news

News July 9, 2024

గౌతమ్ గంభీర్ ‘ది వరల్డ్‌కప్ హీరో’

image

గౌతమ్ గంభీర్ 2003 నుంచి 2016 వరకు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. అన్ని ఫార్మాట్లలో కలిపి 242 మ్యాచుల్లో మొత్తం 10,324 రన్స్ చేశారు. 2007 టీ20 WC, 2011 ODI WC గెలవడంతో కీలక పాత్ర పోషించారు. ఐపీఎల్‌లో కేకేఆర్‌కు కెప్టెన్‌గా 2 టైటిళ్లు, మెంటార్‌గా ఒక టైటిల్ అందించారు. 17వ లోక్‌సభలో ఎంపీగా పనిచేశారు. 2019లో పద్మశ్రీ అందుకున్నారు. ఇప్పుడు టీమ్‌ఇండియా హెడ్ <<13597391>>కోచ్‌గా<<>> నియమితులయ్యారు.

News July 9, 2024

బాబు హయాంలోనే విద్యుత్ రంగం కుప్పకూలింది: కాకాణి

image

AP: CM చంద్రబాబు హయాంలోనే రాష్ట్రంలో విద్యుత్ రంగం కుప్పకూలిందని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. బాబు విడుదల చేసిన శ్వేతపత్రం మొత్తం అసత్యాలేనని మండిపడ్డారు. ‘శ్వేతపత్రం పేరుతో జగన్‌ను విమర్శించేందుకు CM ప్రయత్నించారు. బాబు చేయనిది కూడా చేసినట్లు చూపుతున్నారు. ఆయన గత పాలనలోనే విద్యుత్ రంగం రూ.86,215 కోట్ల అప్పుల పాలైంది. జగన్ పాలనలో విద్యుత్ రంగం అభివృద్ధి చెందింది’ అని చెప్పారు.

News July 9, 2024

ప్రతి భారతీయుడు గర్వపడేలా చేస్తా: గంభీర్

image

టీమ్ ఇండియా హెడ్ కోచ్‌గా ఎంపిక కావడంపై గౌతమ్ గంభీర్ Xలో స్పందించారు. ‘భారతదేశం నా గుర్తింపు. నా దేశానికి సేవ చేసే అవకాశం దక్కడం జీవితంలో గొప్ప అదృష్టం. తిరిగి జట్టులోకి రావడం గౌరవంగా భావిస్తున్నా. ప్రతి భారతీయుడు గర్వపడేలా చేయడమే నా లక్ష్యం. బ్లూ జెర్సీ ధరించే వారు 140కోట్ల మంది కలలు సాకారం చేస్తారు. ఇందుకోసం నావంతుగా శాయశక్తులా కృషి చేస్తా’ అని ట్వీట్ చేశారు.

News July 9, 2024

చంద్రోదయం.. అద్భుతమైన ఫొటో

image

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి తీసిన అరుదైన చంద్రోదయం ఫొటోను నాసా సోషల్ మీడియాలో షేర్ చేసింది. నీలి సముద్రంపైన చంద్ర వంక ఆకారంలో ఉన్నట్లుగా మూన్ చిత్రం ఆకట్టుకుంటోంది. దీన్ని భూమి నుంచి చూడలేమని నాసా తెలిపింది. సూర్యోదయం కోసం రాత్రి వేళ మేఘాల నుంచి తొంగిచూస్తున్న చంద్రుడిలా ఈ దృశ్యం ఉందని ఓ వ్యోమగామి పేర్కొన్నారు. ఈ చిత్రం అద్భుతమని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

News July 9, 2024

ఆ వ్యంగ్య ట్వీటే బీఆర్ఎస్ కొంప ముంచింది: సోమిరెడ్డి

image

తెలంగాణలో BRS పాలనలో KCR ఫామ్ హౌస్‌కు, KTR కలెక్షన్ హౌస్‌కు పరిమితమయ్యారని TDP MLA సోమిరెడ్డి చంద్రమోహన్ విమర్శించారు. ‘ప్రజలు కింద పడేసి తొక్కేసినా, కవిత జైలులో మగ్గుతున్నా KTRలో అహంకారం తగ్గలేదు. ఆ పొగరుతోనే నియంత జగన్ చేతిలో AP నలిగిపోవాలని ఆశించారు. అందుకే మీకు ప్రజలు గుణపాఠం చెప్పారు. CBNను జైలుకు పంపినప్పుడు వ్యంగ్యంగా పెట్టిన <>ట్వీటే<<>> మీ కొంప ముంచింది’ అని ఫైరయ్యారు.

News July 9, 2024

ద్రవిడ్‌కు థ్యాంక్స్ చెబుతూ రోహిత్ పోస్ట్

image

టీమ్ఇండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తూ కెప్టెన్ రోహిత్ శర్మ ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ‘ప్రియమైన రాహుల్ భాయ్. కోట్లాది మంది అభిమానుల వలే నేనూ మిమ్మల్ని చూస్తూ పెరిగా. కానీ మీతో కలిసి పనిచేసే అదృష్టం నాకు దక్కింది. విజయాలన్నింటినీ డోర్ వద్ద వదిలి మాకు కోచ్‌గా వచ్చారు. మీ నుంచి చాలా నేర్చుకున్నా. మీతో కలిసి వరల్డ్ కప్ సాధించినందుకు సంతోషిస్తున్నా’ అని తెలిపారు.

News July 9, 2024

టీమ్ ఇండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్

image

భారత జట్టు హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్‌ను నియమిస్తున్నట్లు BCCI సెక్రటరీ జై షా ప్రకటించారు. ‘ఆయనకు స్వాగతం పలకడం చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుతం వేగంగా మారుతున్న మోడ్రన్ క్రికెట్‌ను గంభీర్ దగ్గరగా చూశారు. తన కెరీర్‌లో ఎన్నో విభాగాల్లో రాణించి భారత క్రికెట్‌ను ముందుకు తీసుకెళ్లేలా ఎంతో కృషి చేశారు. ఆయనపై నాకు నమ్మకం ఉంది. గంభీర్ కొత్త ప్రయాణానికి BCCI నుంచి పూర్తి మద్దతు ఉంటుంది’ అని షా వెల్లడించారు.

News July 9, 2024

కోహ్లీ స్థానాన్ని భర్తీ చేయడం కష్టం: రుతురాజ్

image

భారత జట్టులో కోహ్లీ స్థానాన్ని భర్తీ చేయడం కష్టం అని రుతురాజ్ గైక్వాడ్ అన్నారు. మూడో స్థానంలో బ్యాటింగ్ చేయడంపై మీడియాతో మాట్లాడుతూ ‘CSK కెప్టెన్‌గా ధోనీ స్థానంలో ఉండటం ఎంత కష్టమో.. ఇదీ అంతే. నన్ను కోహ్లీతో పోల్చడం సరైనది కాదు. నా దృష్టంతా ఆటపైనే ఉంది. టీమ్ అవసరానికి తగ్గట్లు ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేస్తా’ అని తెలిపారు. ప్రస్తుతం ZIMతో T20 సిరీస్‌లో అతను మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తున్నారు.

News July 9, 2024

రేవంత్ సంచలన వ్యాఖ్యలు

image

TG: పరీక్షలు వాయిదా వేయాలనే డిమాండ్ వెనుక కోచింగ్ సెంటర్ల కుట్ర కూడా ఉందని CM రేవంత్ సంచలన ఆరోపణలు చేశారు. కొన్ని కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు పరీక్షలు వాయిదా వేయాలని తనను అడిగారని వెల్లడించారు. ‘వ్యాపారం కోసమే వాళ్లు వాయిదా వేయాలని కోరుతున్నారు. BRS వాళ్లు తమ రాజకీయ మనుగడ కోసం పేద, బడుగు బలహీన వర్గాల వారిని రెచ్చగొట్టి ఆందోళనలు చేయిస్తున్నారు’ అని మహబూబ్‌నగర్ బహిరంగ సభలో రేవంత్ వ్యాఖ్యానించారు.

News July 9, 2024

‘NBK109’ షూటింగ్‌లో ప్రమాదం.. హీరోయిన్‌కు తీవ్ర గాయం

image

బాబీ కొల్లి డైరెక్షన్‌లో బాలకృష్ణ నటిస్తోన్న NBK109 మూవీ షూటింగులో ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్‌లో ఓ సన్నివేశం చిత్రీకరిస్తుండగా బాలీవుడ్ నటి ఊర్వశీ రౌతేలా కాలు ఫ్రాక్చర్ అయినట్లు ఆమె టీమ్ తెలిపింది. గాయం తీవ్రత ఎక్కువగా ఉందని, ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారని వెల్లడించింది. ప్రమాదంపై చిత్ర యూనిట్ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటనా చేయలేదు.