news

News July 16, 2024

ఇడియట్ సిండ్రోమ్ అంటే ఏంటీ.. మీకూ ఉందా?

image

ఒకప్పుడు డాక్టర్ సూచించిన మందులను రోగులు నమ్మకంగా ఫాలో అయ్యేవారు. కానీ ఇప్పుడు ఇంటర్నెట్ వల్ల ప్రతీదానిని అనుమానిస్తున్నారు. ప్రిస్కిప్షన్ తీసుకుని బయటకు వచ్చిన వెంటనే ఆ మందులను గూగుల్‌లో చెక్ చేసి తెలుసుకుంటున్నారు. ఇలా తెలుసుకుని కొన్ని మందులు వాడకపోవడం, కొన్ని డోస్ తగ్గించుకుని వాడటంతో ఆరోగ్యానికి చేజేతులా హాని చేసుకుంటున్నారు. ఇలాంటి స్వభావానికే వైద్యులు ‘ఇడియట్ సిండ్రోమ్’ అనే పేరు పెట్టారు.

News July 16, 2024

బస్సులో యువతితో కండక్టర్ అసభ్య ప్రవర్తన.. ఫిర్యాదు!

image

TGSRTC బస్ కండక్టర్ తన పట్ల అనుచితంగా ప్రవర్తించాడని HYDకు చెందిన ఓ యువతి వాపోయింది. ‘ఈ నెల 15న మణికొండ నుంచి హిమాయత్ నగర్ వెళ్తున్నా. ఆధార్ కార్డు లేకపోవడంతో డబ్బులిచ్చి టికెట్ కావాలని అడిగా. కండక్టర్ ఒక్కసారిగా నావైపు దూసుకొచ్చి ప్రైవేట్ భాగాలను టచ్ చేశాడు. 2 సెకన్లు ఏం జరిగిందో అర్థం కాలేదు. అంకుల్ ఏం చేస్తున్నావ్? అని అరవగానే వెనక్కి వెళ్లిపోయాడు. అతడిపై చర్యలు తీసుకోవాలి’ అని ట్వీట్ చేశారు.

News July 16, 2024

ఆ మార్గదర్శకాలే రైతులకు ఉరితాళ్లు: ఈటల

image

TG: రైతు రుణమాఫీ కోసం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలను BJP MP ఈటల రాజేందర్ తప్పుబట్టారు. ఆ మార్గదర్శకాలు రైతులకు ఉరితాళ్లని అభివర్ణించారు. ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిందని ఆయన గుర్తు చేశారు. రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదని, మోసం చేసేవాళ్లకు ప్రజలు బుద్ధి చెబుతారని ఈటల అభిప్రాయపడ్డారు. తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలను ప్రభుత్వం మోసం చేస్తోందన్నారు.

News July 16, 2024

KCR చతురత చాటారు: BRS శ్రేణులు

image

జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్‌పై KCR ఒకింత విజయం సాధించారనే భావన BRS శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. దీన్ని రద్దు చేయాలన్న ఆయన పిటిషన్ విచారణలో నరసింహపై సుప్రీంకోర్టు నేడు ఘాటు <<13639787>>వ్యాఖ్యలు<<>> చేసింది. విచారిస్తూనే జూన్ 11న ఎలా మీడియాతో మాట్లాడుతారని CJI జస్టిస్ చంద్రచూడ్ ప్రశ్నించారు. KCR సైతం దీన్నే తప్పుబట్టారని ఆ పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. సుప్రీం దీన్ని అంగీకరించడం KCR చతురతకు నిదర్శనమంటున్నారు.

News July 16, 2024

ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్లు

image

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు ట్రేడింగ్‌ను ఫ్లాట్‌గా ముగించాయి. సెన్సెక్స్ 80,716 (+50), నిఫ్టీ 24,613 (+26) వద్ద స్థిరపడ్డాయి. ఓ దశలో నిఫ్టీ జీవితకాల గరిష్ఠాన్ని నమోదు చేసినా మార్కెట్లు ఒడుదొడుకులకు లోనవడంతో సూచీ క్షీణించింది. PSUలు కోల్ ఇండియా 3.01%, BPCL 2.71% వృద్ధిని కనబరిచాయి. కానీ రిలయన్స్, శ్రీరామ్ ఫైనాన్స్, కోటక్ బ్యాంక్ వంటి బడా షేర్లు నష్టాల పాలవడం మార్కెట్‌కు ప్రతికూలంగా మారింది.

News July 16, 2024

బైజూస్‌కు షాక్.. పవర్ కోల్పోనున్న సీఈఓ రవీంద్రన్?

image

దివాలా స్థితిలో ఉన్న బైజూస్ సంస్థకు మరో షాక్ తగిలింది. సంస్థ వ్యవహారాలు పర్యవేక్షించేందుకు పంకజ్ శ్రీవాస్తవ అనే అధికారిని ఇంటర్మ్ రెజల్యూషన్ ప్రొఫెషనల్‌గా NCLT నియమించింది. బైజూస్ ₹158 కోట్లు బాకీ ఉందని, దివాలా స్థితిలో ఉన్న ఆ సంస్థపై చర్యలు చేపట్టాలని BCCI వేసిన ఇన్సాల్వెన్సీ పిటిషన్‌పై NCLT ఈ మేరకు స్పందించింది. ఈ చర్యతో CEO రవీంద్రన్, బోర్డు డైరెక్టర్లు సంస్థలో తమ అధికారం కోల్పోయే అవకాశం ఉంది.

News July 16, 2024

18 ఏళ్లు పైబడినవారు ఎంతసేపు నిద్రపోవాలంటే?

image

వయసు వారీగా ఎంతసేపు నిద్రపోతే ఆరోగ్యకరమో చెప్పాలని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఓ వైద్యుడు స్పందించారు. ‘65 ఏళ్లు పైబడిన వారికి 7-8 గంటల నిద్ర అవసరం. అయితే, 5-6 గంటలు నిద్రపోయినా వీరు మేనేజ్ చేయగలరు. ముఖ్యంగా ఈ వయసు వారు పగటిపూట 2 గంటలు & రాత్రుల్లో 4-5 గంటలు నిద్రపోయినా సరిపోతుంది. 18 నుంచి 65 ఏళ్లలోపు వారు 7-8 గంటల నిద్ర తప్పనిసరి. పెద్దలతో పోలిస్తే పిల్లలకు ఎక్కువ సమయం నిద్ర అవసరం’ అని తెలిపారు.

News July 16, 2024

మంత్రులు, ఎమ్మెల్యేలు జోక్యం చేసుకుని చెడ్డపేరు తెచ్చుకోవద్దు: CM

image

AP: ఉచిత ఇసుక విధానంలో మంత్రులు, ఎమ్మెల్యేలు జోక్యం చేసుకుని చెడ్డపేరు తెచ్చుకోవద్దని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. అక్టోబర్ తర్వాత ఇసుక రీచులన్నీ అందుబాటులోకి వస్తాయని, బోట్ సొసైటీలకు కూడా అనుమతి ఇస్తున్నామని తెలిపారు. కొత్త మంత్రులు తమ శాఖలపై ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకోవాలని, లోటు బడ్జెట్ ఉందని గ్రహించి పని చేయాలని సీఎం సూచించారు.

News July 16, 2024

జేడీ వాన్స్ సక్సెస్ వెనుక ఉషదే కీలక పాత్ర!

image

US ఉపాధ్యక్ష అభ్యర్థిగా జేడీ వాన్స్‌ బరిలో నిలిచే స్థాయికి చేరడంలో ఆయన సతీమణి ఉషా చిలుకూరి కీలక పాత్ర పోషించారు. ఉష వల్ల తనలో గర్వం దరిచేరదని జేడీ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. సక్సెస్‌ఫుల్ లాయర్‌గా నిలిచిన ఉష గ్రామీణ US వెనుకబాటు వంటి సమస్యలను తెలుసుకోవడంలో జేడీకి సహకరించారు. ఒకవేళ జేడీ వైస్ ప్రెసిడెంట్ అయితే భారత్-US బంధం బలోపేతంలో ఉష ఆయనకు అండగా నిలుస్తారని విశ్లేషకులు భావిస్తున్నారు.

News July 16, 2024

ఇది ప్రభుత్వానికి చెంపపెట్టు: ప్రశాంత్ రెడ్డి

image

TG: విద్యుత్ కమిషన్‌పై CJI <<13639787>>వ్యాఖ్యలను<<>> స్వాగతిస్తున్నామని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు. ‘విచారణ పూర్తికాకముందే జస్టిస్ నరసింహారెడ్డి ప్రెస్‌మీట్‌లు పెట్టడం తప్పు. CJI వ్యాఖ్యలు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు. రేవంత్ ఇచ్చిన స్క్రిప్టునే కమిషన్ చెప్పింది. విద్యుత్ కొనుగోళ్లు సక్రమంగానే జరిగాయి. ఎలాగైనా కేసీఆర్‌ను ఇరికించాలని చూశారు’ అని ఆయన ఆరోపించారు.