India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
స్టార్ సింబల్ ఉన్న రూ.500 నోట్లు ఫేక్ అని వాట్సాప్‌లో ఓ మెసేజ్ చక్కర్లు కొడుతోంది. ప్రజల్లో ఆందోళన నెలకొనడంతో దీనిపై కేంద్ర ప్రభుత్వానికి చెందిన PIB FACT CHECK స్పందించింది. ఇది తప్పుడు ప్రచారం అని తేల్చింది. డిసెంబర్ 2016 నుంచి స్టార్(*) మార్క్ కలిగిన రూ.500 నోట్లు చలామణిలో ఉన్నట్లు పేర్కొంది. ఇలాంటి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయొద్దని సూచించింది.
HYD ఫరూక్ నగర్ డిపో బస్సు కండక్టర్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని 21 ఏళ్ల <<13640871>>యువతి<<>> చేసిన ఫిర్యాదుపై TGSRTC ఎండీ సజ్జనార్ స్పందించారు. ‘ఈ ఘటనపై తక్షణమే సమగ్ర విచారణకు ఆదేశించాం. నివేదిక ఆధారంగా బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. మహిళల భద్రత విషయంలో ఏమాత్రం రాజీపడటం లేదు. రోజూ సగటున 35 లక్షల మందికి పైగా మహిళలకు సురక్షితమైన ప్రయాణాన్ని TGSRTC కల్పిస్తోంది’ అని ట్వీట్ చేశారు.
ట్రైనీ IAS పూజా ఖేడ్కర్ ఫేక్ సర్టిఫికెట్లు సమర్పించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వేళ మరో మాజీ IAS అభిషేక్ సింగ్‌పై విమర్శలొస్తున్నాయి. ఆయన కూడా లోకోమోటర్ డిసేబిలిటీ ఉందని వైకల్యం కోటాలో 2011లో IASగా ఎంపికయ్యారు. అయితే, కొన్ని నెలల క్రితం ఆయన జిమ్‌లో బరువులు ఎత్తిన వీడియోలు షేర్ చేశారు. తాజాగా వాటిని డిలీట్ చేయడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏడాది క్రితం ఆయన రిజైన్ చేసి నటుడి అవతారం ఎత్తారు.
దేశీయ స్టాక్ మార్కెట్లలో ప్రభుత్వ రంగ సంస్థల (సుమారు 55 కంపెనీలు) షేర్లు దూసుకెళ్తున్నాయి. జూన్ 4 నుంచి దాదాపు నెల రోజుల వ్యవధిలో వీటి సంపద ₹12లక్షల కోట్లు పెరిగింది. మార్కెట్ క్యాప్ ₹22.5లక్షల కోట్లకు చేరింది. కేంద్ర విధానాలు PSUలకు సానుకూలంగా ఉంటాయనే ధీమా ఈ జోరుకు కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. మజగావ్ డాక్, ఆయిల్ ఇండియా, కొచ్చిన్ షిప్‌యార్డ్ వంటి షేర్లు 25-50% మధ్య వృద్ధిని నమోదు చేశాయి.
తొలి ఏకాదశి ఈ రోజు (జులై 16) రాత్రి 8.33 గంటలకు ప్రారంభమై బుధవారం రాత్రి 9.02 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం.. ఈ ఏడాది తొలి ఏకాదశి వ్రతాన్ని జులై 17న జరుపుకుంటారు. తొలి ఏకాదశి నుంచే హిందూ పండుగలు ప్రారంభమవుతాయి. ఏకాదశి రోజు శ్రీమహావిష్ణువు నిద్రలోకి వెళ్లి తిరిగి 4 నెలల తర్వాత కార్తీక మాసంలో శుద్ధ ఏకాదశి రోజు మేలుకుంటారని ప్రతీతి. ఈ 4 నెలల కాలాన్ని చతుర్మాసం అంటారని ప్రతీతి.
TG: తాను <<13639787>>విద్యుత్ కమిషన్<<>> చైర్మన్ బాధ్యతల నుంచి తప్పుకోవడంపై జస్టిస్ నర్సింహారెడ్డి స్పందించారు. ఈ వ్యవహారంలో కోర్టు ప్రాథమిక వాదోపవాదాలు మాత్రమే విన్నట్లు ఆయన చెప్పారు. కమిషన్ ముఖ్య ఉద్దేశమే బహిరంగ విచారణ అని, అందుకే తాను ప్రెస్‌మీట్ పెట్టి ఎవరెవరిని విచారించామో వెల్లడించానన్నారు. మరింత లోతుగా విచారించి ఉంటే అసలు విషయం తేలేదన్నారు. ఇందులో తాను పక్షపాతంగా వ్యవహరించలేదన్నారు.
శ్రీలంకతో వన్డే సిరీస్ కోసం భారత జట్టును బీసీసీఐ ఈరోజు ప్రకటించే అవకాశం ఉంది. ఈ సిరీస్‌లో సీనియర్ క్రికెటర్లు రోహిత్ శర్మ, కోహ్లీ, బుమ్రా, పాండ్యకు రెస్ట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అయితే పాండ్య మినహా మిగిలిన సీనియర్లకు రెస్ట్ ఇచ్చేందుకు కొత్త కోచ్ గంభీర్ విముఖత చూపినట్లు తెలుస్తోంది. లంకతో వన్డేల అనంతరం చాలా విశ్రాంతి ఉంటుందని గంభీర్ అన్నారట. కాగా ఆగస్టు 2-7 మధ్య ఈ 3 వన్డేల సిరీస్ జరగనుంది.
TG: ఎల్లుండి నుంచి జమ చేసే రైతు రుణమాఫీ డబ్బులు పక్కదారి పట్టకుండా బ్యాంకర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రుణమాఫీ నిధులను ఇతర ఖాతాల్లో జమ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కాగా ఈ నెల 18న రూ.లక్ష వరకు రుణాలు మాఫీ చేస్తామని సీఎం రేవంత్ ప్రకటించారు.
ఒమన్‌లో చమురు తరలిస్తున్న ఓ నౌక నీట మునిగి 16 మంది సిబ్బంది గల్లంతయ్యారు. వీరిలో 13 మంది భారతీయులు, ముగ్గురు శ్రీలంక దేశస్థులు ఉన్నారు. వారి ఆచూకీ తెలుసుకునేందుకు సహాయక సిబ్బంది కృషి చేస్తున్నారు. షిప్ బోల్తా పడి నీట మునిగిందని, అయితే సముద్రంలోకి ఆయిల్ లీక్ అయిందా? వంటి వివరాలు తెలియాల్సి ఉందని కేంద్రం వెల్లడించింది. యెమెన్‌లో ఎడెన్ పోర్టుకు నౌక వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
అడ్డదారుల్లో IAS అయ్యారని <<13639092>>ఆరోపణలు<<>> ఎదుర్కొంటున్న పూజా ఖేడ్కర్‌ను మహారాష్ట్ర సర్వీసుల నుంచి నేషనల్ అడ్మినిస్ట్రేషన్ అకాడమీ వెనక్కి పిలిపించింది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఆమె ప్రొబేషన్ నిలిచిపోతుందని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 23వ తేదీలోగా ముస్సోరీలోని అకాడమీలో చేరాలని, లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
Sorry, no posts matched your criteria.