news

News April 12, 2025

TIRUMALA: కొనసాగుతున్న రద్దీ

image

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 70,462మంది భక్తులు దర్శించుకున్నారు. హుండీ ద్వారా రూ.3.01 కోట్ల ఆదాయం సమకూరిందని టీటీడీ వర్గాలు తెలిపాయి.

News April 12, 2025

ప్లే ఆఫ్‌లో చోటు సాధిస్తాం: సీఎస్కే బ్యాటింగ్ కోచ్

image

ఈ సీజన్‌లో వరుస పరాజయాల నేపథ్యంలో సీఎస్కే జట్టు బ్యాటింగ్ కోచ్ మైకేల్ హస్సీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాము ప్లే ఆఫ్‌కు చేరుతామని ఆశాభావం వ్యక్తం చేశారు. నిలకడైనా ప్రదర్శన చేయకపోవడమే జట్టును ఇబ్బంది పెడుతోందని చెప్పారు. ఏదైనప్పటికీ తమ వంతు ప్రయత్నం చేస్తామని చెప్పారు. విజయాల బాట పడితే కాన్ఫిడెన్స్ పెరుగుతుందని పేర్కొన్నారు.

News April 12, 2025

IPL: ఇవాళ ఓడితే కష్టమే!

image

సీజన్ తొలి మ్యాచులో గెలిచి అభిమానుల్లో భారీ అంచనాలు పెంచేసిన SRH తర్వాత వరుసగా 4 మ్యాచులు ఓడిపోయి తుస్సుమనిపించింది. కేవలం 2 పాయింట్లతో టేబుల్‌లో చిట్టచివరన నిలిచింది. మిగిలిన 9 మ్యాచుల్లో కనీసం 7 గెలిస్తేనే ప్లేఆఫ్స్ రేసులో నిలుస్తుంది. దీంతో ఇవాళ పంజాబ్‌పై తప్పకుండా గెలవాల్సిందే. లేదంటే తర్వాతి 8 మ్యాచుల్లో 7 గెలవడం కష్టమే. దీంతో SRH ఇంటిబాట పట్టడం లాంఛనమే అవుతుంది.

News April 12, 2025

తెలంగాణ ఆర్టీసీ కీలక ప్రకటన

image

ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్ పథకాన్ని రద్దు చేసే ప్రతిపాదన లేదని తెలంగాణ ఆర్టీసీ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. ఆర్థిక సంవత్సరం ముగింపు కారణంగానే జీతాలు ఆలస్యమయ్యాయని వివరించింది. విద్యుత్ బస్సుల కారణంగా ఉద్యోగుల్ని తొలగిస్తామన్నదాంట్లో నిజం లేదని, ఎవర్నీ తొలగించబోమని హామీ ఇచ్చింది. పెండింగ్ బకాయిల్ని త్వరలోనే క్లియర్ చేస్తామని పేర్కొంది. సంస్థపై దుష్ప్రచారాలు మానుకోవాలని హితవు పలికింది.

News April 12, 2025

$10.87bn పెరిగిన ఫారెక్స్ నిల్వలు

image

ఏప్రిల్ 4తో ముగిసిన వారంలో ఫారెక్స్ నిల్వలు $10.87 బిలియన్లు పెరిగి $676.26bnకు చేరినట్లు RBI వెల్లడించింది. విదేశీ కరెన్సీ $9.07bn పెరిగి $574.08bn, గోల్డ్ నిల్వలు $1.56 మిలియన్లు పెరిగి $79.36bnగా నమోదైనట్లు తెలిపింది. ఇక IMF(ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్) వద్ద దేశ నిల్వలు $46 మిలియన్లు పెరిగి $4.459bnకు చేరినట్లు పేర్కొంది.

News April 12, 2025

TGIICకి మేం లోన్ ఇవ్వలేదు: ICICI

image

TG: కంచ గచ్చిబౌలి భూములను తనఖా పెట్టి ICICI బ్యాంకులో TGIIC రూ.10వేల కోట్ల లోన్ తీసుకుందన్న మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపణలపై సంబంధిత బ్యాంక్ స్పందించింది. తాము TGIICకి ఎలాంటి మార్టిగేజ్ లోన్ ఇవ్వలేదని ఓ ప్రకటన విడుదల చేసింది. బాండ్ నిధుల స్వీకరణ, వడ్డీ చెల్లింపులకు సంబంధించి తాము కేవలం అకౌంట్ బ్యాంక్‌గానే వ్యవహరించామని పేర్కొంది. TGIIC తమ వద్ద భూమిని తనఖా పెట్టలేదని స్పష్టం చేసింది.

News April 12, 2025

ఆ రైతులకు ఎకరానికి రూ.10 వేలు

image

TG: అకాల వర్షాలు, ఈదురుగాలులతో పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10,000 చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర బడ్జెట్ నుంచే ఈ పరిహారం కేటాయించనున్నట్లు తెలుస్తోంది. గత నెలలో 8,408 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు నివేదికలో పేర్కొనగా ఈ నెలలో కురిసిన వర్షాలతో అది మరింత పెరిగింది. రైతుల వారీగా సర్వే చేయాలని వ్యవసాయశాఖ అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు.

News April 12, 2025

పారిశ్రామిక వృద్ధి డౌన్

image

ఈ ఏడాది ఫిబ్రవరిలో దేశీయ పారిశ్రామికోత్పత్తి వృద్ధి 6 నెలల కనిష్ఠమైన 2.9 శాతానికి పరిమితమైంది. తయారీ, గనుల తవ్వకం, విద్యుదుత్పత్తి రంగాల పేలవ పనితీరే కారణమని NSO వెల్లడించింది. గతేడాది FEBలో తయారీ వృద్ధి 4.9 శాతం ఉండగా ఈ ఏడాది అది 2.9 శాతానికి చేరింది. అలాగే మైనింగ్ 8.1% నుంచి 1.6%కి, విద్యుదుత్పత్తి 7.6% నుంచి 3.6%కి దిగివచ్చింది. అయితే మార్చి, ఏప్రిల్‌లో పరిస్థితి మెరుగుపడొచ్చని నిపుణుల అంచనా.

News April 12, 2025

సీఎం చంద్రబాబు సంతకం ఫోర్జరీ.. అధికారిపై కేసు

image

AP: అనంతపురం(D) గుత్తి సబ్ డివిజినల్ కార్యాలయంలో సీనియర్ ఇన్‌స్పెక్టర్ సతీశ్ కుమార్ CM చంద్రబాబు, మంత్రి అచ్చెన్న సంతకాలను ఫోర్జరీ చేశారు. దీంతో అతనిపై అధికారులు కేసు నమోదు చేశారు. గతేడాది ఎన్నికల సమయంలో షేర్ మార్కెట్ పనులు చేసుకుంటూ అతను విధులకు గైర్హాజరయ్యారు. దీంతో అతనిపై చర్యలకు ఆ శాఖ కమిషనర్ ఆదేశించారు. దీని నుంచి తప్పించుకునేందుకు CM, మంత్రి పేర్లతో సిఫారసు లేఖ తయారుచేసి సతీశ్ దొరికిపోయారు.

News April 12, 2025

KGBVల్లో ఇంటర్ ప్రవేశాలు.. గడువు పొడిగింపు

image

AP: రాష్ట్రంలోని KGBVల్లో ఇంటర్ ఫస్ట్, సెకండియర్‌లో ప్రవేశాలకు దరఖాస్తుల గడువును ఈ నెల 21 వరకు పొడిగించారు. SC, ST, BC, మైనారిటీ, డ్రాపౌట్స్, అనాథలు మాత్రమే అప్లై చేసుకోవాలని సమగ్ర శిక్ష సంచాలకులు శ్రీనివాసరావు సూచించారు. ఎంపికైన విద్యార్థులకు ఫోన్ మెసేజ్ ద్వారా సమాచారం అందిస్తామన్నారు.
వెబ్‌సైట్: <>https://apkgbv.apcfss.in/<<>>