news

News October 18, 2024

నేడు స్కూళ్లకు సెలవు ఉందా?

image

AP: వాయుగుండం వల్ల భారీ వర్షాలు కురవడంతో గత 3, 4 రోజులుగా పలు జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. నిన్న వాయుగుండం తీరం దాటడంతో అతిభారీ వర్షాల ముప్పు తగ్గిందని వాతావరణ అధికారులు తెలిపారు. దీంతో నేడు స్కూళ్లకు సెలవు ప్రకటించలేదు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో విద్యాసంస్థలు యథావిధిగా నడవనున్నాయి. ఇవాళ పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది.

News October 18, 2024

ఇంటర్ విద్యార్థులకు అలర్ట్

image

AP: ఇంటర్ విద్యార్థుల పరీక్ష ఫీజు చెల్లింపునకు ఇంటర్మీడియట్ విద్యా మండలి షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 21 నుంచి వచ్చే నెల 11 వరకు ఫీజు చెల్లించవచ్చని తెలిపింది. అలాగే రూ.1,000 ఆలస్య రుసుముతో నవంబర్ 20లోగా కట్టొచ్చని వెల్లడించింది. ఈ గడువు తర్వాత ఇక అవకాశం ఉండదని స్పష్టం చేసింది. ఇంటర్ ఎగ్జామ్స్ ప్రైవేట్‌గా రాసేవారు రూ.1,500తో వచ్చే నెల 30లోగా, రూ.500 పెనాల్టీతో నవంబర్ 30లోగా ఫీజు చెల్లించవచ్చు.

News October 18, 2024

టీవీ యాంకర్ టు మిస్ ఇండియా

image

ఫెమినా మిస్ ఇండియాగా నికిత పోర్వాల్ నిలిచారు. 24 ఏళ్ల నికిత MPలోని ఉజ్జయినిలో జన్మించారు. బరోడాలో పీజీ చదువుతున్నారు. కుటుంబానికి అండగా నిలిచేందుకు 18 ఏళ్లకే టీవీ యాంకర్‌గా పనిచేశారు. ఆమెకు భక్తి ఎక్కువ, జంతువులంటే అమితమైన ప్రేమ. ‘కృష్ణలీల’ అనే నాటకాన్ని స్వయంగా రాశారు. బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ మూవీలో నటించాలనుందని నికిత తెలిపారు. త్వరలోనే ఆమెను సిల్వర్ స్క్రీన్‌పై చూసే అవకాశముంది.

News October 18, 2024

నేటి నుంచే ప్రొ కబడ్డీ లీగ్

image

ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రొ కబడ్డీ లీగ్ నేటి నుంచే ప్రారంభం కానుంది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో ఇవాళ తెలుగు టైటాన్స్, బెంగళూరు బుల్స్ తలపడతాయి. కాగా ఈ ఏడాది 12 జట్లు మెగా టోర్నీలో పాల్గొంటున్నాయి. మొత్తం 137 మ్యాచ్‌లు జరుగుతాయి. టోర్నీలో తొలి మ్యాచ్ రాత్రి 8 గంటలకు, రెండో మ్యాచ్ రాత్రి 9 గంటలకు ప్రారంభం అవుతుంది.

News October 18, 2024

YAHYA SINWAR: రెండు దశాబ్దాలు జైల్లోనే

image

హమాస్ చీఫ్ యాహ్యా సిన్వర్‌ను ఐడీఎఫ్ దళాలు మట్టుబెట్టాయి. కాగా సిన్వర్ 1962లో గాజాలోని ఖాన్ యూనిస్‌లో జన్మించారు. గాజా వర్సిటీలో డిగ్రీ పూర్తి చేశారు. ఇజ్రాయెల్‌తో సంబంధం ఉన్నవారిని హత్య చేసినందుకు సిన్వర్‌ను 1988లో అరెస్ట్ చేశారు. 2011 వరకు ఆయన ఇజ్రాయెల్ జైల్లోనే గడిపారు. ఆ తర్వాత బయటకు వచ్చి హమాస్‌లో వేగంగా ఎదిగారు. 2015లో అతడిని US ఉగ్రవాదిగా ప్రకటించింది. 2017లో హమాస్ చీఫ్‌గా ఎన్నికయ్యారు.

News October 18, 2024

నన్ను క్యూటీ అంటావా..? జెప్టోపై యువతి ఆగ్రహం

image

జెప్టో యాప్ తనను ‘క్యూటీ’గా సంబోధిస్తూ పుష్ నోటిఫికేషన్ పంపించడంపై బెంగళూరుకు చెందిన మహక్ అనే యువతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మహిళలపై అక్రమాలను ప్రశ్నించే యుగంలో ఉన్నాం మనం. నేనెవరో తెలియకుండా అలా క్యూటీ అని పంపించడమేంటి? నేను షాకయ్యా’ అని లింక్డ్‌ ఇన్‌లో ఆమె మండిపడ్డారు. కొంతమంది ఆమెకు మద్దతునిస్తుండగా, మరికొంతమంది మాత్రం చిన్న విషయాన్ని పెద్దది చేస్తున్నారంటూ ఆమెను విమర్శిస్తున్నారు.

News October 18, 2024

ఒంటరిగా మారుతోన్న భారత్?

image

ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదంలో భారత్ తన వైఖరి తేల్చిచెప్పలేకపోతోంది. ప్రపంచంలోని మెజారిటీ దేశాలు ఖండిస్తున్నా, మన దేశం మాత్రం ఐక్యరాజ్యసమితిలో తన అభిప్రాయాన్ని చెప్పలేకపోతోంది. చివరకు నాటో దేశాలు కూడా పాలస్తీనా మారణహోమంపై ఇజ్రాయెల్‌ను బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలతో ఇండియా ఒంటరి అవుతున్నట్లే కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

News October 18, 2024

అంటార్కిటికాలో మిస్టరీ తలుపు.. నిపుణులేమంటున్నారంటే..

image

అంటార్కిటికాలో ఓ మంచు కొండకు తలుపులా ఉన్న ఆకారం గూగుల్ మ్యాప్‌లో ఓ నెటిజన్‌కు కనిపించింది. అదేదో రహస్య ప్రాంతంలా ఉందంటూ అతడు రెడిట్‌లో పోస్ట్ పెట్టగా అది చర్చనీయాంశంగా మారింది. ఆ పోస్ట్ వైరల్ కాగా, అమెరికాలోని న్యూకాజిల్ వర్సిటీకి చెందిన ప్రొఫెసర్ స్పష్టతనిచ్చారు. ‘చూసేందుకు తలుపులా ఉన్నప్పటికీ అది కొండ నుంచి పొడుచుకొచ్చిన రాతి భాగం కావొచ్చు. మంచు ఘనీభవించడంతో అలా కనిపిస్తోంది’ అని వివరించారు.

News October 18, 2024

రెండు భాగాలుగా మహేశ్-రాజమౌళి సినిమా?

image

సూపర్‌స్టార్ మహేశ్‌తో రాజమౌళి తెరకెక్కించే సినిమా 2 భాగాలుగా రానుందా? నెట్టింట ఇదే చర్చ నడుస్తోంది. కథ విస్తృతమైనది కావడంతో ఒక భాగంలో మొత్తం చెప్పడం సాధ్యం కాదని, 2 భాగాలుగా తీయాలని రాజమౌళి అండ్ కో భావిస్తున్నారని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. వీటికి లభించే ఆదరణ బట్టి మున్ముందు మరిన్ని సీక్వెల్స్ కూడా వచ్చేందుకు అవకాశం ఉందంటున్నాయి. మూవీ టీమ్ నుంచి దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.

News October 18, 2024

‘నాయుడుగారి తాలూకా’ అంటున్న నాని

image

న్యాచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూవీ గురించి ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రానికి ‘నాయుడుగారి తాలూకా’ టైటిల్ పరిశీలిస్తున్నట్లు టాక్. నాని సరసన బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అనిరుధ్ మ్యూజిక్ అందిస్తారు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్తుందని సమాచారం. చెరుకూరి సుధాకర్ నిర్మాతగా వ్యవహరించనున్నారు.