India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఈ ఏడాది టీ20ల్లో టీమ్ ఇండియాకు జింబాబ్వే రూపంలో తొలి ఓటమి ఎదురైంది. ఇప్పటివరకు భారత్ 14 టీ20లు ఆడగా 12 మ్యాచుల్లో జయకేతనం ఎగరేసింది. ఓ మ్యాచులో ఫలితం తేలలేదు. తాజాగా జింబాబ్వేపై టీమ్ ఇండియా ద్వితీయశ్రేణి జట్టు ఓటమి పాలై ఈ రికార్డును కోల్పోయింది. మరోవైపు టీమ్ ఇండియా జైత్రయాత్రకు కూడా బ్రేక్ పడింది. వరుసగా 12 మ్యాచులు గెలవగా 13వది ఓడిపోయింది. 13 వరుస విజయాలతో మలేషియా, బెర్ముడా దూసుకుపోతున్నాయి.
TG: 11,062 టీచర్ <<13528720>>ఉద్యోగాలకు<<>> సిద్ధమవుతున్న DSC అభ్యర్థులకు అవగాహన కల్పించేందుకు T-SAT ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనుంది. పరీక్ష రాసే విధానం, సబ్జెక్టుల వారీగా వివరణలతో అనుభవమున్న ఫ్యాకల్టీతో రేపటి నుంచి నిపుణ ఛానల్‌లో రోజూ ఉ.11 నుంచి మ.12 వరకు ప్రత్యక్ష ప్రసారాలుంటాయి. విద్య ఛానల్‌లో రా.7-8 మధ్య ఈ కార్యక్రమాలు మళ్లీ ప్రసారమవుతాయి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.
ఆరోగ్య బీమా పాలసీలపై ప్రస్తుతం 18% ఉన్న GSTని 5 శాతానికి తగ్గించాలని కేంద్రాన్ని బీమా ఏజెంట్లు, పాలసీదారులు కోరుతున్నారు. 2047కి ప్రతి ఒక్కరికీ బీమా అందించాలనే IRDAI లక్ష్యం నెరవేరడానికి ఇదే మార్గమంటున్నారు. అలాగే ప్రస్తుతం సెక్షన్ 80D కింద వ్యక్తిగత ఆరోగ్య బీమా పాలసీలకు ₹25వేల వరకే మినహాయింపు ఉందని, దీన్ని ₹50వేల వరకు పెంచాలంటున్నారు. కొత్త బడ్జెట్‌లో వీటి ప్రస్తావన చేయాలని విన్నవిస్తున్నారు.
TG: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో BRS ఖాళీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలోని 14 సీట్లలో కాంగ్రెస్ 12, బీఆర్ఎస్ 2 గెలుచుకున్నాయి. ఇటీవల గద్వాల BRS MLA బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరారు. మరో నాలుగైదు రోజుల్లో అలంపూర్ BRS MLA విజయుడు కూడా కాంగ్రెస్‌లో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే జరిగితే ఆ జిల్లాలో గులాబీ పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారనుంది.
TG: రాజ్‌భవన్‌లో కొన్ని నెలలుగా పెండింగ్‌లో ఉన్న ఏడు బిల్లులకు ఇన్‌ఛార్జ్ గవర్నర్ రాధాకృష్ణన్ ఆమోదం తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ బిల్లులకు అప్పటి గవర్నర్ తమిళి సై నో చెప్పగా, ఇప్పటికి మోక్షం లభించింది. తెలంగాణ పంచాయతీరాజ్ చట్ట సవరణపై 3 బిల్లులతోపాటు ప్రైవేటు వర్సిటీలు, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, మైనార్టీస్ కమిషన్, మున్సిపల్ చట్టాల సవరణ బిల్లులు అమల్లోకి వచ్చాయి.
తెలంగాణ నుంచి APలో కలిపిన ఎటపాక, కన్నాయిగూడెం, గుండాల, పురుషోత్తపట్నం, పిచుకలపాడు గ్రామ పంచాయతీలను తమకు తిరిగివ్వాలన్న CM రేవంత్ ప్రతిపాదనలపై AP అధికారులు స్పందించారు. ఒక రాష్ట్రంలోని గ్రామాలను వేరే రాష్ట్రంలో కలపాలంటే కేంద్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని గుర్తు చేశారు. అటు HYDలో AP ప్రభుత్వానికి భవనాలు కేటాయించేందుకు నిరాకరించిన ప్రభుత్వం.. దరఖాస్తు చేసుకుంటే స్థలం ఇస్తామని బదులిచ్చింది.
కొరటాల శివ డైరెక్షన్‌లో దేవర మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. వచ్చే వారం ఎన్టీఆర్, జాన్వీ కపూర్ కాంబినేషన్‌లో ఓ రొమాంటిక్ సాంగ్ చిత్రీకరణకు మూవీ యూనిట్ ప్లాన్ చేసిందట. ఇందుకోసం హైదరాబాద్ శివార్లలో సెట్‌ను తీర్చిదిద్దుతున్నట్లు సమాచారం. ఇటీవల థాయ్‌లాండ్‌లో ఓ సాంగ్ షూటింగ్ కంప్లీట్ అయిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
☞ కొండమోడు-పేరేచర్ల-రూ.1032 కోట్లు
☞ సంగమేశ్వరం-ఆత్మకూరు- రూ.776 కోట్లు
☞ గోరంట్ల-హిందూపురం- రూ.808 కోట్లు
☞ నంద్యాల-కర్నూలు, కడప బోర్డర్-రూ.691 కోట్లు
☞ వేంపల్లి-ప్రొద్దుటూరు-చాగలమర్రి- రూ.1321 కోట్లు
☞ విశాఖ-బౌధర- రూ.935 కోట్లు
☞ ముద్దనూరుపులివెందుల-బి.కొత్తపల్లి– రూ.108 కోట్లు
☞ పెడన-నూజివీడు-విస్సన్నపేట- రూ.1600 కోట్లు
ప్యాకేజ్డ్ ఫుడ్ వస్తువులపై పోషక సమాచారాన్ని పెద్ద అక్షరాలతో ముద్రించాలనే నిబంధనలను FSSAI తీసుకురానుంది. ఉప్పు, చక్కెర, కొవ్వు తదితర పదార్థాలు ఎంత మొత్తంలో ఉన్నాయనే వివరాలను పెద్దగా, బోల్డ్ ఫాంట్‌లో ఉంచాలని ప్రతిపాదించింది. దీనిపై ముసాయిదా నోటిఫికేషన్‌ను జారీ చేసి వివిధ వర్గాల స్పందన కోరనుంది. ఇది అమల్లోకి వస్తే ఉత్పత్తుల్లోని పోషకాల గురించి యూజర్లు మెరుగ్గా అర్థం చేసుకోవడానికి వీలవుతుంది.
AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నేడు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వల్ల బాపట్ల, కృష్ణా, పల్నాడు, ఎన్టీఆర్, మన్యం, పార్వతీపురం, శ్రీకాకుళం తదితర జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదు కావచ్చని అంచనా వేసింది. ఇక మిగిలిన జిల్లాల్లోనూ తేలికపాటి వర్షాలు పడతాయని పేర్కొంది.
Sorry, no posts matched your criteria.