news

News October 30, 2024

పార్టీ నేతలకు CM రేవంత్ స్ట్రాంగ్ వార్నింగ్!

image

TG: పార్టీని ఇబ్బంది పెట్టేలా స్టేట్‌మెంట్స్ ఇస్తున్న కొందరు కాంగ్రెస్ నేతలకు CM రేవంత్, TPCC చీఫ్ మహేశ్ ‌కుమార్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. పార్టీ లైన్ దాటి మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించినట్లు సమాచారం. పద్ధతి మార్చుకోకపోతే ఇబ్బందులు తప్పవని స్పష్టం చేశారు. సమంతపై మంత్రి కొండా సురేఖ, కలెక్టర్ల విషయంలో మాజీ MLA జగ్గారెడ్డి కామెంట్స్ దుమారం లేపిన విషయం తెలిసిందే.

News October 30, 2024

రేవంత్ కామెంట్స్‌పై స్పందించిన హరీశ్‌రావు

image

TG: తనను ఎలా డీల్ చేయాలో తెలుసని CM రేవంత్ చేసిన కామెంట్స్‌పై హరీశ్‌రావు స్పందించారు. తనను డీల్ చేయడానికంటే ముందు సీఎం కుర్చీ చేజారిపోకుండా కాపాడుకోవాలని హరీశ్‌రావు హితవు పలికారు. తాను ఫుట్‌బాల్ ఆటగాడినని చెప్పుకుంటున్న రేవంత్ వచ్చే ఎన్నికల్లో సెల్ఫ్‌గోల్ కొట్టుకోవడం తప్పదని ఎద్దేవా చేశారు. రేవంత్ ఫుట్‌బాలర్ అయితే తాను క్రికెట్ ఆడుతానని, వచ్చే ఎన్నికల్లో వికెట్ తీసేది తామేనని జోస్యం చెప్పారు.

News October 30, 2024

రవితేజ ‘మాస్ జాతర’

image

మాస్ మహరాజ్ రవితేజ హీరోగా భాను బోగవరపు డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న తెరకెక్కుతోన్న లేటెస్ట్ మూవీపై అప్డేట్ వచ్చేసింది. దీపావళి కానుకగా ఈ సినిమా టైటిల్, రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ ప్రకటించింది. ‘మాస్ జాతర’ టైటిల్‌తో ‘మనదే ఇదంతా’ ట్యాగ్‌లైన్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం వేసవి కానుకగా 2025 మే 9న రిలీజ్ కానుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

News October 30, 2024

చంద్రబాబు, కరవు కవలపిల్లలు: VSR

image

AP: సీఎం చంద్రబాబు, కరవు కవల పిల్లలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. వారి మధ్య విడదీయలేని సంబంధం ఉందని ఆయన ట్వీట్ చేశారు. ‘ప్రస్తుతం రాష్ట్రంలోని 54 మండలాల్లో కరవు పరిస్థితులు ఏర్పడ్డాయి. రాయలసీమలో కరవు నీడలు వెంటాడుతున్నాయి. గత ప్రభుత్వం రైతుల కోసం పంటల బీమా పథకం అమలు చేస్తే కూటమి ప్రభుత్వం దానిని నిర్వీర్యం చేసింది. కూటమి సర్కార్ రైతుల ఉసురు తీస్తోంది’ అని ఆయన ఫైర్ అయ్యారు.

News October 30, 2024

ఎడిటర్ మృతికి హీరో సూర్య దిగ్భ్రాంతి

image

‘కంగువా’ సినిమా ఎడిటర్ నిషాద్ యూసుఫ్(43) <<14487953>>మృతిపై <<>>తమిళ హీరో సూర్య దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘నిషాద్ ఇక లేరనే వార్త విని నా గుండె పగిలిపోయింది. మీరు ఎల్లప్పుడూ కంగువ జట్టులో ముఖ్యమైన వ్యక్తిగా గుర్తుండిపోతారు. మా ఆలోచనలు, ప్రార్థనల్లో మీరు ఎప్పటికీ ఉంటారు. ఆయన కుటుంబానికి & స్నేహితులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’ అని ట్వీట్ చేశారు.

News October 30, 2024

షర్మిలకు భద్రత పెంచాలి: ఏపీ కాంగ్రెస్

image

APCC చీఫ్ వైఎస్ షర్మిలకు భద్రత పెంచాలని కాంగ్రెస్ నేతలు కోరారు. ఈమేరకు డీజీపీని కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతం షర్మిలకు ఉన్న 2+2 గన్‌మెన్స్ స్థానంలో 4+4 సెక్యూరిటీని కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల జగన్, షర్మిల మధ్య ఆస్తి వివాదాల నేపథ్యంలో ఆమెకు భద్రత పెంచాలని కాంగ్రెస్ కోరడం గమనార్హం.

News October 30, 2024

BREAKING: ఫలితాలు విడుదల

image

ఛార్టెర్డ్ అకౌంటెంట్స్, ఇంటర్, ఫౌండేషన్ పరీక్షల ఫలితాలు రిలీజయ్యాయి. సెప్టెంబర్‌లో పరీక్షలు నిర్వహించారు. అభ్యర్థుల తమ ఫలితాలను తెలుసుకునేందుకు రోల్ నంబర్‌తో పాటు రిజిస్ట్రేషన్ నంబర్, క్యాప్చాను ఎంటర్ చేసి ఫలితాలు తెలుసుకోవచ్చు. ఫలితాల కోసం ఇక్కడ <>క్లిక్ <<>>చేయండి.

News October 30, 2024

నష్టాలు: పాత పెట్టుబడుల్ని వదిలించుకున్నారు

image

దీపావ‌ళికి ముందు ఇన్వెస్ట‌ర్లు పాత పెట్టుబ‌డుల‌ను వ‌దిలించుకున్న‌ట్టు క‌నిపిస్తోంది. దేశీయ స్టాక్ మార్కెట్లు బుధ‌వారం న‌ష్టాల‌బాట‌ప‌ట్టాయి. సెన్సెక్స్ 426 పాయింట్లు న‌ష్ట‌పోయి 79,942 వ‌ద్ద, నిఫ్టీ 126 పాయింట్లు న‌ష్ట‌పోయి 24,340 వ‌ద్ద స్థిర‌ప‌డ్డాయి. Finance, Pharma షేర్లు న‌ష్ట‌పోయాయి. క్యాపిట‌ల్ గూడ్స్‌, ఆటో రంగ షేర్ల‌కు కొనుగోళ్ల మ‌ద్ద‌తు ల‌భించింది. Adani Ent, Hero Motoco టాప్ గెయినర్స్.

News October 30, 2024

స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లపై హైకోర్టు ఆదేశాలు

image

TG: రాష్ట్రంలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలు చేసే BC రిజర్వేషన్ల అధ్యయనానికి ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశించింది. అధ్యయనాన్ని బీసీ కమిషన్‌కు అప్పజెప్పడాన్ని పిటిషనర్ తరఫున న్యాయవాది తప్పుబట్టారు. అది సుప్రీం కోర్టు తీర్పులకు విరుద్ధమని పేర్కొన్నారు. కాగా 2 వారాల్లో ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

News October 30, 2024

మద్యంపై ఖర్చు చేయడంలో తెలంగాణ NO.1

image

మద్యం అమ్మకాల్లో తెలంగాణ దూసుకెళ్తోంది. భారత్‌లో సగటున ఓ వ్యక్తి మద్యం కోసం చేసిన ఖర్చులో తెలంగాణ నంబర్ వన్‌గా నిలిచింది. 2022-23లో రాష్ట్రంలో యావరేజ్‌గా ఓ వ్యక్తి రూ.1623 ఖర్చు చేసినట్లు నివేదికలో వెల్లడైంది. AP సగటున రూ.1306 ఖర్చుతో రెండో స్థానంలో ఉంది. తర్వాత పంజాబ్‌ (రూ.1245), ఛత్తీస్‌గఢ్(రూ.1227) ఉన్నాయి. కింగ్‌ఫిషర్, మెక్‌డొవెల్స్, టుబర్గ్‌లు పాపులర్ బ్రాండ్స్‌గా నిలిచాయి.