India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: ఇంటర్మీడియట్ రిజల్ట్స్ రిలీజ్ అయ్యాయి. ఫలితాలను విడుదల చేసినట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ట్విటర్‌లో ప్రకటించారు. ప్రస్తుతం సర్వర్లలోకి డేటా అప్‌డేట్ జరుగుతోంది. మరికొన్ని క్షణాల్లో Way2Newsలో రిజల్ట్స్ అందుబాటులోకి వస్తాయి. అత్యంత వేగంగా, సులభంగా మీ ఫలితాలను తెలుసుకోండి. యాప్ ఓపెన్ చేయగానే వచ్చే పేజీలో హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేస్తే ఫుల్ రిజల్ట్స్ వచ్చేస్తాయి. STAY TUNED
పసిఫిక్ దేశం పపువా న్యూగినియాలో భూకంపం ప్రకంపనలు సృష్టించింది. రిక్టర్ స్కేలుపై 6.2 మ్యాగ్నిట్యూడ్ తీవ్రత నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే పేర్కొంది. అయితే ఎలాంటి నష్టం వాటిల్లలేదని అధికారులు తెలిపారు. కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని హెచ్చరించారు.
సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో పవన్ తనయుడు మార్క్ శంకర్‌ను కాపాడిన రెస్క్యూ సిబ్బందికి ఆ దేశ ప్రభుత్వం సన్మానం చేసింది. స్కూల్ భవనంలో జరిగిన ప్రమాదంలో 22 మందిని సిబ్బంది రక్షించారు. ప్రాణాలను పణంగా పెట్టి, చాకచక్యంగా వ్యవహరించి విద్యార్థులను కాపాడినందుకు సత్కరించినట్లు ప్రభుత్వం పేర్కొంది. కాగా చికిత్స అనంతరం మార్క్ శంకర్ ఇంటికి చేరుకున్నట్లు మెగాస్టార్ చిరంజీవి వెల్లడించిన సంగతి తెలిసిందే.
వరుస ఓటములు ఎదురవుతుండటంతో CSK అభిమానులు నిరాశలో ఉన్నారు. పవర్ ప్లేలో హిట్టింగ్ చేసే బ్యాటర్ లేకపోవడం వల్లే ఇబ్బందులు వస్తున్నాయంటున్నారు. గాయంతో సీజన్ మొత్తానికి దూరమైన రుతురాజ్ స్థానంలో పృథ్వీషాను తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఆ పేరు Xలో ట్రెండ్ అవుతోంది. కాగా పృథ్వీ షా, ఆయుశ్ మాత్రే, మయాంక్ అగర్వాల్‌లో ఒకరిని జట్టులోకి తీసుకోవచ్చని వార్తలు వస్తున్నాయి.
ఏపీ ఇంటర్ ఫలితాలను ఉదయం 11 గంటలకు మంత్రి నారా లోకేశ్ ట్విటర్‌లో విడుదల చేయనున్నారు. అందరికంటే ముందుగా, అత్యంత వేగంగా మన Way2newsలో రిజల్ట్స్ తెలుసుకోండి. విసుగు తెప్పించే ఎలాంటి యాడ్స్ లేకుండా, హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి ఒక్క క్లిక్ చేస్తే చాలు ఫలితాలు మీ ముందు ఉంటాయి. యాప్ ఓపెన్ చేసి రెడీగా ఉండండి. విద్యార్థులకు Way2news తరఫున ALL THE BEST.
TG: కాంగ్రెస్ ప్రభుత్వం పంటలకు బీమా ఇవ్వలేదని హరీశ్ రావు దుయ్యబట్టారు. రైతు బీమా కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. సిద్దిపేటలోని రాజగోపాల్ పేటలో అకాలవర్షాలకు దెబ్బతిన్న పంటలను ఆయన పరిశీలించారు. వడగళ్లతో పంట నష్టపోయిన రైతులకు ఉచిత విత్తనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ హయాంలో రైతుబంధు, రైతుబీమా ఇచ్చామని గుర్తు చేశారు.
ప్రముఖ అప్పారెల్ బ్రాండ్ పూమాతో 8ఏళ్ల బంధానికి క్రికెటర్ విరాట్ కోహ్లీ స్వస్తి పలికారు. ఆ కంపెనీ ఏకంగా రూ.300 కోట్లు ఆఫర్ చేసినా ఆయన తిరస్కరించినట్లు క్రీడావర్గాలు చెబుతున్నాయి. 2017లో పూమాతో 8ఏళ్ల కాలానికి రూ.110 కోట్లతో కోహ్లీ ఒప్పందం చేసుకున్నారు. అది ఇటీవల ముగిసింది. ఇక నుంచి తన సొంత బ్రాండ్ ‘వన్8’ను ప్రమోట్ చేయాలన్న ఉద్దేశంతో విరాట్ ఆ సంస్థకు నో చెప్పినట్లు సమాచారం.
లెజెండరీ క్రికెటర్ జేమ్స్ అండర్సన్‌కు ఇంగ్లండ్ ప్రభుత్వం దేశ అత్యున్నత పురస్కారం ‘నైట్‌హుడ్’ను ప్రకటించింది. ఈ పురస్కార గ్రహీతలను ‘సర్’ అనే బిరుదుతో సత్కరిస్తారు. దీంతో ‘కంగ్రాట్స్ సర్ జిమ్మి అండర్సన్’ అని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ప్రకటన విడుదల చేసింది. తమ దేశ క్రికెట్‌కు ఆయన అందించిన సేవలను కొనియాడింది. అండర్సన్ 188 టెస్టుల్లో 704 వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ తరఫున అత్యధిక వికెట్ టేకర్‌గా నిలిచారు.
ఈ ఏడాది ఐపీఎల్‌లో కొన్ని జట్లు అంచనాలను మించి అదరగొడుతుండగా మరికొన్ని టీమ్స్ ఘోర ఓటములతో ఢీలాపడ్డాయి. ఇప్పటి వరకు జరిగిన 25 మ్యాచ్‌లను బట్టి ప్లేఆఫ్స్‌కు వెళ్లేందుకు ఏ జట్టుకు ఎంత అవకాశం ఉందో CricTracker అంచనా వేసింది. దీనిప్రకారం ఢిల్లీ(75%), గుజరాత్ టైటాన్స్(74%) టాప్‌లో ఉన్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా KKR(55%), PBKS(52%), RCB(50%), LSG(47%), RR(26%), MI(11%), CSK(6%), SRH(4%) ఉన్నాయి.
TG: వనజీవి రామయ్య మరణంతో తెలంగాణ ఒక ప్రపంచ పర్యావరణవేత్తను కోల్పోయిందని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అన్నారు. పర్యావరణం కోసం రామయ్య త్యాగం అసమాన్యమని తెలిపారు. హరితహారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆయన అందించిన సహకారం గొప్పదని పేర్కొన్నారు. వనజీవి మృతి పట్ల కేంద్రమంత్రి బండి సంజయ్, ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, ఈటల రాజేందర్, ఎమ్మెల్యే హరీశ్ రావు సంతాపం తెలియజేశారు.
Sorry, no posts matched your criteria.