India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ప్రధాని మోదీ సంఘీభావం తెలిపారు. ‘నా స్నేహితుడు ట్రంప్‌పై దాడిని ఖండిస్తున్నా. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు. ట్రంప్ త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నా’ అంటూ మోదీ ట్వీట్ చేశారు. కాగా పెన్సిల్వేనియా రాష్ట్రంలోని బట్లర్ సిటీలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ట్రంప్‌పై కాల్పులు జరిగాయి. దీంతో గాయాలపాలైన ఆయనను వెంటనే ఆస్పత్రికి తరలించారు.
AP: అనంతపురం(D) హవళిగికి చెందిన భార్యాభర్తలు మారెప్ప, లక్ష్మి కష్టపడి కొత్త ఇల్లు నిర్మించుకున్నారు. ఇవాళ గృహప్రవేశం పెట్టుకున్నారు. కొత్తింట్లో తమ జీవితం ఆనందంగా ఉంటుందని కలలు కంటూ నిన్న రాత్రి పాత ఇంట్లో నిద్రలోకి జారుకున్నారు. అంతలోనే వర్షానికి తడిసిన ఇంటి పైకప్పు కూలి వారిపై పడింది. గాఢనిద్రలో ఉన్న దంపతులిద్దరూ అక్కడికక్కడే మరణించారు. పక్కనే నిద్రిస్తున్న వారి కూతురు స్వల్ప గాయాలతో బయటపడింది.
ఇవాళ జింబాబ్వే, భారత్ మధ్య ఐదో టీ20 మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే 3-1 తేడాతో సిరీస్‌ను టీమ్ ఇండియా సొంతం చేసుకోగా ఈ మ్యాచ్ నామమాత్రం కానుంది. తొలి మ్యాచులో విఫలమైనా మిగతా మ్యాచుల్లో భారత బ్యాటర్లు, బౌలర్లు అదరగొట్టారు. దీంతో చివరి మ్యాచ్‌నూ విజయంతో ముగించాలని ఇండియన్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
ఒడిశాలోని పూరీ జగన్నాథుడి ఆలయ సమీపంలో రత్నభాండాగారం చిన్న ఆలయ తరహాలో ఉంటుంది. ఇందులో ఆభరణాలను భద్రపరిచేందుకు బహరా భాండార్(బయట గది), భితరా భాండార్(లోపలి గది) అనే రెండు గదులు ఉంటాయి. స్వామివారికి ఉపయోగించే ఆభరణాలు బయట గదిలో, ఒడిశాను పాలించిన రాజులు, నేపాల్ పాలకులు ఈ ఆలయానికి విరాళంగా అందజేసిన బంగారు, వెండి, వజ్రాలను లోపలి గదిలో భద్రపరిచారు.
తనపై హత్యాయత్నం తర్వాత అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ తొలిసారి స్పందించారు. ర్యాలీలో ప్రసంగిస్తున్న సమయంలో శబ్దంతో ఏదో చెవిపై దూసుకుపోయినట్లు అర్థమైందని చెప్పారు. రక్తస్రావం జరగడంతో, ఆ తర్వాత ఏమైందో గ్రహించినట్లు పేర్కొన్నారు. వెంటనే అప్రమత్తమై మోకాళ్లపై కూర్చున్నట్లు వెల్లడించారు. దేశంలో ఇలాంటి ఘటన జరగడం నమ్మశక్యంగా లేదన్నారు. ప్రస్తుతం ట్రంప్ ఆరోగ్య పరిస్థితి క్షేమంగానే ఉంది.
ఒడిశాలోని పూరీ ఆలయ రత్నభాండాగారం నేడు తెరుచుకోనుంది. 1978లో ఈ గదిని తెరిచి చివరిసారిగా అందులోని సంపదను లెక్కించారు. 70 రోజుల పాటు సాగిన ఈ ప్రక్రియలో రెండు గదుల్లో రాళ్లు పొదిగిన 128.380 కేజీల బరువైన 454 బంగారు ఆభరణాలు, 221.530 కిలోల వెండి వస్తువులు ఉన్నాయని ఆడిట్‌లో తెలిపారు. ఆ తర్వాత 1982, 1985లో లోపలి గదిని తెరిచినా లెక్కలు నిర్వహించలేదు. 2018లో తెరవాలని ప్రయత్నించినా వీలు కాలేదు.
TG: పటాన్‌చెరు BRS MLA గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్‌లోకి వెళ్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. నిన్న రాత్రి ఆయన సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి, పార్టీలో చేరికపై చర్చించారని వార్తలొచ్చాయి. దీంతో నేడో, రేపో మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం. ఇటీవల ఆయనపై ఈడీ దాడులు జరిగాయి. దీంతో బీజేపీలో చేరాలని భావించినా.. అనుచరుల ఒత్తిడితో నిర్ణయం మార్చుకున్నట్లు తెలుస్తోంది.
బిహార్‌కు ప్రత్యేక హోదా డిమాండ్ నేపథ్యంలో కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలోని ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇవ్వొద్దని నీతి ఆయోగ్ స్పష్టం చేసినట్లు మీడియాతో పేర్కొన్నారు. రాజకీయ పార్టీల నేతలు ఏమైనా చేయగలరని, అయితే ప్రత్యేక హోదాను ఇవ్వలేమని తెలిపారు. ఆ ప్రాంత అభివృద్ధి కోసం నిధులను మాత్రం మోదీ ప్రభుత్వం అందజేస్తుందని చెప్పారు.
ఫుట్‌బాల్ అభిమానులకు గుడ్ న్యూస్. 5 గంటల వ్యవధిలోనే రెండు ఫైనల్స్ జరగనున్నాయి. భారత కాలమానం ప్రకారం ఇవాళ అర్ధరాత్రి 12:30 గంటలకు స్పెయిన్, ఇంగ్లండ్ మధ్య యూరో ఛాంపియన్‌షిప్ ఫైనల్ జరగనుంది. ఈ మ్యాచులో స్పెయిన్ ఫేవరెట్‌గా ఉంది. మరోవైపు రేపు ఉదయం 5.30 గంటలకు అర్జెంటీనా, కొలంబియా మధ్య కోపా అమెరికా ఫైనల్ జరగనుంది. ఇప్పటికే 15 టైటిళ్లు సొంతం చేసుకున్న మెస్సీ టీమ్ మరో ట్రోఫీ గెలవాలని ఎదురుచూస్తోంది.
TGలోని పలు జిల్లాల్లో నేటి నుంచి బుధవారం వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇవాళ నిర్మల్, NZB, VKD, MDK, KMRD, MBNR, NGKL జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు పడతాయని తెలిపింది. రేపు జనగామ, SDPT, MDK, KMRD జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. బుధ, గురువారాల్లోనూ ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
Sorry, no posts matched your criteria.