India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అటల్ పెన్షన్ స్కీమ్ లబ్ధిదారులకు మినిమమ్ గ్యారంటీడ్ అమౌంట్‌ను డబుల్ చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. పొదుపు చేసే మొత్తం ఆధారంగా ప్రస్తుతం కేంద్రం ₹1000-₹5వేల వరకు పెన్షన్ ఇస్తోంది. కొత్త ప్రతిపాదన ఓకే అయితే ఇది డబుల్ కానుంది. పేద, దిగువ మధ్య తరగతి వారి కోసం కేంద్రం 2015లో ఈ స్కీమ్ తీసుకొచ్చింది. 60ఏళ్లు దాటిన వారికి ఈ పెన్షన్ వస్తుంది. కాగా ఆదాయ పన్ను చెల్లింపుదారులు ఇందుకు అనర్హులు.
AP: కడప ఎంపీ స్థానానికి ఉప ఎన్నిక రావొచ్చని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన <<13591234>>వ్యాఖ్యలను<<>> YSR జిల్లా వైసీపీ అధ్యక్షుడు సురేశ్ బాబు ఖండించారు. తప్పుడు కథనాలను పట్టుకుని ఆయన స్పందించడం సిగ్గు చేటన్నారు. బై ఎలక్షన్ వస్తే షర్మిలను గెలిపిస్తానన్న రేవంత్ వ్యాఖ్యలపైనా స్పందిస్తూ.. 2011 కడప పార్లమెంట్ ఉప ఎన్నికల్లో ‘కడప దెబ్బ ఢిల్లీ అబ్బా’ అనేలా తీర్పు ఇచ్చారని గుర్తు చేశారు.
జూన్ నెలకు గాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును భారత బౌలర్ జస్ప్రీత్ బుమ్రా గెలుచుకున్నారు. టీ20 WCలో ఆయన 15 వికెట్లు పడగొట్టడంతో పాటు పొదుపుగా బౌలింగ్ చేసి టీమ్ ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇక మహిళల విభాగంలో ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా(జూన్) స్మృతి మంధాన ఎంపికయ్యారు. ఇటీవల సౌతాఫ్రికాతో జరిగిన 3 వన్డేల్లో ఆమె 113, 136, 90 రన్స్ చేసిన సంగతి తెలిసిందే.
AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓఎస్డీగా వెంకటకృష్ణను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన జీఏడీలో అడిషనల్ సెక్రటరీగా సేవలందిస్తున్నారు. త్వరలోనే ఆయన ఓఎస్డీగా బాధ్యతలు చేపట్టనున్నారు.
1.సిక్కిం- $8691
2.గోవా- $8370
3.ఢిల్లీ- $6690
4.తెలంగాణ- $4745
5.కర్ణాటక- $4637
6.హరియాణా- $4581
7. తమిళనాడు- $4323 8.గుజరాత్- $4306
9.కేరళ- $4176 10.హిమాచల్ ప్రదేశ్- $3777
రెండు రోజుల రష్యా పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఈరోజు మాస్కోలోని భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు. సవాళ్లకే సవాల్ చేసే సత్తా భారతీయులకు ఉందని, అది మన DNAలోనే ఇమిడి ఉందని చెప్పుకొచ్చారు. దేశంలో పేదలకు 3కోట్ల ఇళ్లు నిర్మించి ఇవ్వడమే తమ లక్ష్యమన్నారు. డిజిటల్ చెల్లింపుల్లోనూ భారత్‌కు తిరుగులేదన్నారు. 140కోట్ల మంది ప్రజలు దేశాభివృద్ధికి కృషి చేస్తున్నారని మోదీ కొనియాడారు.
ఏపీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడం తనకు ఆశ్చర్యం కలిగించిందని కేటీఆర్ అన్నారు. ఓడినా 40% ఓట్లు సాధించడం మామూలు విషయం కాదన్నారు. ‘పవన్ కళ్యాణ్ విడిగా పోటీ చేస్తే ఫలితాలు మరోలా ఉండేవి. జగన్‌ను ఓడించేందుకు షర్మిలను పావులా ఉపయోగించుకున్నారు. అంతకుమించి ఆమె పాత్ర ఏమీ లేదు. ప్రతి రోజూ జనంలోకి వెళ్లే కేతిరెడ్డి ఓడిపోవడం కూడా ఆశ్చర్యమే’ అని ఢిల్లీలో మీడియా చిట్ చాట్‌లో వ్యాఖ్యానించారు.
AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ ఈ నెల 16న సచివాలయంలో సమావేశం కానుంది. మరో 4 నెలలకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్‌ను ఆమోదించే అవకాశం ఉంది. పథకాలు, ఎన్నికల హామీల అమలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, నిధుల సమీకరణ తదితర అంశాలపైనా చర్చ జరుగుతుందని అధికార వర్గాలు వెల్లడించాయి. కాగా ఈ నెల 22 నుంచి <<13590883>>అసెంబ్లీ<<>> సమావేశాల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సమాచారం.
టీమ్ఇండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ యాజమాన్యం సంప్రదించినట్లు వార్తలొస్తున్నాయి. మెంటార్ రోల్ కోసం ఆయనను కాంటాక్ట్ అయినట్లు సమాచారం. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. కాగా గత సీజన్లో KKR మెంటార్‌గా ఉన్న గంభీర్ ఇప్పుడు భారత జట్టు హెడ్ కోచ్‌గా నియామకం అయ్యే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో ఆ జట్టు ద్రవిడ్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది.
AP: డ్వాక్రా సంఘాలను బలోపేతం చేసే ప్రక్రియలో బ్యాంకర్లదే కీలక పాత్ర అని సీఎం చంద్రబాబు తెలిపారు. సబ్సిడీ రుణాలు, డీబీటీ, ఇతర పథకాల అమలు, అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఇవాళ సచివాలయంలో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయ, పారిశ్రామిక రంగాలకు బ్యాంకర్లు ప్రోత్సాహం అందించాలని సూచించారు. రంగాల వారీగా ప్రభుత్వ ప్రాధాన్యతలను సీఎం వారికి వివరించారు.
Sorry, no posts matched your criteria.