news

News October 18, 2024

జగన్ ఎప్పటికీ ప్రతిపక్షంలోనే: హోంమంత్రి అనిత

image

AP: సాధ్యంకాని హామీలు ఇవ్వబోమని, ప్రతిపక్షంలో ఉండటానికి సిద్ధమేనని మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి అనిత సెటైర్లు వేశారు. ఎప్పటికీ ప్రతిపక్షంలోనే ఉంటామని ఆయన ఫిక్స్ అయ్యారని చెప్పారు. ప్రస్తుతం జగన్ కేవలం పులివెందుల ఎమ్మెల్యే మాత్రమేనని, విపక్ష హోదాలో ఉండే అర్హత కూడా లేదని చెప్పారు. గత ఐదేళ్లలో టీడీపీ నేతలపై ఎన్నో కేసులు పెట్టి వేధించారని మండిపడ్డారు.

News October 18, 2024

రచిన్ రవీంద్ర సూపర్ సెంచరీ

image

భారత్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ బ్యాటర్ రచిన్ రవీంద్ర సెంచరీ చేశారు. 124 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సులతో 100 రన్స్ పూర్తి చేసుకున్నారు. భారత స్పిన్నర్లపై ఎదురు దాడి చేస్తూ స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. ప్రస్తుతం NZ స్కోర్ 335/7గా ఉంది. ఆ జట్టు 289 రన్స్ ఆధిక్యంలో కొనసాగుతోంది.

News October 18, 2024

మయోసైటిస్‌తో అంతా మర్చిపోయా: సమంత

image

తాను మయోసైటిస్ కారణంగా ఎదుర్కొన్న సమస్యలను హీరోయిన్ సమంత గుర్తుచేసుకున్నారు. ‘సిటాడెల్’ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు. ‘నేను ఒక్కసారిగా అంతా మర్చిపోయా. మతిమరుపు వచ్చినట్టు అయి చాలా ఇబ్బంది పడ్డాను. నన్ను ఎవరూ ఆస్పత్రికి తీసుకెళ్లలేదని, హెల్త్ గురించి ఎవరూ అడగలేదని ఇప్పుడు అనుకుంటుంటా’ అని తెలిపారు. తాను మళ్లీ సెట్స్‌పైకి వచ్చే వరకు నిర్మాతలు వెయిట్ చేసినందుకు కృతజ్ఞురాలై ఉంటానని చెప్పారు.

News October 18, 2024

జగన్ రాక్షస పాలనను ప్రజలు మర్చిపోలేరు: మంత్రి అనగాని

image

AP: టీడీపీ కార్యాలయంపై దాడి జరిగి రేపటితో మూడేళ్లు పూర్తవుతుందని, తప్పుచేసిన వారు శిక్ష నుంచి తప్పించుకోలేరని మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు. జగన్ రాక్షస పాలనను ప్రజలు మర్చిపోలేరన్నారు. దెబ్బతిన్న రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు సీఎం చంద్రబాబు ఎంతో కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. టీడీపీ నేతలు దోపిడీకి పాల్పడకూడదన్నదే ఆయన ఉద్దేశమని పేర్కొన్నారు.

News October 18, 2024

రోలెక్స్ పాత్రపై సూర్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్

image

తమిళ స్టార్ హీరో సూర్య పోషించిన ‘రోలెక్స్’ పాత్రకు చాలా క్రేజ్ ఉంది. విక్రమ్ సినిమాలో కేవలం 5 నిమిషాలే కనిపించినా ఈ పాత్రకు ఎనలేని గుర్తింపు వచ్చింది. అయితే, రోలెక్స్ పాత్ర గురించి సూర్య ‘కంగువా’ ప్రమోషన్స్‌లో ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. ‘రోలెక్స్ సినిమాకి ఇది వరకే నేను చేసిన మరో సినిమాకి కనెక్షన్ ఉంది’ అని చెప్పారు. దీంతో ఆ సినిమా ఏంటనే దానిపై ఆసక్తి నెలకొంది. దీనిపై మీ కామెంట్.

News October 18, 2024

హర్దీప్‌సింగ్ నిజ్జర్ ఓ ఫారిన్ టెర్రరిస్ట్: కెనడా ప్రతిపక్ష నేత

image

హర్దీప్‌సింగ్ నిజ్జర్ తమ పౌరుడే కాదని కెనడా పీపుల్స్ పార్టీ నేత మాగ్జిమ్ బెర్నియర్ అన్నారు. అతడినో ఫారిన్ టెర్రరిస్ట్‌గా పేర్కొన్నారు. ‘భారత్‌పై లిబరల్ పార్టీ ఆరోపణలు తీవ్రమైనవి. ఇప్పటికీ వాటిపై ఆధారాలే ఇవ్వలేదు. అంటే ఇతర వివాదాల నుంచి దారిమళ్లించేందుకే ట్రూడో ఈ క్రైసిస్‌ను వాడుకుంటున్నారు. తప్పుడు పత్రాలతో ఆశ్రయం పొందిన నిజ్జర్ పౌరసత్వాన్ని ఇప్పటికైనా రద్దు చేసి తప్పు దిద్దుకోవాలి’ అని చెప్పారు.

News October 18, 2024

క్రాష్ అవుతున్నా PSU షేర్లపై రిటైల్ ఇన్వెస్టర్ల బిగ్ బెట్టింగ్

image

ధరలు పడిపోతున్నా PSU షేర్లపై రిటైల్ ఇన్వెస్టర్ల మోజు తగ్గడం లేదు. సెప్టెంబర్ క్వార్టర్లో షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ గమనిస్తే 68కి 56 కంపెనీల్లో వీరి వాటా గణనీయంగా పెరిగింది. వీటిలో 16 మాత్రమే మెరుగైన రాబడి అందించాయి. 52WEEK HIGH నుంచి 20-30% తగ్గినా కెనరా బ్యాంక్, IREDA, బరోడా బ్యాంక్, HUDCO, MTNL, SJVN, BEL, RVNL షేర్లలో వాటా పెంచుకున్నారు. కెనరాలో 4.26 లక్షలు, IREDAలో 3.70 లక్షల మంది పెరిగారు.

News October 18, 2024

TG: ఈ జిల్లాల్లో వర్షాలు

image

తెలంగాణలోని పలు జిల్లాల్లో నేటి నుంచి 3 రోజులపాటు మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఖమ్మం, వరంగల్, రంగారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, కొమురం భీం ఆసిఫాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మిగతా జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని తెలిపింది.

News October 18, 2024

రూ.50 కోట్లకు ‘గేమ్ ఛేంజర్’ ఓటీటీ డీల్?

image

శంకర్ డైరెక్షన్‌లో రామ్ చరణ్-కియారా జంటగా నటిస్తున్న గేమ్ ఛేంజర్ మూవీపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, రెండు పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ ఏకంగా రూ.50 కోట్లకు సొంతం చేసుకున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 10న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకురానుంది.

News October 18, 2024

BREAKING: భారీగా పెరిగిన బంగారం ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు మరోసారి భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ ఏకంగా రూ.870 పెరిగి రూ.78,980కి చేరుకుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.800 పెరగడంతో రూ.72,400 పలుకుతోంది. కేజీ సిల్వర్ రేటు రూ.2,000 పెరిగి రూ.1,05,000కు చేరింది.