వెళ్లిన కాసేపట్లోనే బాలిక ఆత్మహత్య చేసుకుంది. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలోని ఏకలవ్య రెసిడెన్షియల్ స్కూల్లో లావణ్య (12) ఏడో తరగతి చదువుతోంది. సెలవుల తర్వాత నిన్న తల్లి స్కూలుకు తీసుకెళ్లింది. తోటి విద్యార్థులెవరూ ఇంకా రాలేదని, రేపు వద్దాం అమ్మా అని లావణ్య చెప్పగా.. తల్లి సర్ది చెప్పింది. తల్లి ఇంటికి బయల్దేరిన కాసేపటికే లావణ్య తన గదిలో ఉరేసుకుంది.

News October 18, 2024

‘RRR’ క్రేజ్.. 21 నెలలుగా ప్రదర్శన

image

జపాన్‌లో ‘RRR’ మూవీ చరిత్ర సృష్టించింది. అక్కడి 71 ఏళ్ల పురాతన థియేటర్‌లో ఈ సినిమా ఏకధాటిగా 21 నెలలుగా ప్రదర్శితమవుతోంది. మరో వారం పాటు చిత్రాన్ని కొనసాగించనున్నట్లు యాజమాన్యం Xలో ప్రకటించింది. దీన్ని RRR టీమ్ రీట్వీట్ చేస్తూ అక్కడి ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపింది. కాగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.1,300 కోట్ల కలెక్షన్లు సాధించడంతోపాటు ‘నాటునాటు’ పాటకు ఆస్కార్‌ను సొంతం చేసుకుంది.