India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
PM మోదీ చాలా ఆధ్యాత్మికమైన మనిషని నోబెల్ గ్రహీత జీలింగర్ పేర్కొన్నారు. మోదీ ఆస్ట్రియా పర్యటన సందర్భంగా జరిగిన భేటీలో క్వాంటమ్ ఫిజిక్స్ నుంచి ఆధ్యాత్మికత వరకు ఎన్నో అంశాలను తాము చర్చించినట్లు ఆయన తెలిపారు. ‘ఇద్దరం ఎన్నో మాట్లాడుకున్నాం. ఆయనలోని స్పిరిచ్యువాలిటీని ప్రపంచ నేతలు కూడా అలవర్చుకోవాలి. నైపుణ్యం కలిగిన యువతను ప్రోత్సహించాలి. అప్పుడే కొత్త ఐడియాలు జన్మిస్తాయి’ అని తెలిపారు.
AP: భారీ బడ్జెట్ సినిమాలు టిక్కెట్ ధరల్ని పెంచుకునేందుకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతిస్తున్న సంగతి తెలిసిందే. ఆ అధికారం ప్రభుత్వాలకు ఉందా లేదా అన్న విషయాన్ని త్వరలో తేలుస్తామని ఏపీ హైకోర్టు పేర్కొంది. కల్కి టిక్కెట్ ధరల పెంపుపై నెల్లూరుకు చెందిన రాకేశ్ రెడ్డి దాఖలు చేసిన పిల్ విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
రష్యా, ఆస్ట్రియా పర్యటనల్ని ముగించుకున్న ప్రధాని మోదీ స్వదేశానికి బయలుదేరారు. ఆయన కార్యాలయం ట్విటర్‌లో ఈ విషయాన్ని తెలిపింది. తన పర్యటన విజయవంతమైందని పీఎం ట్విటర్‌లో తెలిపారు. భారతీయులు తనపై చూపించిన ఆప్యాయతకు ముగ్ధుడనయ్యానని పేర్కొన్నారు. కాగా.. ఈ పర్యటనలో ప్రధానికి రష్యా అత్యున్నత పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోసిల్’ను పుతిన్ ప్రదానం చేసిన సంగతి తెలిసిందే.
AP: సీఎం చంద్రబాబు నేడు అనకాపల్లి, విశాఖ, విజయనగరం జిల్లాల్లో సుడిగాలి పర్యటన చేపట్టనున్నారు. ఉదయం పదింటికి వైజాగ్ చేరుకుని అనకాపల్లి జిల్లాలోని పోలవరం ఎడమ కాలువను పరిశీలిస్తారు. మధ్యాహ్నం 12.30గంటలకు భోగాపురం ఎయిర్‌పోర్టును సందర్శిస్తారు. మధ్యాహ్నం సీఐఐ కాన్ఫరెన్స్‌లో పాల్గొంటారు. వైజాగ్‌లో నిలిచిపోయిన పలు ప్రాజెక్టులపై సాయంత్రం సమీక్ష నిర్వహించి తిరిగి రాత్రికి ఉండవల్లికి చేరుకోనున్నారు.
AP: ఏడాకుల చెట్టు(కోనోకార్పస్) ప్రజల ఆరోగ్యానికి మంచిది కాదంటూ డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ స్పష్టం చేయడంతో వాటిని తొలగించే పనిలో పడ్డారు అధికారులు. దక్షిణ అమెరికాకు చెందిన కోనోకార్పస్ జాతి మొక్కల్ని సుందరీకరణ కోసం వాడుతున్నారు. వాటి వలన భూగర్భజలాలు తగ్గిపోతాయని, ప్రజల ఆరోగ్యాలకు కూడా ప్రమాదమని ఓ అధ్యయనంలో తేలింది. దీంతో ఉప ముఖ్యమంత్రి ఆదేశాలను అనుసరించి ఏపీలో వాటిని తొలగించే ప్రక్రియ ప్రారంభమైంది.
AP: వర్షపాతం పుష్కలంగా ఉండటంతో దేశవ్యాప్తంగా జలాశయాల్లో నీటిమట్టాలు కళకళలాడుతున్నాయి. ఏపీలో మాత్రం సీన్ రివర్స్‌లో ఉంది. ప్రధానంగా కృష్ణా బేసిన్‌లోని శ్రీశైలం, నాగార్జున సాగర్ రెండూ కూడా వెలవెలబోతున్నాయని కేంద్ర జలసంఘం తాజా నివేదికలో తెలిపింది. శ్రీశైలం సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 36.66 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. ఇక సాగర్ సామర్థ్యం 312 టీఎంసీ కాగా 120 టీఎంసీలే ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
ఉక్రెయిన్ విషయంలో భారత్ రష్యాతో విభేదించిందన్న వార్తల్ని కేంద్రం కొట్టిపారేసింది. ప్రధాని రష్యా పర్యటనలో డెలిగేషన్ స్థాయి సమావేశాన్ని కూడా భారత్ క్యాన్సిల్ చేసుకుందంటూ వచ్చిన వదంతులపై విదేశీ వ్యవహారాల కార్యదర్శి వినయ్ క్వాత్రా స్పష్టతనిచ్చారు. ‘నాకు తెలిసినంత వరకు అలాంటివేమీ జరగలేదు. వాస్తవం లేని ఇలాంటి వార్తలు ఎలా పుట్టుకొస్తాయో అర్థం కాదు. పీఎం రష్యా పర్యటన సూపర్ సక్సెస్ అయింది’ అని తెలిపారు.
‘మిస్టర్ బచ్చన్’ మూవీకి సంబంధించిన ప్రోమోను ఓ నెటిజన్ విమర్శించడం చర్చనీయాంశమైంది. ‘56 ఏళ్ల రవితేజ, 25ఏళ్ల భాగ్యశ్రీతో జుగుప్సాకరమైన స్టెప్స్ వేస్తున్నారు. హీరోయిన్‌ను ఓ వస్తువులా చూపించడమే వీరిక్కావాలి’ అని ట్వీట్ చేశారు. ఆ వ్యాఖ్యలపై హరీశ్ మండిపడ్డారు. ‘కంగ్రాట్స్. బాగా కనిపెట్టావు. నోబెల్ ప్రైజ్‌కు అప్లై చేసుకో. ఇదే తరహాలో మా ఫిల్మ్ మేకర్లను వస్తువులా చూడటాన్ని కొనసాగించు’ అంటూ సెటైర్ వేశారు.
కమల్ హాసన్ ‘భారతీయుడు2’ సెన్సార్ పూర్తి చేసుకుంది. మూవీకి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ ఇచ్చింది. మొత్తం రన్ టైమ్ 180.04 నిమిషాలు ఉండనుంది. దీనికి సంబంధించిన ఫొటో నెట్టింట చక్కర్లు కొడుతోంది. రేపు విడుదల కానున్న ఈ సినిమాను డైరెక్టర్ శంకర్ తెరకెక్కించగా లైకా ప్రొడక్షన్, రెడ్ జెయింట్ మూవీస్ సంస్థలు నిర్మించాయి. సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్‌జే సూర్య తదితరులు కీలక పాత్రలు పోషించారు.
భారత బౌలింగ్ కోచ్‌గా గంభీర్, బీసీసీఐ ఎవర్ని తీసుకుంటారన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పలువురు మాజీ ఆటగాళ్ల పేర్లు వినిపిస్తున్నాయి. బీసీసీఐ జహీర్ ఖాన్ పేరు యోచిస్తుండగా, ఆర్సీబీ, టీమ్ ఇండియా మాజీ ఆటగాడు వినయ్ కుమార్ పేరును హెడ్ కోచ్ గంభీర్ పరిశీలిస్తున్నారట. వీరిద్దరూ కాక సీఎస్కే బౌలింగ్ కోచ్ బాలాజీ పేరు కూడా ప్రధానంగా వినిపిస్తోంది. చివరికి ఎవరు ఫైనల్ అవుతారన్నది చూడాలి మరి.
Sorry, no posts matched your criteria.