India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: రేషన్‌కార్డుల్లో పేర్ల మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించిందంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే సవరణలు, పేర్ల నమోదుకు ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ఉత్తర్వులు రాలేదని పౌరసరఫరాల శాఖ అధికారులు ప్రకటించారు. ఎడిట్ ఆప్షన్ ప్రక్రియ మొదలైందనే వాట్సాప్‌లలో ఫేక్ వార్తలు రావడంతో ప్రజలు రాష్ట్రంలోని మీ సేవా కేంద్రాలకు పరుగులు పెడుతున్నారు.
TG: రాష్ట్రంలో అత్యధిక ఎంపీ సీట్లు గెలిచి KCR ప్రధాని కావాలని కలలు కన్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు ఎద్దేవా చేశారు. HYDలో ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన ఆయన.. మాజీ CM సరిగ్గా పరిపాలిస్తే కాంగ్రెస్‌కు ప్రజలు ఎందుకు అధికారం కట్టబెట్టారని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతోనే BRSకు ప్రజలు బుద్ధి చెప్పారని మండిపడ్డారు. దళితుడిని సీఎం చేస్తానని చెప్పి కేసీఆర్ మోసం చేశారని ధ్వజమెత్తారు.
TG: తమతో 26 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ అన్నారు. కానీ వారంతా బీజేపీలోకి రావాలంటే రాజీనామా చేయాలని, అందుకే వారు పార్టీలోకి రావడానికి తర్జనభర్జన పడుతున్నారని చెప్పారు. ఎమ్మెల్యేలను పార్టీలోకి చేర్చుకుని బీఆర్ఎస్ ఏ తప్పైతే చేసిందో కాంగ్రెస్ కూడా అదే తప్పు చేస్తోందని మండిపడ్డారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
భారతీయుడు-2 కంటే మూడో పార్ట్ బాగా నచ్చిందని తాను చేసిన వ్యాఖ్యలను కొందరు మరోలా అర్థం చేసుకున్నారని కమల్ హాసన్ చెప్పారు. ‘మూడో భాగం బాగుందన్నా.. అలా అని రెండో పార్ట్ బాగాలేదని కాదు. సాంబారు, రసంతో భోజనాన్ని ఇష్టంగా తింటాం. పాయసం ఉంటే మరింత ఆసక్తి చూపుతాం. అలాగే పలు అంశాల్లో భారతీయుడు-3 నన్ను ఆకట్టుకుంది. నా కెరీర్‌లో ఇండియన్ సీక్వెల్ కోసమే ఎక్కువ కష్టపడ్డా’ అని పేర్కొన్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పెళ్లిపై ఆయన పెద్దమ్మ శ్యామలా దేవి ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ‘బాహుబలి తర్వాత ప్రభాస్‌కు సినిమాల్లో విజయం దక్కదని కొందరు అన్నారు. కానీ ఇప్పుడు కల్కితో సక్సెస్ అందుకున్నారు. అలాగే ఆయన పెళ్లి విషయంలోనూ ఇదే జరుగుతుంది. ప్రభాస్ చాలా గొప్ప వ్యక్తి. ఆయనకు పెళ్లి చేయాలని మాకూ ఉంటుంది. ఆ సమయం రాగానే వివాహం జరిగి తీరుతుంది’ అని ఆమె వ్యాఖ్యానించారు.
అరుదైన జంతువులు, పక్షులకు రూ.లక్షలు వెచ్చించడం చూశాం. ఓ స్టాగ్ బీటిల్ అనే అత్యంత అరుదైన పురుగు రేటు రూ.75 లక్షలు. విదేశాల్లో కొందరు దీన్ని అదృష్టానికి చిహ్నంగా భావిస్తారట. ఓవర్‌నైట్ కోటీశ్వరులను చేస్తుందని నమ్మకం. కొన్ని చికిత్సల్లోనూ వాడతారు. అందుకే బిలియనీర్లు అంత ధర వెచ్చిస్తారు. ఇవి ఎక్కువగా ఉష్ణమండల ప్రాంతాల్లోనే జీవిస్తాయి. 2-6 గ్రాముల బరువు, 37-70MM పొడవు ఉంటాయి. జీవితకాలం 3-7ఏళ్లు.
విరాట్ కోహ్లీ క్రికెట్‌లోనే కాకుండా సోషల్ మీడియాలోనూ రికార్డు సృష్టిస్తున్నారు. T20WC విజయం తర్వాత ‘ఇంతకంటే మంచిరోజును కలలోనూ ఊహించలేదు. చివరికి మేం సాధించాం’ అంటూ ఆయన ఇన్‌స్టాలో చేసిన పోస్టు 2 కోట్లకుపైగా లైక్స్ సాధించింది. ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్, మొదటి ఆసియా క్రీడాకారుడు, రెండో ఏషియన్‌గా ఆయన నిలిచారు. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక లైక్స్ పొందిన క్రీడాకారుల పోస్టుల్లో ఐదో స్థానంలో అది నిలిచింది.
తెలంగాణను సీఎం రేవంత్ రెడ్డి అభివృద్ధిపథంలో నడిపిస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబు ప్రశంసించారు. అందుకే స్వయంగా కలిసి అభినందించినట్లు తెలిపారు. ‘ఏపీ, తెలంగాణ అన్నదమ్ముల్లా కొనసాగుతాయి. గొడవలు పడితే సమస్యలు తీరవు. అందుకే కూర్చుని విభజన సమస్యలపై చర్చించాం. నేనూ ఓఆర్ఆర్, ఎయిర్‌పోర్ట్, ఐటీ రంగాలను డెవలప్ చేశా. టీడీపీ పుట్టిందే తెలంగాణ గడ్డపై. తెలుగు రాష్ట్రాల అభివృద్ధే TDP ధ్యేయం’ అని ఆయన పేర్కొన్నారు.
హాలీవుడ్ ప్రముఖ నిర్మాత జాన్ లాండౌ(63) కన్నుమూశారు. కొన్నేళ్లుగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన చికిత్స తీసుకుంటూ రెండు రోజుల కిందట మరణించారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆస్కార్ విన్నింగ్ సినిమాలు టైటానిక్, అవతార్, అవతార్: ద వే ఆఫ్ వాటర్‌ను ఆయన నిర్మించారు. 2026, 2030లో విడుదల కానున్న అవతార్ 3, 4 చిత్రాలకు కూడా ఆయనే నిర్మాత.
TG: దోస్త్ 3వ విడతలో 73,662 మంది విద్యార్థులు సీట్లు దక్కించుకున్నారు. వీరిలో 9,630 మంది సీట్లు మార్చుకుని మరో కాలేజీకి వెళ్లారు. మొత్తంగా 3 విడతల్లో 1,54,246 మంది ప్రవేశాలు పొందారు. సీట్లు పొందిన విద్యార్థులు 8 నుంచి 12వ తేదీ వరకు కాలేజీల్లో రిపోర్ట్ చేయాలని, లేదంటే సీటును కోల్పోతారని అధికారులు హెచ్చరించారు. అటు 16వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఇంట్రా కాలేజీ స్లైడింగ్, 19న సీట్ల కేటాయింపు ఉంటుంది.
Sorry, no posts matched your criteria.