India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
టీమ్‌ఇండియా క్రికెటర్ మహమ్మద్ సిరాజ్‌కు ప్రభుత్వ ఉద్యోగం, హైదరాబాద్ పరిసరాల్లో ఇంటి స్థలం ఇవ్వాలని సీఎం రేవంత్ నిర్ణయించారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇవాళ ఆయనను సిరాజ్ మర్యాదపూర్వకంగా కలిసి భారత క్రికెట్ జట్టు జెర్సీని బహూకరించారు. భవిష్యత్తులో సిరాజ్ మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, భారత క్రికెట్ జట్టుకు మంచి పేరు తేవాలని ఆకాంక్షిస్తున్నట్లు రేవంత్ ట్వీట్ చేశారు.
TG: ఎన్నికల్లో మహిళలకు అనేక హామీలిచ్చిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు వాటిని విస్మరించారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ‘మహిళలకు ప్రతి నెలా రూ.2,500, కళ్యాణ లక్ష్మి కింద రూ.లక్ష నగదుతోపాటు తులం బంగారం ఇవ్వలేదు. విద్యార్థినులకు స్కూటీలు పంపిణీ చేయలేదు. రేవంత్ సర్కార్ ఒక్కో మహిళకు ప్రస్తుతం రూ.20వేలు బాకీ ఉంది. వారి తరఫున మేం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం’ అని స్పష్టం చేశారు.
చైనాపై ఆధారపడాల్సిన అవసరం లేదని, తామూ ఉన్నామని రష్యాకు భరోసా ఇచ్చేందుకే మోదీ ఈ పర్యటన చేపడుతున్నట్లు రష్యన్ నిపుణులు పేర్కొన్నారు. 2020లో గల్వాన్ ఘటనతో చైనాతో సంబంధాలు క్షీణించాక రష్యాతో బంధం భారత్‌కు కీలకంగా మారిందని చెబుతున్నారు. ఒకవేళ చైనాతో రష్యా బంధం బలపడితే డ్రాగన్‌ను నియంత్రించడం కష్టమని మరికొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చైనా రష్యాకు దగ్గరకాకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందన్నారు.
పాశ్చాత్య దేశాల నుంచి ఆంక్షలను ఎదుర్కొంటున్న వేళ మోదీ రష్యా పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. మోదీ పర్యటనకు ప్రధాన కారణం చైనానే అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికా ఉమ్మడి శత్రువు కావడంతో ఇటీవల కాలంలో రష్యా చైనాకు దగ్గరవుతోంది. దీని వల్ల డ్రాగన్ బలోపేతం అయ్యే ప్రమాదం ఉండటంతో భారత్ రష్యాతో బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని డిసైడ్ అయింది. ఇందులో భాగంగానే మోదీ రష్యా పర్యటన చేపట్టారు.
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు ట్రేడింగ్‌ను లాభాలతో ముగించాయి. ఓ దశలో 80,397 చేరి ఆల్ టైమ్ హై నమోదు చేసిన సెన్సెక్స్ 391 పాయింట్ల లాభంతో 80,351 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 24,443కు చేరి సరికొత్త రికార్డుతో ట్రేడింగ్ ముగించింది. సూచీలు ఈ స్థాయిలో క్లోజ్ అవడం ఇదే తొలిసారి. ఆటో, FMCG, ఫార్మా రంగాల షేర్లు రాణించడం మార్కెట్లకు కలిసొచ్చింది. మారుతీ, ITC, M&M, హీరో మోటార్ కార్ప్ టాప్ గెయినర్లుగా నిలిచాయి.
AP: వైసీపీ ప్రభుత్వం 56 బీసీ కార్పొరేషన్లకు నిధులు కేటాయించలేదని, ఛైర్మన్లు కుర్చీలకే పరిమితమయ్యారని మంత్రి సవిత విమర్శించారు. బీసీల ద్రోహి జగన్ అని మండిపడ్డారు. తాము త్వరలోనే అన్ని బీసీ కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని, నిధులు కేటాయిస్తామని తెలిపారు. బీసీలకు పూర్వ వైభవం తీసుకొస్తామని, వారిని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.
ఏఐకి సంబంధించిన పేటెంట్ల నమోదులో భారత్ 2014-2023 మధ్య 55.8% వృద్ధిని నమోదు చేసింది. చైనా, జపాన్, అమెరికా వంటి దేశాల కంటే ఇది ఎక్కువ. అయితే సంఖ్య పరంగా మనం ఇంకా పుంజుకోవాల్సి ఉంది. 38,210 పేటెంట్లతో చైనా అగ్రస్థానంలో నిలవగా ఆ తర్వాతి స్థానాల్లో US (6276), ద.కొరియా (4,155), జపాన్ (3,409) ఉన్నాయి. భారత్ 1,350 పేటెంట్లతో ఐదో స్థానంలో ఉన్నట్లు వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ వెల్లడించింది.
TG: కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని CM రేవంత్ అధికారులను ఆదేశించారు. మహబూబ్‌నగర్ కలెక్టరేట్‌లో అధికారులు, ప్రజాప్రతినిధులతో ఈ ప్రాజెక్టుపై ఆయన సమీక్షించారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి యాక్షన్ ప్లాన్ రూపొందించాలని సూచించారు. గ్రీన్ ఛానెల్ ద్వారా నిధుల విడుదలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ప్రతినెలా ప్రాజెక్టు పనుల పురోగతిపై ప్రతినెలా సమీక్షించాలని సూచించారు.
నిత్యం ప్రజల్లో ఉండే కొందరు RTC ఉద్యోగులు పని ఒత్తిడిలోనూ ఆడుతూ పాడుతూ పనిచేస్తుంటారు. అలాంటి ఓ మహిళా కండక్టర్‌ను అభినందిస్తూ ఓ నెటిజన్ చేసిన పోస్టును TGSRTC ఎండీ సజ్జనార్ షేర్ చేశారు. కండక్టర్ అనుపమ పనితనాన్ని తెలియజేశారని, ప్రయాణికులను తమ కుటుంబంలా RTC సిబ్బంది భావిస్తారని చెప్పడానికి ఈ పోస్టే నిదర్శనమని పేర్కొన్నారు. ఏ వృత్తిలోనైనా రొటీన్‌కి భిన్నంగా పనిచేస్తే ఎంత ఒత్తిడినైనా జయించవచ్చన్నారు.
TG: డీఎస్సీ అభ్యర్థుల ఆక్రందన కాంగ్రెస్ సర్కారుకు వినపడలేదా అని CM రేవంత్‌ను KTR ప్రశ్నించారు. ‘తొలి కేబినెట్ భేటీలోనే 25 వేల పోస్టులతో మెగా DSC అని మీరిచ్చిన మాట ఏమైంది? మీరు కొలువుదీరితే సరిపోతుందా.. యువతకు కొలువులు అక్కర్లేదా? DSC పరీక్షలు వాయిదా వేయాలని కోరుతున్నా ఎందుకీ మొండి వైఖరి? ఈ గుడ్డి ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేందుకు నిరుద్యోగులతో కలిసి మరో ఉద్యమం చేస్తాం’ అని ట్వీట్ చేశారు.
Sorry, no posts matched your criteria.