news

News July 11, 2024

బైడెన్.. రేసు నుంచి తప్పుకోండి: నటుడు క్లూనీ

image

అధ్యక్ష బరి నుంచి జో బైడెన్ తప్పుకోవాలని హాలీవుడ్ స్టార్ జార్జ్ క్లూనీ కోరారు. పార్టీ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని బైడెన్ ఆ నిర్ణయం తీసుకోక తప్పదని అన్నారు. ‘ఇది నా అభిప్రాయమే కాదు. పార్టీలోని ప్రతి సెనేటర్, సభ్యుడూ ఈ మాటే అంటున్నారు. వచ్చే నెల పార్టీ కన్వెన్షన్లో కొత్త అభ్యర్థిని సభ్యులు ఎన్నుకోవాలి’ అని సూచించారు. డెమొక్రాట్ పార్టీకి క్లూనీ జీవిత కాలం అభిమాని కావడం గమనార్హం.

News July 11, 2024

‘నీట్‌’లో ఏ తప్పూ జరగలేదు: సుప్రీంలో కేంద్రం అఫిడవిట్

image

నీటీ-యూజీని మళ్లీ నిర్వహించాల్సిన అవసరం ఉన్నట్లు తాము భావించడం లేదని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలిపింది. ఈ మేరకు అఫిడవిట్ దాఖలు చేసింది. ఫలితాలపై తాము సమగ్ర విశ్లేషణ జరిపినట్లు తెలిపింది. కొంతమంది అభ్యర్థులకు లాభం కలిగేలా భారీ స్థాయి తప్పులేవీ జరిగినట్లు అందులో తేలలేదని వివరించింది. కేవలం అనుమానంతో నీట్ రీ-టెస్ట్ పెడితే 24లక్షల మందిపై భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.

News July 11, 2024

శుభ్‌మన్ గిల్‌పై విమర్శలు

image

జింబాబ్వేతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో రెండో మ్యాచ్‌లో సెంచరీ బాదిన ఓపెనర్ అభిషేక్ శర్మ ఈ మ్యాచ్‌లో 3వ స్థానంలో వచ్చి 10 రన్స్‌కే ఔటైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సెంచరీ చేసిన ఆటగాడి స్థానం మార్చడమేంటంటూ గిల్‌పై విమర్శలు వస్తున్నాయి. వన్‌డౌన్ తాను వెళ్లకుండా అభిషేక్‌ను డిమోట్ చేశారంటూ మండిపడుతున్నారు. అభిషేక్ స్పిన్ హిట్టర్ కాబట్టే వన్ డౌన్‌లో పంపించారంటూ గిల్ ఫ్యాన్స్‌ మద్దతుగా నిలుస్తున్నారు.

News July 11, 2024

EPFO-EPS వేతన పరిమితిని రెట్టింపు చేయండి: BMS

image

EPFO పరిధిలోని పెన్షన్ పథకంలో వేతన పరిమితి రూ.15వేలు, ESI కార్పొరేషన్‌లో వేతన పరిమితి రూ.21వేలుగా ఉన్న సంగతి తెలిసిందే. నేడు సర్వత్రా పెరిగిన ధరల దృష్ట్యా ఈ పరిమితి సరిపోదని ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ భారతీయ మజ్దూర్ సంఘ్(BMS) కేంద్ర ప్రభుత్వానికి తాజాగా గుర్తుచేసింది. పరిమితిని రెట్టింపు చేయాలని కోరుతూ సంస్థ ప్రతినిధుల బృందం కేంద్ర కార్మిక శాఖ మంత్రి మాన్‌సుఖ్ మాండవీయను కలిసి వినతిపత్రం అందించింది.

News July 11, 2024

భారతీయుల్ని చేర్చుకోవాలని మేం అనుకోలేదు: రష్యా

image

కేవలం వాణిజ్యపరమైన కారణాల వల్లే తప్ప భారతీయుల్ని తమ సైన్యంలోకి చేర్చుకోవాలని అసలు అనుకోలేదని రష్యా ఛార్జ్ డి అఫైర్స్ రోమన్ బాబుష్కిన్ తెలిపారు. ‘మేం భారతీయుల కోసం ఎప్పుడూ ప్రకటించలేదు. ఇంత పెద్ద యుద్ధంలో వారి సంఖ్య మహా అయితే 100 ఉంటుంది. అత్యధికులు చట్టవిరుద్ధంగా రష్యాలోకి వచ్చినవారే’ అని పేర్కొన్నారు. కాగా.. ఉక్రెయిన్‌తో యుద్ధంలో కనీసం నలుగురు భారతీయులు కన్నుమూసినట్లు అంచనా.

News July 11, 2024

చిన్ననాటి గురువుతో రోహిత్ శర్మ

image

టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మను ఆయన చిన్ననాటి గురువు యోగేశ్ పటేల్ కలిశారు. టీ20 వరల్డ్ కప్ సాధించినందుకు హిట్‌మ్యాన్‌కు అభినందనలు తెలిపారు. కాగా ముంబైలోని బొరివలిలో యోగేశ్‌కు చెందిన స్వామి వివేకానంద ఇంటర్నేషనల్ స్కూల్‌లో రోహిత్ నాలుగేళ్లు చదివారు. భారత కెప్టెన్ నుంచి ఎలాంటి ఫీజు వసూలు చేయకుండా ఉచితంగా చదువు చెప్పారు. ఆ పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు రోహిత్‌లోని ప్రతిభకు సానబెట్టారు.

News July 11, 2024

డయేరియాతో బాధపడుతున్నా: దర్శన్

image

తనకు ఇంటి నుంచి ఆహారం తెప్పించుకునేందుకు అవకాశమివ్వాలని కన్నడ నటుడు దర్శన్ కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. తనకు డయేరియా ఉందని, జైల్లో ఆహారం జీర్ణం కావడం లేదని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. దాన్ని విచారించిన న్యాయస్థానం, అందరికీ నిబంధనలు ఒకేలా ఉంటాయని స్పష్టం చేసింది. విచారణ ఖైదీలకు ఉన్న నిబంధనలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని పేర్కొంటూ తదుపరి విచారణను ఈరోజుకు వాయిదా వేసింది.

News July 11, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News July 11, 2024

జులై 11: చరిత్రలో ఈరోజు

image

1877: హైదరాబాద్ ఇంజినీర్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ జననం
1907: సినీ నటుడు సీఎస్ఆర్ ఆంజనేయులు జననం
1955: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపక దినోత్సవం
1964: సంగీత దర్శకుడు మణిశర్మ జననం
1987: 500 కోట్లకు చేరిన ప్రపంచ జనాభా. (జనాభా దినోత్సవం మొదలు)
2007: సినీనటుడు ‘ముత్యాల ముగ్గు’ శ్రీధర్ మరణం
* తెలంగాణ ఇంజినీర్ల దినోత్సవం

News July 11, 2024

ఈరోజు నమాజ్ వేళలు

image

తేది: జులై 11, గురువారం
ఫజర్: తెల్లవారుజామున 4:28 గంటలకు
సూర్యోదయం: ఉదయం 5:49 గంటలకు
జొహర్: మధ్యాహ్నం 12:22 గంటలకు
అసర్: సాయంత్రం 4:57 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6:55 గంటలకు
ఇష: రాత్రి 8.15 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.