India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తండ్రీకూతుళ్ల అనుబంధంపై కొందరు యూట్యూబర్లు చేసిన అసభ్య కామెంట్స్‌పై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న వేళ తెలంగాణ పోలీసులు పలు సూచనలు చేశారు. ‘మీ పిల్లలు, కుటుంబసభ్యుల ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయటం ఎన్నో అనర్థాలకు దారి తీస్తుంది. ఫొటోలకు ప్రైవసీ ఏర్పాటు చేసుకోవాలి. కొన్నిసార్లు మీ సన్నిహితులే వాటిని దుర్వినియోగం చేసే ప్రమాదం ఉంది. అప్రమత్తత మన బాధ్యత’ అని Xలో పోస్ట్ చేశారు.
బెంగళూరులో విరాట్ కోహ్లీకి చెందిన వన్8 కమ్యూన్ పబ్ మేనేజర్‌పై FIR నమోదైంది. అర్ధరాత్రి 1amలోపు పబ్ మూసి వేయాల్సి ఉండగా 1.20గంటల వరకు తెరిచి ఉంచారు. దీంతో నగరంలోని కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇదే కారణంతో మరో 3 పబ్బులపైనా కేసు నమోదైనట్లు తెలుస్తోంది. వన్8 కమ్యూన్ చిన్నస్వామి స్టేడియానికి సమీపంలో ఉంటుంది.
ప్రముఖ గాయని ఉషా ఉతుప్ భర్త జాని చాకో ఉతుప్ (78) హఠాన్మరణం చెందారు. నిన్న కోల్‌కతాలోని ఆయన నివాసంలో టీవీ చూస్తూ గుండెపోటుతో కుప్పకూలడంతో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఉషా ఉతుప్ దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆమె 15 భారతీయ భాషలతో పాటు విదేశీ భాషల్లోనూ పాటలు పాడారు. ఇటీవల పద్మభూషణ్ పురస్కారం కూడా లభించింది.
AP: ఉచిత ఇసుక విధానం ముసుగులో టీడీపీ కొత్త దందాకు తెరలేపిందని వైసీపీ విమర్శించింది. ‘ఎవరెవరివో ఆధార్ కార్డు, ఫోన్ నంబర్లు, చిరునామాలు చూపిస్తూ ఇసుక లోడ్ చేయాలని బెదిరిస్తున్నారు. స్టాక్ యార్డుల వద్ద వందల సంఖ్యలో లారీలు, ట్రాక్టర్లు క్యూ కడుతున్నాయి. రాష్ట్రంలో ఇసుక కొరత సృష్టించి అవసరమైన వారికి అధిక ధరలకు అమ్ముకునే ఎత్తుగడ వేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం చోద్యం చూస్తోంది’ అని ట్వీట్ చేసింది.
క్రూయిజర్ బైక్స్‌కు కేరాఫ్‌గా నిలిచిన రాయల్ ఎన్‌ఫీల్డ్ మరో మోడల్ లాంచ్ చేయనుంది. గెరిల్లా 450ని ఈనెల 17న మార్కెట్‌లోకి ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. హిమాలయన్ 450ని పోలిన ఈ బైక్ ధర ₹2.4లక్షల- ₹2.60లక్షల మధ్య ఉంటుందని అంచనా. 450 CC, 6 గేర్లు, 40bhp, డ్యుయల్ ఛానల్ ABSతో దీనిని డిజైన్ చేశారు. ఇదే ప్రైస్ రేంజ్‌లో (₹2.5L-2.7L) బనెలీ నుంచి ఈనెల 18న 402S కూడా లాంచ్ కానున్నట్లు సమాచారం.
AP: కూటమి ప్రభుత్వ విధానాలతో ఇసుక ధరలు YCP ప్రభుత్వంలో కంటే భారీగా తగ్గాయని TDP ట్వీట్ చేసింది. కేవలం రవాణా, లోడింగ్ ఛార్జీలు చెల్లిస్తే చాలని పేర్కొంది. తిరుపతిలో అన్ని ఛార్జీలు కలుపుకుని టన్నుకు రూ.590 చొప్పున 20 టన్నులకు ₹11,800 వసూలు చేసినట్లు రసీదును షేర్ చేసింది. దుర్మార్గపు జగన్ ప్రభుత్వం 20 టన్నులకు ₹50వేలు వసూలు చేసిందని దుయ్యబట్టింది. తమ నిర్ణయంపై అంతటా హర్షం వ్యక్తమవుతుందని తెలిపింది.
కాజల్‌కు ‘ఆచార్య’లో ఎదురైన అనుభవమే ‘భారతీయుడు2’లోనూ ఎదురయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చిరంజీవి హీరోగా వచ్చిన ‘ఆచార్య’లో కాజల్ నటించినా ఆమె పాత్రను తొలగించారు. ఇప్పుడు ‘భారతీయుడు2’లోనూ కాజల్ నటించారు. అయితే ఆమె పాత్రను మూడో భాగానికి మార్చినట్లు తెలుస్తోంది. అందుకే ఆమె ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొనట్లేదని వార్తలొస్తున్నాయి. మరి 3వ పార్టులోనైనా ఆమె సన్నివేశాలుంటాయా? లేదా? అనేది వేచి చూడాలి.
‘విద్యుత్ షాక్‌తో రైతు మృతి’ అనే వార్తలను మనం తరచూ చదువుతూనే ఉన్నాం. అయితే ఆ రైతుల ప్రాణాలను రక్షించడంలో మాత్రం అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. పై ఫొటో చూడండి.. కడప జిల్లా ఖాజీపేట మండలం నాగసాని పల్లెలో రైతు అబ్బయ్య కుటుంబం ప్రాణాలకు తెగించి విద్యుత్ తీగలతో యుద్ధం చేస్తోంది. ఏ మాత్రం పట్టుతప్పినా చావే దిక్కు. ఏళ్లుగా అధికారులను వేడుకుంటున్నా ఫలితం లేదట. ఈ ఫొటోపై మీ అభిప్రాయం కామెంట్ చేయండి.
నిన్న ఫ్లాట్‌గా ట్రేడింగ్ ముగించిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు సెషన్‌ను లాభాల్లో కొనసాగిస్తున్నాయి. సెన్సెక్స్ 80,108 (+151) వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 44 పాయింట్లు వృద్ధి చెంది 24,365 వద్ద కొనసాగుతోంది. ఆటో, ఫార్మా రంగాల షేర్లు లాభాలను నమోదు చేయడం మార్కెట్లకు కలిసొచ్చింది. మరోవైపు ఐటీ స్టాక్స్ నష్టాల్లో కొనసాగుతున్నాయి. మారుతి, సిప్లా, ఐటీసీ, టైటాన్ షేర్లు నిఫ్టీ టాప్ గెయినర్లుగా ఉన్నాయి.
హిట్ అండ్ రన్ కేసులో శివసేన లీడర్ రాజేశ్ షాకు బెయిల్ మంజూరైంది. అతడి కుమారుడు మిహిర్ షా ముంబైలో BMW కారుతో ఓ మహిళను ఢీకొట్టగా ఆమె మరణించారు. కారు రాజేశ్ షా పేరిట ఉండటంతో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా రూ.15వేల పూచీకత్తుపై ఆయనకు లోకల్ కోర్టు బెయిల్ ఇచ్చింది. మరోవైపు నిందితుడు మిహిర్ షా ప్రస్తుతం పరారీలో ఉన్నారు. అటు నిందితులు సంపన్నులని, వారికి శిక్షపడేది అనుమానమేనని బాధితులు అంటున్నారు.
Sorry, no posts matched your criteria.