news

News July 13, 2024

మూత్రాన్ని మంచినీరుగా మార్చే పరికరం!

image

భవిష్యత్తులో చంద్రుడిపైనో లేక మార్స్‌పైనో ఎక్కువ దూరం నడవాల్సి వస్తే నీటి సదుపాయమెలా? భారీగా నీటిని మోసుకెళ్లడం అక్కడ అసాధ్యం. ఈ ఆలోచనతోనే కార్నెల్ వర్సిటీ (USA) పరిశోధకులు ఓ పరికరాన్ని రూపొందించారు. వ్యోమగాముల సూట్‌లో డైపర్‌లో మూత్రాన్ని ఇది శుద్ధి చేసి స్వచ్ఛమైన మంచినీరుగా మారుస్తుందని వారు చెబుతున్నారు. అంతరిక్ష కేంద్రంలో ఇప్పటికే ఈ ఏర్పాటు ఉన్నా సూట్‌లో అమర్చేలా చేసిన తొలి పరికరం మాత్రం ఇదే.

News July 13, 2024

ఒక్క చుక్క నీరు పడదు.. ప్రపంచంలో తొలి క్రికెట్ ఇండోర్ స్టేడియం!

image

వర్షం పడినా మ్యాచ్ ఆగకుండా ఆస్ట్రేలియా కొత్త ఇండోర్ స్టేడియాన్ని డిజైన్ చేస్తోంది. టాస్మానియాలో స్టీల్, టింబర్ మిశ్రమాలతో రూఫ్ నిర్మించనున్నారు. దీని వల్ల ఒక్క చుక్క నీరు కూడా కింద పడదు. ఎండ, సహజ కాంతి స్టేడియంలోకి పడేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 23వేల సీటింగ్ కెపాసిటీ ఉన్న ఈ స్టేడియాన్ని 2028లో అందుబాటులోకి తెచ్చేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా ప్రణాళికలు రచిస్తోంది.

News July 13, 2024

ఆసరా పెన్షన్ తిరిగివ్వమని నోటీసులా?: కేటీఆర్

image

TG: దొంగ హామీలతో గద్దెనెక్కిన రేవంత్ ప్రభుత్వం వింత చేష్టలు మొదలుపెట్టిందని KTR విమర్శించారు. ఏవో కారణాలు చూపిస్తూ ఆసరా పెన్షన్ లబ్ధిదారుల సొమ్మును వెనక్కి పంపమని నోటిసులు పంపిస్తోందని ట్వీట్ చేశారు. భద్రాద్రి(D)కి చెందిన మల్లమ్మ(80)కు ఆసరా పెన్షన్ కింద వచ్చిన 1.72 లక్షలు వెనక్కు కట్టాలని నోటీసు ఇవ్వడం అమానవీయమని మండిపడ్డారు. ఈ చర్యలు మానకుంటే రేవంత్ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడతారని హెచ్చరించారు.

News July 13, 2024

శ్రీలంకలో ఆసియా కప్.. ఫ్రీ ఎంట్రీ

image

మహిళా టీ20 ఆసియా కప్‌ మ్యాచులు వీక్షించేందుకు ప్రేక్షకులకు ఉచిత ప్రవేశం కల్పిస్తామని శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈనెల 19న డంబుల్లా వేదికగా జరిగే తొలి మ్యాచ్‌లో యూఏఈతో నేపాల్ తలపడనుంది. అదే రోజు భారత్-పాకిస్థాన్ మధ్య హైఓల్టేజీ మ్యాచ్‌ జరగనుంది. గ్రూప్-ఎలో భారత్, పాకిస్థాన్, UAE, నేపాల్ ఉన్నాయి. గ్రూప్-బిలో బంగ్లాదేశ్, శ్రీలంక, మలేషియా, థాయ్‌లాండ్ ఉన్నాయి. మొత్తం 15 మ్యాచులు జరగనున్నాయి.

News July 13, 2024

పవర్‌ఫుల్ IAS కృష్ణతేజ గురించి తెలుసా?

image

పల్నాడు(D) చిలకలూరిపేటకు చెందిన మైలవరపు కృష్ణతేజ 2014 సివిల్స్‌లో 66వ ర్యాంక్ సాధించారు. 2018లో కేరళలో వరదలు ప్రళయం సృష్టించిన సమయంలో అలెప్పీ సబ్ కలెక్టర్‌గా ఉన్న కృష్ణతేజ 2.50 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సరస్సును ఆక్రమించి నిర్మించిన 54 ఖరీదైన విల్లాలను నేలమట్టం చేయించారు. కృష్ణతేజ డిప్యుటేషన్‌పై ఏపీకి రానున్నారు. పవన్ మంత్రిగా ఉన్న పంచాయతీరాజ్ శాఖను ఈయనకు అప్పగించే ఛాన్స్ ఉంది.

News July 13, 2024

టెన్త్ తెలుగు పుస్తకంలో తప్పులు.. వారం రోజుల్లో కొత్త బుక్‌లెట్స్

image

AP: పదో తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలో తప్పులు దొర్లడంపై పాఠశాల విద్యాశాఖ వివరణ ఇచ్చింది. సీడీల్లో మార్పు వల్లే ఈ తప్పు జరిగినట్లు తెలిపింది. పదో తరగతిలో కొత్త సిలబస్ ప్రవేశ పెట్టామని.. అయితే సీడీల్లో మార్పు వల్ల ఉమ్మడి ప.గో, తూ.గో, కృష్ణా జిల్లాలకు సరఫరా చేసిన పుస్తకాల్లో కొన్ని తప్పులు దొర్లాయంది. తప్పులున్న పేజీల స్థానంలో విద్యార్థులకు వారం రోజుల్లో అనుబంధ బుక్‌లెట్‌లు అందిస్తామని తెలిపింది.

News July 13, 2024

జాతీయ రహదారి విస్తరణకు త్వరలో టెండర్లు

image

AP: హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారి విస్తరణ ప్రాజెక్టు డీపీఆర్ రూపకల్పన బాధ్యతను ప్రైవేటు సంస్థకు ఇవ్వాలని కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. వచ్చే నెల చివరిలోగా టెండర్లు ఆహ్వానించాలని భావిస్తోంది. 181.5 కి.మీ మేర ప్రస్తుతం నాలుగు వరుసలుగా ఉన్న ఈ రహదారిని ఆరు లైన్లుగా విస్తరించనున్నారు. నిర్మాణ వ్యయం రూ.600 కోట్ల నుంచి రూ.700 కోట్లు అవుతుందని ప్రాథమిక అంచనా.

News July 13, 2024

అనంత్-రాధికా వెడ్డింగ్.. ఫస్ట్ ఫొటో

image

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్‌ అంబానీ తనయుడు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ వివాహ బంధంతో నిన్న ఒక్కటయ్యారు. తాజాగా వీరి పెళ్లికి సంబంధించిన ఫొటో ఒకటి బయటికి వచ్చింది. వీరి వివాహానికి దేశవిదేశాల నుంచి అతిథులు తరలి వచ్చిన సంగతి తెలిసిందే. ఈరోజు శుభ్ ఆశీర్వాద్, రేపు మంగళ్ ఉత్సవ్ కార్యక్రమాలు జరగనున్నాయి.

News July 13, 2024

7సార్లు కాటు.. పాములు పగబడతాయా?(2/2)

image

పాము పగపై శాస్త్రీయంగా అధ్యయనాలేవీ జరగలేదు. నిజంగా పగలాంటిది ఉంటే సర్పాలు విరివిగా ఉండే భారత్‌లో ఇప్పటికే నిరూపణ అయి ఉండేదంటున్నారు జంతునిపుణులు. బహుశా బాధితుడిని తొలి పాము కాటేసినప్పుడు దాని తాలూకు ఆనవాలు ఏదైనా అతడిపై ఉండిపోయిందా..? దాన్ని పసిగట్టిన ఇతర పాములు అతడిని వెంబడిస్తున్నాయా? ఈ దిశగానూ ఆలోచించాలంటున్నారు నిపుణులు. మరి ‘పాముపగ’పై మీకు తెలిసిన ఘటనలేమైనా ఉన్నాయా? కామెంట్ చేయండి.

News July 13, 2024

7సార్లు కాటు.. పాములు పగబడతాయా?(1/2)

image

యూపీలో ఓ వ్యక్తి పదే పదే పాముకాటుకు గురవుతుండటంతో <<13618835>>పాము<<>> పగ గురించి చర్చ నడుస్తోంది. పాము పగకు శాస్త్రీయ ఆధారం లేదు. మనిషి వాటికి ఆహారం కాదు కనుక హాని జరుగుతుందనిపిస్తే తప్ప కాటేయవు. బాధితుడు వేరే ఊరు వెళ్లినా కాటుకు గురయ్యానంటున్నాడు కాబట్టి కరిచింది ఒకే పాము కాకపోవచ్చు. ఇన్నిసార్లు కరిచినా బతికి బట్టకట్టాడు కాబట్టి విషపూరితమైనవి కూడా కాకపోవచ్చు. మరి ఎందుకు అతడిని వెంటాడుతున్నాయి? (1/2)