news

News July 18, 2024

‘కల్కి’.. ALL TIME RECORD

image

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ‘కల్కి’ టికెట్ బుకింగ్స్‌లో రికార్డు సృష్టించింది. బుక్ మై షోలో ఇప్పటివరకూ 12.15+ మిలియన్ల టికెట్ సేల్స్ జరిగినట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. ఇండియన్ సినిమా చరిత్రలో ఇది ఆల్ టైమ్ రికార్డ్ అని తెలిపాయి. షారుక్ ఖాన్ నటించిన ‘జవాన్’(12.01M)పై ఉన్న రికార్డును 20 రోజుల్లోనే బ్రేక్ చేయడం విశేషం. ‘కల్కి’ సెప్టెంబర్‌లో OTTలోకి వచ్చే అవకాశం ఉంది.

News July 18, 2024

పల్నాడు మర్డర్.. TDP, YCP ట్విటర్ వార్

image

AP: పల్నాడు జిల్లా వినుకొండలో నిన్న రషీద్ దారుణ హత్య టీడీపీ, వైసీపీ మధ్య అగ్గి రాజేసింది. తమ కార్యకర్త రషీద్‌ను కరుడుగట్టిన టీడీపీ కార్యకర్త జిలానీ దారుణంగా హత్య చేశాడని వైసీపీ ఆరోపిస్తోంది. అయితే హతుడు, నిందితుడు ఇద్దరూ వైసీపీ వారేనని, తమ పార్టీతో జిలానీకి సంబంధం లేదని టీడీపీ కౌంటరిస్తోంది. ఇరు పార్టీల సోషల్ మీడియా కార్యకర్తలు కూడా నెట్టింట తీవ్ర పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు.

News July 18, 2024

కోవిడ్ సోకిన పిల్లల్లో డయాబెటిస్ లక్షణాలు?

image

కోవిడ్ సోకిన చిన్నారుల్లో టైప్ 1 డయాబెటిస్ లక్షణాలు వేగంగా బయటపడతాయని అమెరికన్ మెడికల్ అసోసియేషన్ జర్నల్ ప్రచురించిన ఓ స్టడీలో తేలింది. ఇది రోగ నిరోధక వ్యవస్థ, ప్యాంక్రియాస్‌పైనా దాడి చేసి దెబ్బ తీస్తుందని తెలిపారు. ఇలాంటి వారిలో దాహం, తరచూ మూత్రవిసర్జన, నిద్రలేమి వంటి సమస్యలు తలెత్తుతాయని పేర్కొంది. బ్లడ్ టెస్ట్‌తో దీనిని ప్రారంభ దశలోనే గుర్తించవచ్చని తెలిపింది.

News July 18, 2024

‘రూఫ్‌‌టాప్‌ సోలార్‌ సిస్టమ్స్’కు ADB $240.5 మిలియన్ల సాయం

image

దేశంలో సౌర విద్యుత్ ఉత్పత్తి దిశగా కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో రూఫ్‌‌టాప్‌ సోలార్‌ కోసం ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్(ADB) 240.5 మిలియన్ డాలర్ల(రూ.2వేల కోట్లపైనే) రుణం ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. 2030 కల్లా 50 శాతం శిలాజ రహిత ఇంధన ఉత్పత్తి లక్ష్యాన్ని భారత్ అందుకునేందుకు తమ వంతు సహకారం అందిస్తున్నట్లు ADB అధికారి తెలిపారు. ఇది పీఎం సూర్య ఘర్ కార్యక్రమంలో భాగం కానుందని పేర్కొన్నారు.

News July 18, 2024

SUICIDE PODS: నొప్పి లేకుండా నిమిషంలోనే ఆత్మహత్య

image

నొప్పి లేకుండా హాయిగా ఆత్మహత్య చేసుకునేందుకు స్విట్జర్లాండ్ ఓ సూసైడ్ క్యాప్సూల్ తయారు చేసింది. నైట్రోజన్ నింపిన ఈ క్యాప్సూల్‌లో పడుకుని బటన్ నొక్కిన నిమిషంలోనే చనిపోతారు. స్విట్జర్లాండ్‌లో దీనిని మొట్టమొదటిసారి ఉపయోగిస్తున్నారు. దీనిని ఎక్కడి నుంచి ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. ఆత్మహత్య చేసుకోవాలన్న వారి అభ్యర్థన మేరకే దీనిని ఉపయోగిస్తారు. దీనిని ఉపయోగించేందుకు రూ.1671 చెల్లించాల్సి ఉంటుంది.

News July 18, 2024

రుణమాఫీ పేరిట రేవంత్ సర్కార్ మరో మోసం: KTR

image

TG: రైతుబంధు కింద ఇవ్వాల్సిన నిధుల నుంచి రేవంత్ సర్కార్ రూ.7వేల కోట్లు రుణమాఫీకి దారి మళ్లించిందని మాజీ మంత్రి KTR ఆరోపించారు. రుణమాఫీ పేరుతో మరోసారి రైతులను మోసం చేస్తుందని మండిపడ్డారు. 40 లక్షల మందికిపైగా రుణాలు తీసుకుంటే 11 లక్షల మందినే ఎలా ఎంపిక చేస్తారని Xలో ప్రశ్నించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని కాంగ్రెస్ నిలబెట్టుకోవాలని, అర్హులకు రైతు బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

News July 18, 2024

శ్రీలంకతో సిరీస్‌కు నేడు భారత జట్టు ప్రకటన!

image

శ్రీలంకతో T20, వన్డే సిరీస్ కోసం భారత జట్టును BCCI ఇవాళ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఈ సిరీస్‌లో రోహిత్ శర్మ ఆడే ఛాన్స్ ఉంది. హార్దిక్, బుమ్రా, కోహ్లీలకు రెస్ట్ ఇవ్వనున్నట్లు సమాచారం. అలాగే T20లకు సూర్యకుమార్ యాదవ్‌ను కెప్టెన్‌గా నియమించనున్నట్లు టాక్. ఈ నెల 27న తొలి T20, 28న రెండో మ్యాచ్, 30న మూడో T20 జరగనుంది. ఆగస్టు 2న తొలి వన్డే, 4న రెండో మ్యాచ్, 7న చివరి వన్డే జరగనుంది.

News July 18, 2024

నారా లోకేశ్‌ ట్వీట్.. స్పందించిన కర్ణాటక ఐటీ మంత్రి

image

AP: నాస్కామ్‌ను ఏపీకి ఆహ్వానించిన ఐటీ మంత్రి నారా లోకేశ్‌కు కర్ణాటక ఐటీ మంత్రి ప్రియాంక్ ఖర్గే ట్విటర్‌లో కౌంటర్ ఇచ్చారు. ‘డియర్ లోకేశ్.. మీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిన ప్రతి సంస్థలోనూ ఏపీకే చెందిన సమర్థులకు, నిపుణులకు ఉద్యోగాలు రావాలని కోరుకోరా?’ అని ప్రశ్నించారు. నాస్కామ్ కర్ణాటకలోనే నిశ్చింతగా ఉండొచ్చని, వారికి ఇబ్బంది కలిగేలా తమ ప్రభుత్వం ఏ పనీ చేయదని హామీ ఇచ్చారు.

News July 18, 2024

తక్షణమే కాల్పుల విరమణ చేపట్టండి: హమాస్, ఇజ్రాయెల్‌కు భారత్ పిలుపు

image

గాజాలో తక్షణమే కాల్పుల విరమణ చేపట్టాలని హమాస్, ఇజ్రాయెల్‌కు భారత్ పిలుపునిచ్చింది. బేషరతుగా బందీలను విడుదల చేయాలని ఐక్యరాజ్యసమితి వేదికగా హమాస్‌ను డిమాండ్ చేసింది. గాజా స్ట్రిప్‌లో వెంటనే మానవతా సేవలు కొనసాగించాలని పేర్కొంది. అలాగే హమాస్-ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఆపేందుకు ప్రయత్నించిన ఈజిప్ట్, ఖతర్ దేశాలను భారత్ అభినందించింది.

News July 18, 2024

కొనసాగుతున్న డీఎస్సీ పరీక్షలు

image

TG: రాష్ట్రవ్యాప్తంగా డీఎస్సీ పరీక్షలు కొనసాగుతున్నాయి. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. తొలిసారిగా ఆన్‌‌లైన్ విధానంలో పరీక్ష నిర్వహిస్తున్నారు. ఆగస్టు 5 వరకు రోజూ రెండు షిఫ్టుల్లో ఎగ్జామ్స్ జరగనున్నాయి. మరోవైపు ఎగ్జామ్స్‌ను అడ్డుకుంటామని నిరుద్యోగ సంఘాల హెచ్చరికల నేపథ్యంలో పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు భద్రతను పటిష్ఠం చేశారు.