news

News July 17, 2024

యాక్సిడెంట్‌లో గాయాలు.. హెల్త్ అప్డేట్ ఇచ్చిన నవీన్ పొలిశెట్టి

image

తనకు అమెరికాలో జరిగిన <<12940311>>యాక్సిడెంట్‌పై<<>> జాతిరత్నాలు హీరో నవీన్ పొలిశెట్టి కీలక విషయాలు వెల్లడించారు. తన చేతికి పలుచోట్ల ఫ్రాక్చర్లు అయ్యాయని, కాలికి గాయమైందని తెలిపారు. ‘ఇది చాలా కష్టంగా ఉంది. పూర్తిగా కోలుకునేందుకు కృషి చేస్తున్నా. మీ మద్దతు, ప్రేమ మాత్రమే నాకు అవసరమైన ఔషధం. దయచేసి నేను చెప్పేవాటినే నమ్మండి. త్వరలోనే బిగ్ స్క్రీన్‌పై అలరిస్తా’ అని పొలిశెట్టి తెలిపారు.

News July 17, 2024

ఒలింపిక్స్‌కు వెళ్లే భారత ప్లేయర్ల సంఖ్య ఎంతంటే?

image

ఈ నెల 26న ప్రారంభమయ్యే పారిస్ ఒలింపిక్స్‌కు భారత్ తరఫున వివిధ క్రీడాంశాల్లో 117 మంది అథ్లెట్లు పోటీ పడనున్నారు. 140 మందితో కూడిన సహాయక సిబ్బంది, అధికారులు పారిస్‌కు వెళ్లనున్నట్లు కేంద్ర క్రీడామంత్రిత్వ శాఖ తెలిపింది. వీరిలో 72 మంది సిబ్బందికి ప్రభుత్వ ఖర్చులతో పారిస్‌కు వెళ్లేందుకు ఆమోదం తెలిపినట్లు పేర్కొంది.

News July 17, 2024

భూ పరిభ్రమణ వేగం నెమ్మదిస్తోంది!

image

పర్యావరణ మార్పుల కారణంగా భూమి కూడా భారీ మార్పులకు లోనవుతోందని స్విట్జర్లాండ్‌లోని ఈటీహెచ్ జ్యూరిచ్ పరిశోధకులు తెలిపారు. వారి అధ్యయనం ప్రకారం.. ధ్రువాల వద్ద కరిగిపోతోన్న మంచు భూమధ్య రేఖ దిశగా వెళ్తోంది. తదనుగుణంగా భూమి బరువు కూడా షిఫ్ట్ అవుతోంది. ఫలితంగా పరిభ్రమణ వేగం నెమ్మదించి ‘రోజు’ వ్యవధి పెరుగుతోంది. మనిషి మనుగడపై దీర్ఘకాలంలో ఇది ప్రభావం చూపిస్తుందని పరిశోధకులు హెచ్చరించారు.

News July 17, 2024

ఘోరం: భార్యాపిల్లల ఎదుటే శ్రీలంక మాజీ క్రికెటర్‌‌ దారుణ హత్య

image

శ్రీలంక అండర్-19 కెప్టెన్‌గా వ్యవహరించిన దమ్మిక నిరోషన అనే క్రికెటర్‌ను ఆయన ఇంట్లో భార్యాపిల్లల ఎదుటే గుర్తుతెలియని వ్యక్తులు కాల్చిచంపారు. అంబలన్‌గోడా ప్రాంతంలో మంగళవారం రాత్రి ఈ ఘోరం చోటుచేసుకుంది. మహారూఫ్, మాథ్యూస్, ఉపుల్ తరంగ వంటి ఆటగాళ్లు అండర్-19 మ్యాచులు దమ్మిక కెప్టెన్సీలోనే ఆడారు. 20 ఏళ్లకే ఆయన క్రికెట్ ఆపేశారు. కాగా.. అండర్‌వరల్డ్ గ్యాంగ్‌‌వార్‌లే ఈ హత్యకు కారణమని అంచనా వేస్తున్నారు.

News July 17, 2024

ఎల్లుండి ఢిల్లీకి పవన్ కళ్యాణ్

image

AP: ఈ నెల 19న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లనున్నారు. ఆ రోజు అక్కడ జరిగే జలజీవన్ సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి హోదాలో పవన్ హాజరుకానున్నారు. కాగా తొలిసారి కేంద్ర మంత్రితో సమీక్షకు హాజరుకానుండటంతో ఈ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది.

News July 17, 2024

రిజర్వేషన్లపై బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తత.. ఆరుగురు మృతి

image

బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్లపై ఘర్షణలు చెలరేగి ఆరుగురు మృతిచెందారు. PM హసీనా నిరసనకారులతో చర్చలకు నిరాకరించడం, వ్యతిరేకులను ‘రజాకర్లు’గా ఆమె పేర్కొనడం వివాదాస్పదమైంది. అధికార పార్టీ అవామీ లీగ్‌ స్టూడెంట్ వింగ్‌‌తో విద్యార్థులు ఘర్షణకు దిగారు. స్వాతంత్ర్యయోధుల కుటుంబీకులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 30% కోటా ఇవ్వడం ఈ నిరసనలకు కారణం. తాజా పరిస్థితులతో యూనివర్సిటీ, కాలేజీలు నిరవధికంగా మూతపడ్డాయి.

News July 17, 2024

ఆరు నెలలకు తిరుమల హుండీ ఆదాయం ఎంతంటే?

image

తిరుమలలో హుండీ ఆదాయం భారీగా పెరిగింది. ఈ ఏడాది మొదటి 6 నెలలకు రూ.670.21 కోట్లు శ్రీవారి హుండీలో చేరినట్లు అధికారులు తెలిపారు. కానుకలు కూడా భారీగా వచ్చాయని వెల్లడించారు. మరోవైపు ఇవాళ తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. భక్తులు 10 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉండగా, దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. నిన్న 71,409 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.

News July 17, 2024

ముచ్చుమర్రి ఘటన.. CI, SIపై వేటు

image

AP: ముచ్చుమర్రి ఘటనకు సంబంధించి స్థానిక సీఐ, ఎస్‌ఐపై సస్పెన్షన్ వేటు పడింది. నందికొట్కూరు రూరల్ సీఐ విజయ్ భాస్కర్, ముచ్చుమర్రి ఎస్ఐ జయశేఖర్‌ను సస్పెండ్ చేస్తూ కర్నూలు రేంజ్ డీఐజీ విజయరావు చర్యలు తీసుకున్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకే వారిపై వేటు వేసినట్లు డీఐజీ తెలిపారు. కాగా ముచ్చుమర్రిలో ఎనిమిదేళ్ల చిన్నారిని ముగ్గురు మైనర్లు అత్యాచారం, హత్య చేసి మృతదేహాన్ని కృష్ణా నదిలో పడేశారు.

News July 17, 2024

‘బలగం’ మూవీని అవార్డులు వరిస్తాయా?

image

చిన్న సినిమాగా వచ్చి సెన్సేషన్‌గా నిలిచిన ‘బలగం’ మరోసారి వార్తల్లో నిలిచింది. ఇప్పటికే ఎన్నో అవార్డులను మూటగట్టుకున్న ‘బలగం’ తాజాగా ‘ఫిల్మ్‌ఫేర్’ అవార్డులు -2024లో 8 కేటగిరీల్లో నామినేట్ అయింది. బెస్ట్ ఫిల్మ్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ యాక్టర్ ఇన్ సపోర్టింగ్ రోల్ మేల్ & ఫీమేల్, బెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్, బెస్ట్ లిరిక్స్, బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ మేల్ & ఫీమేల్ కేటగిరీల్లో ‘బలగం’ పోటీపడుతోంది.

News July 17, 2024

భారీగా పెరిగిన బంగారం ధరలు

image

కొద్దిరోజులుగా నిలకడగా ఉన్న పసిడి ధరలు ఇవాళ భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల గోల్డ్ రేట్ 10 గ్రాములకు రూ.980 పెరిగి రూ.75వేలకు చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.900 పెరిగి రూ.68,750గా నమోదైంది. అటు కేజీ వెండి ధర రూ.1000 పెరిగి రూ.96వేలకు చేరింది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.