news

News July 16, 2024

కేసీఆర్ పిటిషన్‌పై విచారణ ముగించిన సుప్రీం

image

TG: విద్యుత్ కమిషన్‌ను రద్దు చేయాలని మాజీ సీఎం కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు ముగించింది. కమిషన్ ఛైర్మన్ జస్టిస్ <<13639787>>నరసింహారెడ్డి<<>> స్థానంలో కొత్త వారిని నియమించి తదుపరి విచారణ కొనసాగించవచ్చని స్పష్టం చేసింది. కమిషన్ రద్దు చేయాల్సిన అవసరం లేదన్న ప్రభుత్వ వాదనతో కోర్టు ఏకీభవించింది. అటు సోమవారంలోగా కొత్త ఛైర్మన్‌ను నియమిస్తామని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో వెల్లడించింది.

News July 16, 2024

తెలుగులో జీవో.. వెంకయ్య నాయుడు అభినందనలు

image

తెలంగాణ ప్రభుత్వం రుణమాఫీ మార్గదర్శకాల జీవోను తెలుగులో ఇవ్వడం అభినందనీయమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. ‘ప్రజల కోసమే పరిపాలన అయినప్పుడు వారికి అర్థమయ్యే భాషలోనే ఉత్తర్వులు, పరిపాలన సమాచారం ఉండాలని ఎప్పటినుంచో చెబుతున్నా. సీఎం రేవంత్, వ్యవసాయశాఖ కార్యదర్శికి అభినందనలు. తెలుగు రాష్ట్రాలు ఇక నుంచి ఉత్తర్వులన్నీ పూర్తిగా తెలుగులోనే అందించాలని ఆకాంక్షిస్తున్నా’ అని ట్వీట్ చేశారు.

News July 16, 2024

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు

image

AP: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. నూతన ఇసుక పాలసీకి ఓకే చెప్పిన మంత్రిమండలి.. త్వరలో విధివిధానాలను ఖరారు చేయనుంది. ఈ నెల 22 నుంచి అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు ఆమోదం తెలిపింది.

News July 16, 2024

తెలంగాణ సచివాలయానికి ఇంటర్నెట్ కట్

image

తెలంగాణ సచివాలయంలో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. రూ.కోట్లలో పెండింగ్ బిల్లులు ఉండటంతో ఇంటర్నెట్ సేవలు నిలిపివేసినట్లు తెలుస్తోంది. కొన్ని రోజులుగా బకాయిలు చెల్లించాలంటూ ‘నిపుణ’ నెట్‌వర్క్ విజ్ఞప్తి చేసినా చెల్లించకపోవడంతో ఇంటర్నెట్ కట్ చేసినట్లు సమాచారం. దీంతో పలు శాఖల సేవలు నిలిచిపోయాయి.

News July 16, 2024

ఓపెనర్లుగా హెడ్, మెక్‌గుర్క్.. ప్రత్యర్థులకు చుక్కలే!

image

ఆస్ట్రేలియా తరఫున వన్డేలు, T20ల్లో ట్రావిస్ హెడ్, జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ ఓపెనింగ్ చేయనున్నారు. త్వరలో స్కాట్లాండ్, ఇంగ్లండ్‌తో జరగబోయే సిరీస్‌లలో వీరు మెరుపులు మెరిపించనున్నారు. మెక్‌గుర్క్ ఐపీఎల్ సీజన్ 17లో విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. 9 ఇన్నింగ్సుల్లో 234 స్ట్రైక్ రేట్‌తో 330 పరుగులు బాదారు. అలాగే హెడ్ కూడా 190 స్ట్రైక్ రేట్‌తో 567 రన్స్ బాది ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించారు.

News July 16, 2024

విద్యుత్ కమిషన్ ఛైర్మన్‌ను మార్చండి: సీజేఐ

image

TG: విద్యుత్ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి తీరుపై సీజేఐ చంద్రచూడ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టులో కమిషన్ రద్దు పిటిషన్‌పై ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత ఆయన మాట్లాడారు. ప్రెస్‌మీట్‌లో ఛైర్మన్ ఒకరికి ప్రతికూలంగా ఉండొద్దని, నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూచించారు. కమిషన్ ఛైర్మన్‌ను మార్చే అవకాశం ప్రభుత్వానికి ఇస్తున్నామన్నారు. మరోవైపు ఛైర్మన్‌ను మారుస్తామని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు.

News July 16, 2024

విజయసాయి రెడ్డి ప్రెస్‌మీట్‌పై స్పందించిన మంత్రి లోకేశ్

image

AP: YCP MP విజయసాయి రెడ్డి నిన్నటి ప్రెస్‌మీట్‌లో వాడిన భాష తీవ్ర అభ్యంతరకరమని మంత్రి లోకేశ్ మండిపడ్డారు. ‘మీడియా ప్రతినిధులను అసభ్య పదజాలంతో దూషించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. పెద్దల సభ ప్రతినిధిగా ఉన్న మీకు నేను మంచీమర్యాదల గురించి చెప్పాల్సిన పనిలేదు. అధికారం పోయినా అహంకారం తగ్గలేదు. ఐదేళ్ల YCP పాలనలో మీ భాష, ప్రవర్తన, అవినీతి, అరాచకం చూసి ప్రజలు ఛీ కొట్టినా బుద్ధి రాలేదు’ అని ట్వీట్ చేశారు.

News July 16, 2024

పాన్ కార్డు ఉన్నవారికి రైతుభరోసా రాదా? మంత్రి ఏమన్నారంటే?

image

TG: పాన్ కార్డు ఉన్న రైతులకు రైతు భరోసా ఇవ్వరని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అలాంటిదేమీ లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పంట మీద వచ్చిన ఆదాయానికి ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ ఉండదని చెప్పారు. రైతు భరోసాపై అభిప్రాయ సేకరణలో నిన్న హనుమకొండలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు కడుతూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు.

News July 16, 2024

బీజేపీ తప్పుడు విధానాలతో సైనికులపై ఎఫెక్ట్: రాహుల్ గాంధీ

image

డోడాలో జరిగిన ఉగ్రదాడిలో మరణించిన జవాన్ల కుటుంబాలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సానుభూతి తెలియజేశారు. వరుసగా ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం ఆందోళనకరమని ట్వీట్ చేశారు. ఈ దాడులు JKలోని దయనీయ పరిస్థితులను వెల్లడిస్తున్నాయన్నారు. BJP తప్పుడు విధానాలు సైనికులు, వారి కుటుంబాలపై ప్రభావం చూపిస్తున్నాయని దుయ్యబట్టారు. భద్రతా వైఫల్యానికి కేంద్రమే బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేశారు.

News July 16, 2024

ప్రభుత్వానికి కలెక్టర్లే కళ్లు, చెవులు: సీఎం

image

TG: ఆరు గ్యారంటీలను పారదర్శకంగా అమలు చేసే బాధ్యత కలెక్టర్లపై ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజల నుంచి అందుతున్న దరఖాస్తుల్లో నిజమైన లబ్ధిదారులను గుర్తించి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. ప్రభుత్వానికి కలెక్టర్లే కళ్లు, చెవులని వివరించారు. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా మానవీయ కోణంలో ప్రజలకు సేవలు అందించాలని సచివాలయంలో జరిగిన సమావేశంలో కలెక్టర్లకు సీఎం సూచించారు.