news

News July 10, 2024

వారికి రుణమాఫీ లేనట్లే!

image

TG: మంత్రులు, MPలు, ఎమ్మెల్యేలు, MLCలకు రుణమాఫీ వర్తింపజేయొద్దని సర్కారు నిర్ణయించింది. ప్రభుత్వ ఉద్యోగులకూ మినహాయింపు ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. రుణమాఫీ కోసం రూ.31వేల కోట్లు అవసరమవుతాయని ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో రూ.10వేల కోట్లను ఇప్పటికే సిద్ధం చేసుకోగా, TGIIC భూములను బ్యాంకులకు తనఖా పెట్టడం ద్వారా రూ.10వేల కోట్లు, రుణాల రూపంలో మరో రూ.10వేల కోట్లను సమకూర్చుకోవాలని భావిస్తోంది.

News July 10, 2024

సీఎంతో భేటీ కానున్న BPCL ప్రతినిధులు

image

AP: మచిలీపట్నంలో రిఫైనరీ ఏర్పాటుకు బీపీసీఎల్ సుముఖంగా ఉందని ఎంపీ బాలశౌరి తెలిపారు. రాష్ట్రానికి వచ్చిన BPCL ప్రతినిధులు విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్నారు. కాసేపట్లో సీఎం చంద్రబాబుతో సమావేశం కానున్నారు. రూ.60వేల కోట్ల పెట్టుబడితో ఏర్పాటయ్యే ఈ రిఫైనరీ కోసం 2-3వేల ఎకరాల భూమి ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీని ద్వారా 25 వేల మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది.

News July 10, 2024

ఇడుపులపాయ IIITలో గంజాయి.. లోకేశ్ ఆగ్రహం

image

AP: వైఎస్సార్ కడప జిల్లాలోని ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో గంజాయి కలకలంపై మంత్రి లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు. గంజాయిని ప్రోత్సహించే నాయకులపైనా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. విద్యాలయాల్లో వాటి ఆనవాళ్లు లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. గంజాయి నిర్మూలనకు ఇప్పటికే ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టిందని తెలిపారు. IIIT విద్యార్థుల పేరెంట్స్‌ను లోకేశ్ కలిశారు.

News July 10, 2024

కోచ్‌గా గంభీర్.. విరాట్ కోహ్లీ పరిస్థితేంటి?

image

గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా హెడ్ కోచ్‌గా రావడాన్ని కొందరు విరాట్ ఫ్యాన్స్ వ్యతిరేకిస్తున్నారు. ఎప్పటి నుంచో వీరి మధ్య వాగ్వాదాలు జరిగాయని గుర్తు చేస్తున్నారు. 2013, 2016, 2023 ఐపీఎల్ సమయాల్లో ఈ ఇద్దరు స్టార్ బ్యాటర్లు మైదానంలోనే గొడవకు దిగారు. అయితే ఈ ఏడాది IPLలో గౌతీ, కోహ్లీ హగ్ చేసుకోవడంతో విభేదాలకు తెరపడినట్లు వార్తలు వచ్చాయి. మరి గంభీర్ నేతృత్వంలో కోహ్లీ భవిష్యత్ ఏంటనేది ఆసక్తికరంగా మారింది.

News July 10, 2024

గంభీర్ ముందు పెద్ద సవాళ్లు!

image

*ఈ ఏడాది ఆస్ట్రేలియాతో 5 టెస్టులు
*2025లో ఛాంపియన్స్ ట్రోఫీ
*2025లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్
*2026లో టీ20 ప్రపంచకప్
*2026లో NZతో 2 టెస్టులు
*2027లో WTC ఫైనల్
*2027లో వన్డే ప్రపంచకప్
>>గౌతమ్ గంభీర్ మూడేళ్లు టీమ్ ఇండియా హెడ్ కోచ్‌గా కొనసాగనున్నారు.

News July 10, 2024

బేర్ దెబ్బ.. సెన్సెక్స్ 600 పాయింట్లు డౌన్

image

నిన్నటి సెషన్‌లో నూతన గరిష్ఠాలను నమోదు చేసిన స్టాక్ మార్కెట్లు ఈరోజు డీలా పడ్డాయి. సెన్సెక్స్ 622 పాయింట్ల నష్టంతో 79,718 వద్ద ట్రేడవుతోంది. మరోవైపు నిఫ్టీ 24,239 (-194) వద్ద కొనసాగుతోంది. పవర్, రియల్టీ, టెలికాం రంగాల్లో కొనుగోళ్లు నమోదైనా.. ఆటో, బ్యాంకింగ్, ఐటీ, మెటల్, ఆయిల్ & గ్యాస్ రంగాలు నష్టాలను నమోదు చేయడం మార్కెట్‌పై ప్రభావం చూపింది. M&M షేర్లు 6%కుపైగా నష్టాలను నమోదు చేశాయి.

News July 10, 2024

లావణ్యపై మాల్వి ఫిర్యాదు.. కేసు నమోదు

image

నటుడు రాజ్ తరుణ్ ప్రేయసి లావణ్యపై హీరోయిన్ మాల్వి మల్హోత్రా HYDలోని ఫిల్మ్ నగర్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. తనపై <<13570128>>లావణ్య<<>> తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. తన సోదరుడికి వాట్సాప్, ఇన్‌స్టాలో అనుచిత సందేశాలు పంపుతున్నారని ఆరోపించారు. ఈ ఫిర్యాదుతో పోలీసులు లావణ్యపై కేసు నమోదు చేశారు. మరోవైపు రాజ్ తరుణ్, మాల్విపై కొన్ని ఆధారాలతో నార్సింగి PSలో లావణ్య రెండోసారి ఫిర్యాదు చేశారు.

News July 10, 2024

రూ.2,00,000 రుణమాఫీపై అప్‌డేట్

image

TG: రైతులకు రుణమాఫీని వచ్చే వారం నుంచి అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం గైడ్‌లైన్స్ ప్రతిపాదనలను అధికారులు సిద్ధం చేశారు. ఈ ఫైల్‌కు సీఎం రేవంత్ ఆమోదం తెలపాల్సి ఉంది. ఒకటి, రెండు రోజుల్లో ఆమోదముద్ర పడుతుందని సమాచారం. దాదాపు ₹31 వేల కోట్ల పంట రుణాలు ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. ఆగస్టు 15లోగా ఒక్కో రైతుకు ₹2లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేస్తామని సీఎం ప్రకటించిన సంగతి తెలిసిందే.

News July 10, 2024

వారితో ‘కల్కి’ మూవీ చూడాలి: అమితాబ్

image

‘కల్కి’ సినిమాలో తన నటనకు కాకుండా పాత్రకు, కాన్సెప్ట్‌కు ప్రశంసలు వస్తున్నాయని అనుకుంటున్నట్లు బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తెలిపారు. చిత్రంలో దీపికా నటన అద్భుతమని దర్శకుడు నాగ్ అశ్విన్‌తో ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. ఆమె మంటల్లో నుంచి నడుచుకుంటూ వచ్చే సీన్ హైలైట్ అని కొనియాడారు. తెలుగు ప్రేక్షకుల మధ్య కూర్చొని సినిమా చూడాలని ఉందన్నారు. కాగా ఈ సినిమాలో అమితాబ్ అశ్వత్థామ పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే.

News July 10, 2024

మెస్సీ మెరిసే.. ఫైనల్‌కు అర్జెంటీనా

image

కోపా అమెరికా ఫుట్‌బాల్ లీగ్‌లో అర్జెంటీనా ఫైనల్‌కు చేరింది. కెనడాతో జరిగిన మ్యాచులో మెస్సీ, అల్వరెజ్ మెరవడంతో 2-0 గోల్స్ తేడాతో గెలుపొందింది. మరోవైపు INTL మ్యాచుల్లో అత్యధిక గోల్స్‌ చేసిన వారిలో మెస్సీ(109) రెండో స్థానానికి చేరారు. మొదటి స్థానంలో రొనాల్డో(130) ఉన్నారు. రేపు జరిగే సెమీస్‌లో ఉరుగ్వే, కొలంబియా తలపడనున్నాయి. గెలిచిన జట్టు ఫైనల్ చేరనుంది. ఓడిన టీమ్ 3వ స్థానం కోసం కెనడాతో పోటీ పడనుంది.