news

News July 8, 2024

శాంసంగ్ చరిత్రలోనే బిగ్గెస్ట్ స్ట్రైక్

image

సౌత్ కొరియాలోని శాంసంగ్ ఉద్యోగులు జీతాలు పెంచాలని ఆ కంపెనీ చరిత్రలోనే అతి పెద్ద స్ట్రైక్‌కు తెరతీశారు. యాజమాన్యంతో చర్చలు విఫలమవడంతో దాదాపు 6,500 మంది ఉద్యోగులు విధులు బహిష్కరించి 3 రోజుల సమ్మెకు దిగారు. కంపెనీకి వచ్చే అదనపు లాభాల్లో నుంచి తమకు రావాల్సిన బోనస్‌, ఏడాదికి ఒకరోజు అదనపు సెలవు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే స్ట్రైక్‌పై శాంసంగ్ యాజమాన్యం ఇప్పటి వరకు స్పందించలేదని తెలుస్తోంది.

News July 8, 2024

టాలీవుడ్ వల్లే స్టార్‌నయ్యా: కమల్

image

తెలుగు సినీ ఇండస్ట్రీనే తనను స్టార్‌ని చేసిందని కమల్ హాసన్ అన్నారు. మరో చరిత్ర, సాగరసంగమం, స్వాతిముత్యం వంటి అద్భుత విజయాలు ఇక్కడే దక్కాయని గుర్తు చేసుకున్నారు. 1996లో ‘భారతీయుడు’కు వసూళ్లు వస్తాయా? అనే సందేహాలు వ్యక్తమయ్యాయని, అయితే ఊహించని రీతిలో రెస్పాన్స్ వచ్చిందన్నారు. శంకర్ డైరెక్షన్‌లో ఆయన నటించిన ‘భారతీయుడు2’ ఈ నెల 12న రిలీజ్ కానుండగా HYDలో జరిగిన ప్రిరిలీజ్ ఈవెంట్లో ఆయన మాట్లాడారు.

News July 8, 2024

50 రోజుల సెలవుల తర్వాత తెరుచుకున్న సుప్రీంకోర్టు

image

నెలన్నర వేసవి సెలవుల తర్వాత సుప్రీంకోర్టు ఆరంభమైంది. సెలవుల కారణంగా మే 20న కోర్టు మూతపడగా నేడు తెరుచుకుంది. దీంతో లాయర్లు న్యాయస్థానం లోపలికి వెళ్లేందుకు క్యూ కట్టారు. కేజ్రీవాల్ అరెస్టు చట్టబద్ధత, పౌరసత్వ చట్టంలోని సెక్షన్ 6A, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీకి మైనారిటీ హోదా, పతంజలి లాంటి ముఖ్యమైన కేసులపై సర్వోన్నత న్యాయస్థానంలో విచారణ జరగాల్సి ఉంది.

News July 8, 2024

సీఎంతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ భేటీ

image

TG: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని సీఎం ఇంటికి వెళ్లి కలిశారు. దీంతో ఆయన పార్టీ మారనున్నారనే <<13585753>>ప్రచారానికి<<>> బలం చేకూరినట్లైంది. రేవంత్ మహబూబ్‌నగర్ పర్యటనలో భాగంగా చల్లా కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం.

News July 8, 2024

హైదరాబాద్‌లో చంద్రబాబు, వైఎస్సార్ ఫ్లెక్సీలు

image

చాలా రోజుల తర్వాత హైదరాబాద్ నగరంలో చంద్రబాబు, వైఎస్సార్ ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. హైదరాబాద్ వచ్చిన సందర్భంగా చంద్రబాబువి, జయంతి సందర్భంగా వైఎస్సార్ ఫ్లెక్సీలను టీడీపీ, కాంగ్రెస్ అభిమానులు ఏర్పాటు చేశారు. ఉమ్మడి ఏపీలో ఈ ఇద్దరు నాయకులు సీఎంలుగా హైదరాబాద్ నుంచే పాలన సాగించారు. కాగా, తెలంగాణలోనూ టీడీపీ జెండా ఎగరేస్తామని చంద్రబాబు నిన్న కార్యకర్తల సమావేశంలో చెప్పారు.

News July 8, 2024

T20WC: ఒక్కో క్రికెటర్‌కు ₹5కోట్లు

image

టీ20 వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టుకు BCCI ₹125కోట్లు నజరానా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మొత్తాన్ని పంచగా 15మంది ఆటగాళ్లు, కోచ్ ద్రవిడ్‌కి ఒక్కొక్కరికి ₹5కోట్లు రానున్నాయి. మిగిలిన కోచ్‌లు ₹2.5కోట్ల చొప్పున అందుకుంటారు. బ్యాక్‌రూమ్ స్టాఫ్ తలా ₹2కోట్లు, సెలెక్షన్ కమిటీలోని సభ్యులు, రిజర్వ్ ప్లేయర్లు ₹కోటి చొప్పున అందుకుంటారు. వాంఖడేలో ఇప్పటికే దీనికి సంబంధించిన చెక్కును BCCI జట్టుకు అందించింది.

News July 8, 2024

PHOTOS: పూరీ తీరంలో రాష్ట్రపతి

image

ఒడిశాలోని పూరీ సముద్ర తీరంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మార్నింగ్ వాక్ చేశారు. ‘తీరం వెంబడి నడుస్తున్నపుడు అలల సవ్వడి, చల్లని గాలి, సముద్రపు హోరు ధ్యానం చేస్తున్న అనుభూతిని కలిగించాయి. నిన్న జగన్నాథుడిని దర్శించినపుడు ఇలాంటి అనుభవమే కలిగింది’ అని Xలో పేర్కొన్నారు. ప్రకృతి వనరులు మనల్ని ఎంతగానో ఆకర్షిస్తాయని, అలాంటి ప్రకృతిని ధ్వంసం కాకుండా భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు.

News July 8, 2024

నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. 4% తగ్గిన టైటాన్ షేర్!

image

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 191 పాయింట్లు క్షీణించి 79,800 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 32 పాయింట్ల నష్టంతో 24,291 వద్ద కొనసాగుతోంది. టాటా మోటార్స్, హిందుస్థాన్ యూనిలివర్, హీరో మోటార్ కార్ప్ షేర్లు నిఫ్టీ టాప్ గెయినర్లుగా ఉన్నాయి. టైటాన్, శ్రీరామ్ ఫైనాన్స్, దివీస్ ల్యాబ్, ఏషియన్ పేయింట్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. టైటాన్ షేర్ విలువ ఏకంగా 4% క్షీణించింది.

News July 8, 2024

కోట్లాది కుటుంబాలు ఇవాళ మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నాయి: వైఎస్ జగన్

image

AP: వైఎస్సార్ 75వ జయంతి అందరికీ పండగ రోజని మాజీ సీఎం జగన్ ట్వీట్ చేశారు. ‘కోట్లాది కుటుంబాలు ఇవాళ మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నాయి. ప్రజా శ్రేయస్సు కోసం మీరు చూపిన మార్గం మాకు శిరోధార్యం. జీవితాంతం మీరు పాటించిన క్రమశిక్షణ, చేసిన కఠోర శ్రమ, రాజకీయాల్లో మీరు చూపిన ధైర్యసాహసాలు మాకు మార్గం. మీ ఆశయాల సాధనే లక్ష్యంగా, కోట్లాది కుటుంబాల క్షేమమే ధ్యేయంగా కృషి చేస్తాం’ అని పేర్కొన్నారు.

News July 8, 2024

అభిమాని హత్యకేసు.. వేలిముద్రలు వారిద్దరివే!

image

అభిమాని రేణుకాస్వామి <<13484886>>హత్య<<>> కేసులో సేకరించిన వేలి ముద్రలు దర్శన్, పవిత్రాగౌడవే అని నివేదికల్లో తేలింది. ఘటనా స్థలం, మృతదేహాన్ని తరలించిన వాహనంలో వేలి ముద్రలను బెంగళూరు, హైదరాబాద్‌లోని ఫోరెన్సిక్ కేంద్రాలకు పంపి పరీక్షించారు. ఈ కేసులో అరెస్టయిన 17 మందిపై వేర్వేరు కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మరోవైపు దర్శన్, పవిత్ర బెయిల్‌కు ప్రయత్నిస్తే అభ్యంతరం చెబుతామని సిట్ అధికారులు తెలిపారు.