news

News July 10, 2024

వారితో ‘కల్కి’ మూవీ చూడాలి: అమితాబ్

image

‘కల్కి’ సినిమాలో తన నటనకు కాకుండా పాత్రకు, కాన్సెప్ట్‌కు ప్రశంసలు వస్తున్నాయని అనుకుంటున్నట్లు బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తెలిపారు. చిత్రంలో దీపికా నటన అద్భుతమని దర్శకుడు నాగ్ అశ్విన్‌తో ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. ఆమె మంటల్లో నుంచి నడుచుకుంటూ వచ్చే సీన్ హైలైట్ అని కొనియాడారు. తెలుగు ప్రేక్షకుల మధ్య కూర్చొని సినిమా చూడాలని ఉందన్నారు. కాగా ఈ సినిమాలో అమితాబ్ అశ్వత్థామ పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే.

News July 10, 2024

మెస్సీ మెరిసే.. ఫైనల్‌కు అర్జెంటీనా

image

కోపా అమెరికా ఫుట్‌బాల్ లీగ్‌లో అర్జెంటీనా ఫైనల్‌కు చేరింది. కెనడాతో జరిగిన మ్యాచులో మెస్సీ, అల్వరెజ్ మెరవడంతో 2-0 గోల్స్ తేడాతో గెలుపొందింది. మరోవైపు INTL మ్యాచుల్లో అత్యధిక గోల్స్‌ చేసిన వారిలో మెస్సీ(109) రెండో స్థానానికి చేరారు. మొదటి స్థానంలో రొనాల్డో(130) ఉన్నారు. రేపు జరిగే సెమీస్‌లో ఉరుగ్వే, కొలంబియా తలపడనున్నాయి. గెలిచిన జట్టు ఫైనల్ చేరనుంది. ఓడిన టీమ్ 3వ స్థానం కోసం కెనడాతో పోటీ పడనుంది.

News July 10, 2024

ధరణి పేరుతో భూమాఫియా.. KTRపై మంత్రి సత్య కుమార్ ఫైర్

image

AP: ధర్మవరంలో రోజూ జనంలోకి వెళ్లే కేతిరెడ్డి ఓడిపోవడం ఆశ్చర్యకరమన్న KTR<<13595152>>వ్యాఖ్యలకు<<>> మంత్రి సత్యకుమార్ కౌంటర్ ఇచ్చారు. ‘ధరణి పేరుతో తెలంగాణలో మీరు నడిపిన భూమాఫియా లాగానే ధర్మవరంలో గుడ్ మార్నింగ్ పేరుతో కేతిరెడ్డి ప్రభుత్వ, అసైన్డ్, ప్రైవేటు ఆస్తులను ఆక్రమించాడు. అవినీతిపై ప్రశ్నిస్తే మీరు నన్ను Xలో బ్లాక్ చేశారు. ఓడిపోయిన మీరు ఒకరికొకరు ‘సర్టిఫికెట్’లు ఇచ్చుకుంటూ ఓదార్చుకోండి’ అని ట్వీట్ చేశారు.

News July 10, 2024

OTTలోకి కల్కి.. ఎప్పుడంటే?

image

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘కల్కి’ సినిమా రూ.1,000 కోట్ల కలెక్షన్ల దిశగా దూసుకుపోతోంది. ఈ భారీ బడ్జెట్ మూవీని ఓటీటీలో చూసేందుకు ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. దక్షిణాది భాషల OTT హక్కులను అమెజాన్ ప్రైమ్, హిందీ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ పొందింది. ఈక్రమంలో రిలీజ్ తేదీపై ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. రిలీజైన 7-8 వారాల తర్వాత OTTలోకి వచ్చేలా ఆగస్టు 15న కల్కిని స్ట్రీమింగ్ చేయనున్నట్లు సమాచారం.

News July 10, 2024

₹5కోట్లు వద్దు.. ₹2.5కోట్లు చాలన్న ద్రవిడ్!

image

భారత క్రికెట్ జట్టు మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ మరోసారి జెంటిల్‌మ్యాన్ అని నిరూపించుకున్నారు. భారత్ T20WC గెలిచిన సందర్భంగా ఆటగాళ్లతో సమానంగా కోచ్ ద్రవిడ్‌కు BCCI ₹5కోట్లు ప్రకటించింది. అయితే తన ₹5కోట్ల రివార్డును తగ్గించి మిగతా కోచ్‌లతో సమానంగా ₹2.5కోట్లు ఇస్తే చాలని ఆయన చెప్పారట. అందుకు BCCI అంగీకరించిందట. 2018లోనూ U19WC గెలిచినప్పుడు ఇలాగే చేశారు. ₹50లక్షలకు బదులు ₹25లక్షలు తీసుకున్నారు.

News July 10, 2024

రైతుల కోసం ‘కవచ్’.. ప్రభుత్వాలు సహకరిస్తే!

image

పురుగు మందుల పిచికారీ సమయంలో రైతులకు రక్షణ కల్పించేందుకు బెంగళూరుకు చెందిన ‘ఇన్‌స్టెమ్’ ఆధ్వర్యంలో తెలుగు సైంటిస్టులు ‘కిసాన్ కవచ్’ రూపొందించారు. ఈ కిట్‌లో ప్యాంట్, షర్టుతో పాటు తల, ముఖాన్ని కప్పి ఉంచేలా మాస్క్ ఉంటుంది. దీనికి ఉపయోగించే వస్త్రంలో పురుగుమందులను నిర్వీర్యం చేసే ఆక్సెమ్ అనే రసాయనం ఉంటుంది. దీని ధర రూ.3000 ఉంటుందని, ప్రభుత్వాలు ముందుకొస్తే రాయితీతో సరఫరా చేయవచ్చని చెబుతున్నారు.

News July 10, 2024

మోదీ పర్యటన విజయవంతం: రష్యా మంత్రి

image

ప్రధాని మోదీ రష్యా పర్యటన విజయవంతమైనట్లు ఆ దేశ విదేశాంగ మంత్రి సర్జే లావ్రోవ్ తెలిపారు. ఇరు దేశాధినేతలు ద్వైపాక్షిక ఎజెండాలోని అంశాలన్నీ చర్చించినట్లు పేర్కొన్నారు. ఈ పర్యటనతో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడతాయని కచ్చితంగా భావిస్తున్నట్లు చెప్పారు. మరోవైపు యూఎన్ భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యదేశంగా ఉండేందుకు రష్యా మద్దతు ఉంటుందని మీడియాకు వెల్లడించారు.

News July 10, 2024

జగన్ రాజీనామా వార్తల్లో నిజం లేదు: YCP నేత

image

AP: మాజీ CM, YCP అధినేత YS జగన్ తన MLA పదవికి రాజీనామా చేస్తారని వస్తున్న వార్తలు అవాస్తవమని ఆ పార్టీ సీనియర్ నేత సురేశ్‌బాబు స్పష్టం చేశారు. జగన్ కడప MPగా పోటీ చేస్తారనేది శుద్ధ అబద్ధమన్నారు. సోషల్ మీడియాలో TDP దుష్ప్రచారం చేయడం, దానిపై CM రేవంత్ స్పందించడం మ్యాచ్ ఫిక్సింగ్‌లో భాగమన్నారు. YS కుటుంబంలో చిచ్చుపెట్టేలా రేవంత్ వ్యాఖ్యలున్నాయని, ఆయన APలో గల్లీగల్లీ తిరుగుతాననడం హాస్యాస్పదమన్నారు.

News July 10, 2024

పంద్రాగస్టు నుంచి అన్న క్యాంటీన్లు?

image

AP: వచ్చే నెల 15 నుంచి అన్న క్యాంటీన్లను ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీ వర్గాల సమాచారం ప్రకారం తొలి దశలో 183 క్యాంటీన్లు తెరవాలని అధికారులు యోచిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో మూతపడిన వీటన్నింటికి రూ.20 కోట్లతో మరమ్మతులు చేయిస్తున్నారు. ఆహారం సరఫరా చేసే సంస్థ కోసం ఇప్పటికే టెండర్లు పిలిచారు. దాఖలుకు ఈ నెల 22వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు.

News July 10, 2024

KCR అంటే నాకు ప్రేమే: మంత్రి పొంగులేటి

image

TG: BRS అధినేత KCR అంటే తనకు ప్రేమేనని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఆయన ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి వచ్చి తన అనుభవంతో ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. గత ప్రభుత్వ పథకాలపై తాము భేషజాలకు పోవడం లేదన్న మంత్రి అందులో మంచివి తీసుకొని, సరిగ్గా లేనివి చక్కదిద్దుతున్నామని మీడియాతో ఇష్టాగోష్ఠిలో స్పష్టం చేశారు. పొంగులేటి గతంలో BRSలో పని చేసిన విషయం తెలిసిందే.