news

News April 12, 2025

మూడు రెట్లు పెరగనున్న ‘ఆటో’ ఎగుమతులు: నీతి ఆయోగ్

image

ఆటోమోటివ్ కాంపోనెంట్ ఇండస్ట్రీ విలువ 2030 నాటికి ₹12 లక్షల కోట్లకు చేరుతుందని నీతి ఆయోగ్ అంచనా వేసింది. ఆటోమోటివ్ ఇండస్ట్రీపై ఓ నివేదిక విడుదల చేసింది. ఎగుమతులు ₹1.72L Cr నుంచి 3రెట్లు పెరిగి రూ.5.16L Crకు చేరుతాయని పేర్కొంది. ఆటోమోటివ్ సెక్టార్‌లో ప్రపంచ దేశాలతో భారత్ పోటీపడేలా వ్యూహాత్మక ప్రణాళికలను ప్రతిపాదించింది. వాహన ఉత్పత్తుల్లో చైనా, US, జపాన్ తర్వాత IND 4వ స్థానంలో ఉన్న విషయం తెలిసిందే.

News April 12, 2025

సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పుడంటే?

image

AP: ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ మే 12 నుంచి 20 వరకు జరగనున్నాయి. 2 సెషన్లలో పరీక్షలు జరగనుండగా ఉదయం సెషన్ 9 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం సెషన్ 2.30 గంటల నుంచి 5.30 వరకు నిర్వహిస్తారు. ప్రాక్టికల్ ఎగ్జామ్స్ మే 28 నుంచి జూన్ 1 వరకు జరుగుతాయి. సప్లిమెంటరీ పరీక్షలు రాసే విద్యార్థులు ఈనెల 15-22 మధ్య ఫీజు చెల్లించాలి. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ చేయించాలనుకునే వారు ఈనెల 13-22 మధ్య అప్లై చేసుకోవాలి.

News April 12, 2025

4 రోజుల్లో రూ.5,940 పెరిగిన బంగారం ధర

image

గోల్డ్ రేట్స్ వరుసగా నాలుగోరోజు కూడా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.270 పెరిగి రూ.95,670కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.250 పెరిగి రూ.87,700గా నమోదైంది. దీంతో 4 రోజుల్లోనే 10 గ్రాముల బంగారం రేట్ రూ.5,940 పెరగడం వినియోగదారులను ఆందోళనకు గురి చేస్తోంది. అటు కేజీ వెండి ధర కూడా రూ.2000 పెరిగి రూ.1,10,000కు చేరింది.

News April 12, 2025

ఇంటర్ ఫలితాల్లో ఏ జిల్లా టాప్ అంటే!

image

AP: ఇంటర్ ఫలితాల్లో కృష్ణా జిల్లా అదరగొట్టింది. ఫస్ట్ ఇయర్‌లో 85%, సెకండియర్‌లో 93% ఉత్తీర్ణతతో టాప్ ప్లేస్‌లో నిలిచింది. తర్వాతి స్థానాల్లో గుంటూరు, NTR జిల్లాలు ఉన్నాయి. ప్రభుత్వ జూ.కాలేజీల్లో మన్యం జిల్లా టాప్ ప్లేస్ దక్కించుకోగా గుంటూరు, అన్నమయ్య 2, 3 స్థానాల్లో నిలిచాయి. ఫస్ట్ ఇయర్‌లో 4,87,295 మంది పరీక్ష రాయగా 3,42,979 మంది పాసయ్యారు. సెకండియర్‌లో 4,22,030 మందికి 3,51,521 మంది పాసయ్యారు.

News April 12, 2025

ఆ 400 ఎకరాల తాకట్టులో దాగిన చీకటి కోణం ఏంటి?: హరీశ్ రావు

image

TG: గచ్చిబౌలిలోని 400 ఎకరాలను తనఖా పెట్టి రుణం తీసుకున్నట్లు అసెంబ్లీలో ప్రభుత్వం చెప్పిందని BRS MLA హరీశ్ రావు తెలిపారు. తాము తాకట్టు పెట్టుకోలేదని ICICI బ్యాంక్ చెబుతోందని, మరి GOVT ఎక్కడ తాకట్టు పెట్టిందని ప్రశ్నించారు. CM రేవంత్ తన బ్రోకర్ కంపెనీల వద్ద తనఖా పెట్టారా? అని నిలదీశారు. ఆ భూముల విషయంలో దాగి ఉన్న చీకటి కోణం ఏంటో చెప్పాలన్నారు. ఈ వ్యవహారంపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

News April 12, 2025

ఘోర విషాదం.. 10 మంది మృతి

image

APలో తీవ్ర విషాదం నెలకొంది. 3 ప్రాంతాల్లో జరిగిన ఘోర ప్రమాదాల్లో 10 మంది దుర్మరణం పాలయ్యారు. ఇవాళ అన్నమయ్య(D) మైలపల్లి రాచపల్లిలో నీటి కుంటలో పడి ఏడేళ్ల వయసున్న ముగ్గురు బాలురు మరణించారు. తూర్పుగోదావరి(D) కోరుకొండలో విద్యుత్ వైర్లు తగిలి ముగ్గురు వ్యక్తులు చనిపోయారు. నిన్న అనంతపురం(D) కుందుర్చిలో బొగ్గుల బట్టీ కోసం జేసీబీతో తీస్తున్న మట్టి పడి అక్కడే ఆడుకుంటున్న నలుగురు పిల్లలు చనిపోయారు.

News April 12, 2025

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ఉద్యోగులకు సెలవులు రద్దు

image

AP: విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపునకు నిరసనగా కార్మిక సంఘాలు ఈ నెల 16 నుంచి సమ్మెకు పిలుపునిచ్చాయి. దీంతో యాజమాన్యం అప్రమత్తమైంది. ముందు జాగ్రత్తగా ఈ నెల 15 నుంచి 30 వరకు ఉద్యోగులు, సిబ్బందికి సెలవులను రద్దు చేసింది. అందరూ విధులకు హాజరవ్వాలని ఆదేశించింది.

News April 12, 2025

ప్రతి జిల్లాలో ఈ నెల రైతు మేళాలు: తుమ్మల

image

TG: హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరుగుతున్న తెలంగాణ రైతు మహోత్సవానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యారు. రైతు మేళాలో పలు స్టాళ్లను సందర్శించి పంట ఉత్పత్తులను పరిశీలించారు. ఈ నెలలో ప్రతి జిల్లాలో రైతు మేళాలు నిర్వహిస్తామని తెలిపారు. నాణ్యమైన విత్తనాలు సాగు చేస్తేనే మంచి దిగుబడులు వస్తాయన్నారు. కాగా వనజీవి రామయ్య భౌతికకాయాన్ని మంత్రి సందర్శించనున్నారు.

News April 12, 2025

ఫస్టియర్‌లో 70%, సెకండియర్‌లో 83% మంది పాస్

image

AP: ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఓవరాల్‌గా ఫస్ట్ ఇయర్‌లో 70%, సెకండియర్‌లో 83% మంది విద్యార్థులు పాసైనట్లు మంత్రి లోకేశ్ వెల్లడించారు. 2014 నుంచి ఇదే అత్యధిక పాస్ పర్సెంటేజ్ అని తెలిపారు. GOVT జూనియర్ కాలేజీల్లో సెకండియర్‌లో 69 శాతం మంది ఉత్తీర్ణత సాధించడం పదేళ్లలో అత్యధికమన్నారు. ఫస్టియర్‌లోనూ 47 శాతం మంది పాసయ్యారని, ఇది దశాబ్దంలో రెండో అత్యధికమని తెలిపారు.

News April 12, 2025

పాస్టర్ ప్రవీణ్ మృతిపై పోలీసుల కీలక ప్రకటన

image

AP: పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై ఐజీ అశోక్ కుమార్ కీలక విషయాలు వెల్లడించారు. ఆయన మృతిపై కుటుంబ సభ్యులు ఎలాంటి అనుమానం వ్యక్తం చేయలేదని చెప్పారు. ఉ.11 గంటలకు ఇంటి నుంచి బయలుదేరగా దారిలో వైన్స్‌కు వెళ్లారని, మూడు చోట్ల యాక్సిడెంట్‌ జరిగిందన్నారు. పలు చోట్ల సీసీ ఫుటేజీలు, ప్రత్యక్ష సాక్షుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నట్లు చెప్పారు. మద్యం మత్తులోనే నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగిందన్నారు.