India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: సీఎం చంద్రబాబు రేపు సాయంత్రం ముంబైకి వెళ్లనున్నారు. ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ వివాహ వేడుకలో పాల్గొననున్నారు. రాత్రికి ముంబైలోనే బస చేసి ఆదివారం అమరావతికి సీఎం రానున్నారు.
ప్రజలను అవమానించడం బలం కాదని, వారి బలహీనతకు నిదర్శనమని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చెప్పారు. అమేథీలో ఓడిన కేంద్ర మాజీ మంత్రి స్మృతీ ఇరానీ లేదా ఇతర నేతలపై అసభ్యకర వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని అందరికీ సూచించారు. జీవితంలో గెలుపోటములు సహజమన్నారు. కాగా 2019లో రాహుల్‌పై అమేథీలో గెలిచిన స్మృతి.. 2024లో కిశోర్ లాల్ శర్మ చేతిలో ఓడారు. దీంతో కొన్ని రోజులుగా కాంగ్రెస్ అభిమానులు ఆమెపై విమర్శలు చేస్తున్నారు.
AP: రాష్ట్రంలో 4,151KM మేర రోడ్లపై గుంతలు ఉన్నాయని అధికారులు సీఎం చంద్రబాబుకు తెలిపారు. తక్షణమే మరమ్మతులు చేయాల్సిన రహదారులు మరో 2,936KM మేర ఉన్నాయని చెప్పారు. వీటి కోసం కనీసం రూ.300 కోట్లు అవసరమన్నారు. దీంతో గుంతలు పూడ్చే పనులను వెంటనే చేపట్టాలని సీఎం ఆదేశించారు. రోడ్ల మరమ్మతులు, నిర్మాణంలో మెరుగైన సాంకేతికతను వినియోగించడంపై తిరుపతి IIT, SRM వర్సిటీ ప్రొఫెసర్లు, నిపుణులతో ఆయన చర్చించారు.
AP: ప్రజలను మోసం చేసి కూటమి అధికారంలోకి వచ్చిందని వైసీపీ నేత పేర్ని నాని ఆరోపించారు. ఆరడుగుల అబద్ధానికి చంద్రబాబే నిదర్శనమని ఎద్దేవా చేశారు. ‘చంద్రబాబు ఇచ్చే ఉచిత ఇసుకలో ఉచితం ఉండదు. అమ్మకు వందనం అంటారు.. పిల్లలకు పంగనామం పెడతారు. హామీల అమలును మరిచి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. పోలవరాన్ని నాశనం చేసింది చంద్రబాబే. తప్పుడు లెక్కలతో ప్రజలను మభ్య పెడుతున్నారు’ అని ఆయన మండిపడ్డారు.
జూన్ 25ను ‘రాజ్యాంగ హత్యాదినం’గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈమేరకు హోంమంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. ఎమర్జెన్సీ రోజుల్లో ఇబ్బందులు పడ్డ లక్షలాది భారత ప్రజలను స్మరించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. లక్షలాది మందిని అక్రమంగా జైల్లో వేశారని, మీడియా గొంతు నొక్కేశారని గుర్తుచేశారు. కాగా 1975 జూన్ 25న ఆనాటి ఇందిరా గాంధీ ప్రభుత్వం దేశంలో ‘ఎమర్జెన్సీ’ విధించింది.
AP: రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రిగా కింజరాపు అచ్చెన్నాయుడు బాధ్యతలు స్వీకరించారు. ‘పొలం పిలుస్తోంది’ ఫైల్‌పై ఆయన తొలి సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఈ నెల 23 నుంచి ‘పొలం పిలుస్తోంది’ ప్రారంభం కానుంది. అధికారులు రైతుల వద్దకే వెళ్లి అన్ని విషయాలపై అవగాహన కల్పిస్తారు. రైతులు తమ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తేవాలి’ అని ఆయన పిలుపునిచ్చారు.
సూపర్ హిట్ మూవీ గూఢచారికి సీక్వెల్ షూటింగ్ ప్రారంభమై నెలలు గడుస్తున్నా ఎలాంటి సమాచారం రాకపోవడంతో అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ‘G2 అప్డేట్ ఇవ్వు అడివి శేష్ అన్నా. అసలేం జరుగుతోంది? మూవీ రద్దయ్యిందేమోనని భయమేస్తోంది’ అని ఓ వ్యక్తి ట్వీట్ చేశారు. దీనికి హీరో స్పందిస్తూ ఆగస్టు 3న గూఢచారి-2 అప్డేట్ ఇస్తానని చెప్పారు. దీంతో దానికోసం ఎదురుచూస్తున్నామంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
AP: ‘తల్లికి వందనం’ పథకం మార్గదర్శకాలను ఇంకా ఖరారు చేయలేదని పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ఈ పథకం కింద రూ.15వేలు రావాలంటే ఇవే మార్గదర్శకాలంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని కోరింది. ఈ పథకం విధివిధానాలు ప్రభుత్వం రూపొందించిన తర్వాత విడుదల చేస్తామని, అప్పటివరకూ ఎలాంటి అవాస్తవాలు నమ్మవద్దని సూచించింది.
TG: పోస్ట్ గ్రాడ్యుయేషన్(PG)లో బ్యాక్‌లాగ్స్ క్లియర్ చేసుకునేందుకు ఉస్మానియా యూనివర్సిటీ ‘వన్ టైమ్ ఛాన్స్’ను తీసుకొచ్చింది. 2000-2001 నుంచి 2018-19 మధ్య ఓయూతో పాటు అనుబంధ కాలేజీల్లో పీజీ చదివి సకాలంలో 4 సెమిస్టర్ల బ్యాక్‌లాగ్స్ క్లియర్ చేసుకోలేని వారికి అవకాశం కల్పించారు. గతంలో హాల్ టికెట్, మార్కుల మెమోల కాపీలను జతపర్చి ఆగస్టు 16వరకు ఫీజు చెల్లించవచ్చు. పూర్తి <
బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కరోనా బారిన పడ్డారు. గత కొన్ని రోజుల నుంచి మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న ఆయనకు వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో వైద్యుల సూచన మేరకు ఐసొలేషన్‌లో ఉన్నారు. అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ వివాహానికి కూడా ఆయన వెళ్లరని సమాచారం. కాగా అక్షయ్ నటించిన ‘సర్ఫిరా’ ఇవాళ థియేటర్లలో విడుదలైంది.
Sorry, no posts matched your criteria.