India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రముఖ కథక్ కళాకారిణి కుముదిని లఖియా(95) మరణించారు. ఇవాళ ఉదయం ఆమె నివాసంలో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గుజరాత్‌లోని అహ్మాదాబాద్‌లో 1930లో కుముదిని జన్మించారు. కడంబ్ సెంటర్ ఫర్ డాన్స్‌ను స్థాపించారు. కేంద్రం ఆమె సేవలను గుర్తించి ఈ ఏడాది పద్మ విభూషణ్ అవార్డుతో సత్కరించింది.
ఏపీలో ఇంటర్ ఫలితాలు వెల్లడించడంతో తెలంగాణలోనూ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 25 లేదా 27న రిజల్ట్స్ ప్రకటించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో మార్చి 5 నుంచి 25వ తేదీ వరకు జరిగిన పరీక్షలకు 9.96 లక్షల మంది హాజరైన విషయం తెలిసిందే. ఇప్పటికే మూల్యాంకనం పూర్తిచేసి ఆన్‌లైన్‌లో మార్కులు ఫీడ్ చేశారు. ఈ నెల 20 నాటికి రీవెరిఫికేషన్ పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు.
TG: కాంగ్రెస్ హయాంలో తెలంగాణ దేశంలోనే అత్యల్ప ద్రవ్యోల్బణం కలిగిన రాష్ట్రంగా నిలిచిందని సీఎం రేవంత్ ట్వీట్ చేశారు. తమ ప్రభుత్వ విధానాలకు ఇది నిదర్శనమని పేర్కొన్నారు. BRS హయాంలో ద్రవ్యోల్బణం అధికంగా నమోదైందని తెలిపారు. ప్రజా ప్రభుత్వ పాలనలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే సిలిండర్, ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, సన్నబియ్యం రేషన్ వంటి సాహసోపేతమైన నిర్ణయాలతో మార్పు తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు.
డ్రీమ్ గర్ల్ మూవీ సీక్వెల్‌లో తనను కాదని అనన్యా పాండేను తీసుకోవడంతో చాలా బాధపడ్డానని బాలీవుడ్ హీరోయిన్ నుష్రత్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘నా సినిమా సీక్వెల్‌లో నన్నే పక్కనపెట్టారు. బాధపడడం తప్ప ఏం చేయలేకపోయాను. ఇతరుల నిర్ణయాలను మనం నియంత్రించలేం కదా?’ అంటూ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. కాగా ఆయుష్మాన్ ఖురానా, అనన్య నటించిన ‘డ్రీమ్ గర్ల్ 2’ 2023లో విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది.
UPI పేమెంట్స్ నిలిచిపోవడంపై నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) స్పందించింది. సాంకేతిక కారణాలతో సేవల్లో అంతరాయం ఏర్పడిందని, పరిష్కారం కోసం కృషి చేస్తున్నట్లు పేర్కొంది. సేవల పనితీరుపై ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తామని, వినియోగదారులకు కలుగుతున్న అసౌకర్యానికి చింతిస్తున్నట్లు వెల్లడించింది. అటు ఇటీవల తరచూ పేమెంట్స్ ఫెయిల్ అవుతుండటంతో యూజర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
వనజీవి రామయ్య లక్షలాది మొక్కలు నాటడానికి, వాటిని రక్షించడానికి తన జీవితాన్ని అంకితమిచ్చారని PM మోదీ కొనియాడారు. ‘ఆయన అవిశ్రాంత కృషి ప్రకృతిపై గాఢమైన ప్రేమను, భవిష్యత్తు తరాల పట్ల బాధ్యతను ప్రతిబింబిస్తాయి. ఆయన చేసిన కృషి యువతలో హరిత గ్రహాన్ని నిర్మించాలనే తపనను ప్రేరేపిస్తూనే ఉంటుంది. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు, ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అని PM తెలుగులో ట్వీట్ చేశారు.
AP: కడప జిల్లా కమలాపురం Govt జూనియర్ కాలేజీలో 33 మంది ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులు పరీక్షలు రాయగా అందరూ ఫెయిల్ అయినట్లు ప్రిన్సిపల్ ఖాజా పర్వీన్ తెలిపారు. సెకండ్ ఇయర్‌లో 14 మంది పరీక్షలు రాస్తే ఇద్దరు మాత్రమే పాస్ అయినట్లు వెల్లడించారు. అయితే అప్‌గ్రేడ్ చేసిన కాలేజీల్లోనే ఫెయిల్ పర్సంటేజ్ ఎక్కువ నమోదైనట్లు తెలుస్తోంది.
AP: వ్యవస్థలను నాశనం చేసింది కాబట్టే వైసీపీ పతనమైందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దుయ్యబట్టారు. తమ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి వేధించారని మండిపడ్డారు. తమ ఎంపీలను పోలీసులతో వైసీపీ ప్రభుత్వం కొట్టించిందన్నారు. అయితే టీడీపీ ప్రభుత్వం చట్టాలకు వ్యతిరేకంగా పనిచేయదని చెప్పారు. మరోవైపు టీటీడీ గోశాలలో గోవులు మరణించాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు.
వక్ఫ్ చట్ట సవరణను వ్యతిరేకిస్తూ పశ్చిమ బెంగాల్‌లో జరిగిన నిరసనలు <<16039360>>హింసాత్మకంగా <<>>మారిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి 110 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మాల్దా, ముర్షీదాబాద్, సౌత్ 24 పరగనాస్, హుగ్లీ జిల్లాల్లో ఆందోళనకారులు రోడ్లపైకి చేరి రాళ్ల దాడికి దిగారని పోలీసులు తెలిపారు. దర్యాప్తు కొనసాగుతోందని, ముర్షీదాబాద్‌లోనే 110 మందిని అరెస్టు చేశామన్నారు. ప్రస్తుతం పరిస్థితి నియంత్రణలోనే ఉందన్నారు.
TG: మంత్రి పదవి కోసం 32 మంది పోటీపడుతున్నారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. కానీ నలుగురికే ఆ పదవి దక్కుతుందని జోస్యం చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికి దమ్ముంటే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని సవాల్ విసిరారు. మంత్రి వర్గ విస్తరణ తర్వాత ఎంత మంది ఉంటారనే విషయమై స్పష్టత లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ ప్రభుత్వం ఎప్పుడు కూలుతుందో తెలియదన్నారు.
Sorry, no posts matched your criteria.