news

News July 8, 2024

కాంగ్రెస్ వాస్తవాన్ని తెలుసుకోవాలి: సింథియా

image

గుజరాత్‌లో బీజేపీని ఓడించి తీరుతామన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింథియా స్పందించారు. కాంగ్రెస్ పగటికలల్ని కంటోందని ఎద్దేవా చేశారు. ‘లోక్‌సభ ఎన్నికల్లో 13 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఖాతా కూడా తెరవలేదు. ఓటర్లు వరసగా మూడోసారి ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. అయినా ఆ పార్టీ నేతలకు అహంకారం తగ్గలేదు. వాస్తవాన్ని గుర్తించండి. ఆ తర్వాత మాట్లాడండి’ అని హితవు పలికారు.

News July 8, 2024

రికార్డుల్ని షేక్ చేసిన అభిషేక్

image

జింబాబ్వేపై మ్యాచ్‌లో టీం ఇండియా ఓపెనర్ అభిషేక్ శర్మ శతకబాదిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో పలు రికార్డుల్ని క్రియేట్ చేశారు. అవి.. వరసగా 3 సిక్సులతో సెంచరీ కంప్లీట్ చేసుకున్న తొలి భారత ఆటగాడు. అంతర్జాతీయ టీ20ల్లో భారత్ తరఫున మూడో వేగవంతమైన సెంచరీ(46 బంతులు). రెండో అంతర్జాతీయటీ20లోనే సెంచరీ బాది ఎవిన్ లూయిస్‌తో సమం. అంతర్జాతీయ పురుషుల టీ20 మ్యాచ్‌లో ప్రత్యర్థి జట్టు స్పిన్నర్లపై అత్యధిక పరుగులు(65).

News July 8, 2024

చిన్నపిల్లాడిలా ఎన్నిసార్లు ఏడుస్తారు ఉద్ధవ్?: మహారాష్ట్ర సీఎం

image

శివసేన(UBT) చీఫ్ ఉద్ధవ్ థాకరేపై మహారాష్ట్ర CM ఏక్‌నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు తమవైపే ఉన్నా ఇంకా శివసేన తమదేనంటూ ఉద్ధవ్ ఎందుకు చిన్నపిల్లాడిలా ఏడుస్తున్నారంటూ ప్రశ్నించారు. ‘పంచాయతీ ఎన్నికల్లో మేం 2వ స్థానంలో ఉంటే ఉద్ధవ్ పార్టీ 6వ స్థానానికి పరిమితమైంది. ఎంపీ ఎన్నికల్లోనూ మాకే ఎక్కువ ఓట్లు వచ్చాయి. బాలాసాహెబ్ ఆశయాలను వారు పక్కన పెట్టడం వల్లే ప్రజలు మావైపు నిలుస్తున్నారు’ అని పేర్కొన్నారు.

News July 8, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News July 8, 2024

జులై 8: చరిత్రలో ఈరోజు

image

1497: భారత్‌కు వాస్కోడగామా ప్రయాణం ప్రారంభించిన రోజు
1914: బెంగాల్ దివంగత మాజీ సీఎం జ్యోతి బసు జననం
1919: తెలంగాణ తొలితరం దళిత కవి దున్న ఇద్దాసు మరణం
1921: దివంగత పారిశ్రామిక వేత్త ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ జననం
1949: ఉమ్మడి ఏపీ మాజీ సీఎం YS రాజశేఖర రెడ్డి జయంతి
1966: సినీ నటి రేవతి జననం
1972: భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ జననం
1978: తొలితరం భావకవి నాయని సుబ్బారావు జననం

News July 8, 2024

ఈరోజు నమాజ్ వేళలు

image

తేది: జులై 08, సోమవారం
ఫజర్: తెల్లవారుజామున 4:27 గంటలకు
సూర్యోదయం: ఉదయం 5:48 గంటలకు
జొహర్: మధ్యాహ్నం 12:21 గంటలకు
అసర్: సాయంత్రం 4:57 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6:55 గంటలకు
ఇష: రాత్రి 8.16 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News July 8, 2024

శుభ ముహూర్తం

image

తేది: జులై 08, సోమవారం
తదియ: తెల్లవారుజామున 05:20 గంటలకు
పుష్యమి: ఉదయం 06.12 గంటలకు
వర్జ్యం: రాత్రి 07.53-09.36 గంటల వరకు
దుర్ముహూర్తం: మధ్యాహ్నం 12:29-1:21 గంటల వరకు
తిరిగి మధ్యాహ్నం 03.05-03.57 గంటల వరకు
రాహుకాలం: ఉదయం 7.30- 9.00 గంటల వరకు

News July 8, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News July 8, 2024

ఈరోజు న్యూస్ HEADLINES

image

* జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట.. ఒకరు మృతి, 400 మందికి గాయాలు
* TG: గ్రూప్-1 ఫలితాలు విడుదల
* MPలు కలిసి పోరాడాలన్న రేవంత్.. సాధ్యం కాదన్న CBN
* TG: అసంపూర్తి ప్రాజెక్టులపై CM రేవంత్ ఫోకస్
* AP: జనసేన శ్రేణులకు డిప్యూటీ CM పవన్ వార్నింగ్
* కాంగ్రెస్, BRSను అభినందిస్తున్నా: CBN
* 2వ టీ20లో జింబాబ్వేపై భారత్ విజయం
* ఇండియా, సౌతాఫ్రికా మహిళల 2వ టీ20 రద్దు

News July 8, 2024

‘ఆయుష్మాన్ భారత్’ ₹10లక్షలకు పెంపు?

image

జాతీయ ఆరోగ్య సంరక్షణ పథకంలో భాగంగా కేంద్రం అమలు చేస్తోన్న ‘ఆయుష్మాన్ భారత్’ పరిమితిని ₹10లక్షలకు పెంచనున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు లబ్ధిదారుల సంఖ్యనూ రెండింతలు చేసేందుకు యోచిస్తోందట. రాబోయే బడ్జెట్లో ఈ పథకంపై కీలక ప్రకటన చేసే ఛాన్స్ ఉందని సమాచారం. ప్రస్తుతం దీని కింద అర్హులకు ₹5లక్షలు అందుతోంది. ఒకవేళ పెంచితే ప్రభుత్వంపై ప్రతి ఏడాది రూ.12వేల కోట్లు అదనపు భారం పడుతుందని అంచనా.