news

News October 17, 2024

పురుషులకూ బ్రెస్ట్ క్యాన్సర్ ముప్పు

image

బ్రెస్ట్ క్యాన్సర్ మహమ్మారి స్త్రీలకు మాత్రమే వస్తుందని చాలామంది భావిస్తారు. కానీ పురుషుల్లోనూ వస్తుందని ఆంకాలజిస్ట్ డాక్టర్ సీఎన్ పాటిల్ తెలిపారు. ‘అరుదే అయినా వచ్చే ప్రమాదం లేకపోలేదు. హార్మోన్ల అసమతుల్యత, జన్యుపరమైన కారణాలు, పర్యావరణం దీనికి కారణం కావొచ్చు. 60 నుంచి 70 ఏళ్ల మధ్యలో ఉన్న పురుషులకు రిస్క్ ఎక్కువ. ఛాతీలో గడ్డ కనిపిస్తే వెంటనే పరీక్షించుకోవడం ఉత్తమం’ అని వివరించారు.

News October 17, 2024

సురేఖపై పరువు నష్టం కేసు.. రేపు కోర్టుకు KTR

image

TG: మంత్రి సురేఖపై పరువు నష్టం కేసు వేసిన కేటీఆర్ రేపు నాంపల్లి కోర్టులో హాజరుకానున్నారు. జడ్జి ముందు ఆయన తన వాంగ్మూలం ఇవ్వనున్నారు. కాగా నాగచైతన్య, సమంత విడాకుల వ్యవహారంలో నాగార్జున, కేటీఆర్‌పై సురేఖ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆమెపై ఇప్పటికే నాగార్జున డిఫమేషన్ కేసు వేసి, కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు.

News October 17, 2024

భారత్‌ను హేళన చేసిన మాజీ ప్లేయర్.. ఫ్యాన్స్ ఆగ్రహం

image

న్యూజిలాండ్‌పై భారత్ 46 రన్స్‌కే ఆలౌట్ కావడాన్ని సానుకూలంగా తీసుకోవాలని ఇంగ్లండ్ మాజీ ఆటగాడు మైకేల్ వాన్ ట్వీట్ చేశారు. ఆస్ట్రేలియాలో 36 పరుగులకే ఆలౌట్ అయిన విషయాన్ని గుర్తుచేసేలా ‘కనీసం 36 రన్స్‌ను దాటారుగా’ అంటూ హేళన చేశారు. ఆ ట్వీట్‌పై భారత్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత్‌పై ఇంగ్లండ్ 2019 నుంచి గెలవలేదని, ఐర్లాండ్ చేతిలో ఆ జట్టు 52 రన్స్‌కే ఔటైందని కౌంటర్లు వేస్తున్నారు.

News October 17, 2024

బిష్ణోయ్‌కి సల్మాన్ మాజీ ప్రేయసి సందేశం

image

నటుడు సల్మాన్ ఖాన్‌ను చంపాలని చూస్తున్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌ని జూమ్ కాల్ చేయమంటూ ఖాన్ మాజీ ప్రేయసి సోమీ అలీ కోరడం హాట్ టాపిక్‌గా మారింది. ‘నమస్తే లారెన్స్ భాయ్. మీరు జైల్లో ఉన్నా కూడా జూమ్ కాల్స్ చేస్తుంటారని నాకు తెలిసింది. మీతో మాట్లాడే పని ఉంది. దానికి ఏర్పాట్లు చేయండి. నాతో మాట్లాడితే మీకే లాభం. మీ ఫోన్ నంబర్ నాకు ఇవ్వండి’ అని సోమీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

News October 17, 2024

ఒకే ఓవర్‌లో 4,6,6,6,2

image

శ్రీలంకతో జరుగుతున్న మూడో టీ20లో విండీస్ ప్లేయర్ మోతీ చెలరేగారు. వెల్లలగే వేసిన 15వ ఓవర్‌లో 3 సిక్సర్లు, ఒక ఫోర్ సాయంతో 24(4,6,6,6,2) రన్స్ బాదారు. మొత్తం 15 బంతులాడిన అతడు 32 రన్స్ చేశారు. దీంతో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన విండీస్ 20 ఓవర్లలో 162/8 రన్స్ చేసింది.

News October 17, 2024

UGC NET-2024 ఫలితాలు విడుదల

image

నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్-2024 రిజల్ట్స్ వచ్చేశాయి. ఫలితాలతో పాటు సబ్జెక్టులవారీగా కటాఫ్ మార్కులను కూడా NTA విడుదల చేసింది. అభ్యర్థులు <>ugcnet.nta.ac.in<<>> వెబ్‌సైట్‌లో తమ రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు. ఈ ఏడాది ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 5 వరకు నిర్వహించిన పరీక్షలకు 6,84,224 మంది హాజరయ్యారు.

News October 17, 2024

ఇన్నాళ్లూ న్యాయదేవత కళ్లకు గంతలెందుకు?

image

చట్టం అందరికీ సమానమనే సందేశం చాటేందుకు న్యాయదేవత కళ్లకు గంతలుండేవి. హోదా, అధికారం, అంగ/అర్థ బలం, బంధుత్వం వంటివి చూడకుండా, వాస్తవాలు, చట్టానికి లోబడే తీర్పులు ఉంటాయని దీని అర్థం. బ్రిటిషర్ల కాలం నుంచి మన దేశంలో కళ్లకు గంతలు కట్టిన న్యాయ దేవత విగ్రహం కొనసాగుతోంది. చాలాసార్లు ‘చట్టానికి కళ్లు లేవు/ చట్టం కళ్లు మూసుకుంది/ న్యాయ దేవత కళ్లు కప్పేశారు’లాంటి కామెంట్లను సినిమాలు, విమర్శకుల నుంచి విన్నాం.

News October 17, 2024

థాంక్యూ పవన్ కళ్యాణ్: పన్నీర్ సెల్వం

image

AIADMK వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ వరస ట్వీట్లలో ఆ పార్టీకి శుభాకాంక్షలు తెలిపిన సంగతి తెలిసిందే. ఆ విషెస్‌పై ఆ పార్టీ కో-ఆర్డినేటర్ పన్నీర్ సెల్వం స్పందించారు. ‘డియర్ పవన్ కళ్యాణ్, AIADMK 53వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మీరు విష్ చేసినందుకు ధన్యవాదాలు’ అని ట్వీట్ చేశారు. సనాతన ధర్మం విషయంలో డీఎంకేతో విభేదాల నేపథ్యంలో పవన్ AIADMKకి విషెస్ చెప్పడం ఆసక్తికరం.

News October 17, 2024

ఇజ్రాయెల్ దాడిలో హమాస్ చీఫ్ హతం!

image

హమాస్‌తో యుద్ధంలో ఇజ్రాయెల్ మరోసారి పైచేయి సాధించింది. హమాస్ చీఫ్ యాహ్య సిన్వర్‌ను మట్టుబెట్టినట్లు తెలుస్తోంది. గాజాలో ఆ దేశ మిలిటరీ ముగ్గురిని హతమార్చింది. ఇందులో సిన్వర్ కూడా ఉన్నట్లు అనుమానిస్తోంది. అయితే ఇంకా నిర్ధారించాల్సి ఉందని IDF తెలిపింది. గతేడాది OCT 7న ఇజ్రాయెల్‌పై తొలిసారి దాడిలో మాస్టర్ మైండ్‌ సిన్వర్‌దే. సిన్వర్ కంటే ముందు హమాస్ చీఫ్ హనియాను కూడా ఇజ్రాయెల్ ఎలిమినేట్ చేసింది.

News October 17, 2024

కేంద్రానికి రైతు సంఘాల హెచ్చరిక

image

ఢిల్లీ రైతు ఉద్యమానికి నాలుగేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో సంయుక్త్ కిసాన్ మోర్చా మరో సారి ర్యాలీలకు పిలుపునిచ్చింది. నవంబర్ 26న దేశంలోని 500 జిల్లాల్లో హెచ్చరిక ర్యాలీలు చేపడుతామని తెలిపింది. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే వచ్చే ఏడాది మరో ఉద్యమం తప్పదని హెచ్చరించింది.