India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం 2 రోజుల్లో మరింత బలపడి ఒడిశా తీరంవైపు కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో ఇవాళ ప్రకాశం, నంద్యాల, శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, కృష్ణా, NTR, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, విజయనగరం, గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.
పూరీ రత్నభాండాగారంలో రహస్య గది నుంచి సొరంగ మార్గం ఉందా? లేదా? అనేది ASI లేజర్ స్కానింగ్‌లో తెలిసే ఛాన్సుందని అధికారులు అంటున్నారు. అయితే దీనికి ప్రభుత్వం అనుమతి ఇవ్వాల్సి ఉందని తెలిపారు. మరోవైపు భాండాగారం నుంచి పురాతన రాజప్రసాదం వరకు సొరంగ మార్గం ఉందని, ఆ మార్గంలో ఉన్న 5 రహస్య గదుల్లో స్వామివారి సంపద ఉన్నట్లు ఆలయ అర్చకుల్లో ఒకరైన స్వయిన్ మహాపాత్ర్ చెబుతున్నారు.
మహిళల ఆసియా కప్-2024లో భాగంగా ఇవాళ భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. శ్రీలంకలోని దంబుల్లా వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. స్టార్ స్పోర్ట్స్ ఛానల్‌తో పాటు హాట్‌స్టార్‌లో వీక్షించవచ్చు. అంతర్జాతీయ మహిళల టీ20ల్లో IND, PAK ఇప్పటివరకు 14 మ్యాచుల్లో తలపడగా భారత్ 11, పాక్ 3 విజయాలు సాధించాయి. ఈ టోర్నీ చరిత్రలో ఇప్పటివరకు 8 ఎడిషన్లు జరగగా IND 7సార్లు ఛాంపియన్‌గా నిలిచింది.
AP: ఓ అధ్యయనం ప్రకారం రాష్ట్రంలో 2022లో బాలల నేరాల సంఖ్య 912. దీనిలో 41మంది పిల్లలు అత్యాచారం మరో 27మంది హత్యలు చేశారు. ఏటేటా ఇది మరింతగా పెరుగుతోంది. పెద్దవారిని దారిలో పెట్టేందుకు శిక్షలున్నాయి. తప్పొప్పుల తేడా తెలియని పిల్లల్ని శిక్షించేదెలా? నేరతీవ్రతను బట్టి పెద్దలతో సమానంగా శిక్షించాలా? లేక మారుతారన్న నమ్మకంతో పరివర్తనకు కృషి చేయాలా? తాజా ముచ్చుమర్రి ఘటన ఇలాంటి ప్రశ్నల్నే లేవనెత్తుతోంది.
బౌలర్లు ఓవర్ వేసిన అనంతరం బౌండరీ లైన్ వద్ద డ్రింక్స్ తాగడాన్ని మాజీ క్రికెటర్ గవాస్కర్ తప్పుబట్టారు. బ్యాటర్లకు లేని సౌకర్యం బౌలర్లకు ఎందుకు ఉండాలంటూ ప్రశ్నించారు. ‘ప్రతి ఓవర్‌కి బ్యాటర్ డ్రింక్స్ తాగుతానంటే కుదరదు. మరి బౌలర్లు మాత్రం సొంత డ్రింక్స్ బ్రేక్ ఎలా తీసుకుంటారు? క్రికెటర్లు అలసటను తట్టుకోవాలి. తప్పదనుకుంటే ప్రత్యర్థి కెప్టెన్, అంపైర్ల అనుమతి తీసుకోవాలి’ అని సూచించారు.
తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. హైదరాబాద్‌లో నిన్న రాత్రి నుంచి వాన పడుతూనే ఉంది. దీంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. మరోవైపు ఇవాళ 10 <<13657926>>జిల్లాల్లో<<>> అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడతాయంటూ IMD రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నేడు విద్యాసంస్థలకు సెలవు ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తోంది. దీనిపై మీ కామెంట్?
AP, TG ఉమ్మడి ప్రాజెక్టు పెద్దవాగుకు భారీ <<13656916>>గండి<<>> పడటంతో 14 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. కరెంట్, సెల్‌ఫోన్ సిగ్నల్స్ పనిచేయకపోవడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడిపారు. అశ్వారావుపేట(M) నారాయణపురంలో వరదలో చిక్కుకున్న 28మందిని హెలికాప్టర్ ద్వారా కాపాడారు. ప్రాజెక్టు నిండినా అధికారులు గేట్లు ఎత్తకపోవడమే గండికి కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
భారత జట్టుకు ఆడిన 2వ మ్యాచ్‌లోనే సెంచరీ బాదిన అభిషేక్ శర్మకు శ్రీలంకతో సిరీస్‌లో చోటు దక్కలేదు. జింబాబ్వే టూర్‌లో నిలకడగా రాణించిన రుతురాజ్ గైక్వాడ్‌కూ నిరాశే ఎదురైంది. శర్మ 47 బంతుల్లో శతకం బాదగా గైక్వాడ్ 3 మ్యాచుల్లో 133 రన్స్ చేశారు. ఈ నేపథ్యంలో పేలవ ప్రదర్శన చేసిన పరాగ్ వంటి వారికి టీ20, వన్డే జట్లలో చోటిచ్చి వీరిద్దరికీ సెలక్టర్లు మొండిచేయి చూపారంటూ ఫ్యాన్స్‌లో చర్చ నడుస్తోంది. మీరేమంటారు?
పూరీ రత్నభాండాగారంలో పాములు లేవని అధికారులు తెలిపారు. నిన్న రహస్య గదిని తెరిచి సంపదను తాత్కాలిక స్ట్రాంగ్‌రూమ్‌లో భద్రపరిచారు. ‘సీక్రెట్ రూమ్‌లో పెద్ద పరిమాణంలో 3 పెట్టెలు(2చెక్కవి, 1 స్టీల్), 4 అల్మారాలు(3 చెక్కవి, ఒకటి స్టీల్) ఉన్నాయి. వాటిలో ఆభరణాలున్నాయి. వాటి వివరాలను బయటకు చెప్పలేం. స్వామి వారి సంపద చెక్కుచెదరలేదు. రహస్య గది నుంచి సొరంగమార్గం ఉందన్న అంశాన్ని పరిశీలించలేదు’ అని పేర్కొన్నారు.
TG: ఇవాళ రాష్ట్రంలోని ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని IMD రెడ్ అలర్ట్ జారీ చేసింది. అసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురుస్తాయంది. రేపు ఆదిలాబాద్, అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో అత్యంత భారీ వానలు పడతాయని IMD పేర్కొంది.
Sorry, no posts matched your criteria.