news

News July 6, 2024

బాలిక హత్య ఘటనపై హోం మంత్రి సీరియస్

image

AP: అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలో జరిగిన బాలిక హత్య ఘటనపై ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేయాలని హోంమంత్రి అనిత ఆదేశించారు. ఈ దారుణ ఘటనపై తీవ్రంగా స్పందించిన ఆమె.. జిల్లా ఎస్పీని అడిగి వివరాలు తెలుసుకున్నారు. కేసు దర్యాప్తు ముమ్మరంగా చేపట్టాలని పోలీసులను ఆదేశించారు. కాగా, తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థినిని ప్రేమోన్మాది సురేశ్ నరికి చంపడం సంచలనంగా మారింది.

News July 6, 2024

సీఎంల భేటీ.. అంబటి రాంబాబు 3 ప్రశ్నలు!

image

ఏపీలో కలిపిన 7 మండలాలను TG తిరిగి అడిగిందా? అని మాజీ మంత్రి అంబటి రాంబాబు X వేదికగా ప్రశ్నించారు. రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీపై మంత్రుల ప్రెస్‌మీట్ అనంతరం ఆయన ట్వీట్ చేశారు. ‘ఏపీకి ఉన్న సుదీర్ఘమైన తీర ప్రాంతంలో, వివిధ పోర్టుల్లో TG వాటా అడిగిందా? టీటీడీ ఆదాయంలోనూ, బోర్డులోనూ వాటా అడిగిందా? ఈ ప్రశ్నలకు ఇరు రాష్ట్రాల ప్రతినిధులు స్పష్టత ఇవ్వకపోవడం సమంజసమా?’ అని ఆయన ప్రశ్నలు సంధించారు.

News July 6, 2024

ఫ్యాన్స్ కోసం మహేశ్ బర్త్ డే ట్రీట్?

image

మహేశ్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో ‘SSMB 29’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఓ మూవీ తెరకెక్కనుంది. వచ్చే నెల 9న మహేశ్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి ఓ కాన్సెప్ట్ వీడియో రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో మహేశ్ డ్యూయల్ రోల్ చేయనున్నట్లు సమాచారం. ఇండోనేషియాకు చెందిన మోడల్ చెల్సియా హీరోయిన్‌గా నటిస్తున్నట్లు టాక్. ఈ చిత్రానికి ‘మహారాజ్’ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

News July 6, 2024

తొమ్మిదో తరగతి అమ్మాయిని నరికి చంపిన ప్రేమోన్మాది

image

అనకాపల్లి జిల్లాలో దారుణం జరిగింది. రాంబిల్లి మండలం కొప్పుగుండుపాలెంలో తొమ్మిదో తరగతి విద్యార్థినిని యువకుడు సురేశ్ కత్తితో నరికి చంపేశాడు. కొద్దిరోజులుగా అతడు బాలిక వెంట పడుతున్నట్లు సమాచారం. ఈక్రమంలోనే ఇవాళ సాయంత్రం దర్శిని ఇంటికి వెళ్లి వేటకొడవలితో దాడి చేశాడు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. నిందితుడు పరారీలో ఉండగా, పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు.

News July 6, 2024

అనంత్ అంబానీ పెళ్లి.. ట్రాఫిక్ ఆంక్షలపై నెటిజన్ల ఫైర్

image

ఈనెల 12న ముంబైలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్‌‌లో అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ పెళ్లి జరగనుంది. దీంతో ‘పబ్లిక్ ఈవెంట్’ సందర్భంగా వేదిక పరిసరాల్లో 12-15 తేదీల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని ముంబై పోలీసులు సర్క్యులర్ జారీ చేయడంపై విమర్శలు వస్తున్నాయి. ఇదెలా పబ్లిక్ ఈవెంట్ అవుతుందని నెటిజన్లు మండిపడుతున్నారు. పెళ్లి అంబానీ కుటుంబ ప్రైవేట్ కార్యక్రమమని, అందుకు తాము ఇబ్బందులు పడాలా? అని ప్రశ్నిస్తున్నారు.

News July 6, 2024

PHOTOS: కార్యకర్తలు, ఫ్యాన్స్‌తో జగన్

image

AP: మాజీ సీఎం జగన్ ఇవాళ కడప ఎయిర్‌పోర్ట్ నుంచి పులివెందుల మార్గమధ్యంలో వైసీపీ కార్యకర్తలు, ప్రజలను పలకరించారు. ఈ సందర్భంగా ఆయనతో పలువురు అభిమానులు ఫొటోలు దిగారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను వైసీపీ Xలో పోస్ట్ చేసింది.

News July 6, 2024

ఆసియా కప్‌కు భారత మహిళల జట్టు ఇదే

image

ఈనెల 19 నుంచి జరిగే మహిళల ఆసియా కప్(T20) కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది.

జట్టు: హర్మన్‌ప్రీత్ (C), స్మృతి మంధాన, షఫాలీ, దీప్తి, జెమిమా, రిచా, ఉమా ఛెత్రి, పూజా వస్త్రాకర్, అరుంధతి, రేణుక, హేమలత, శోభన , రాధ, శ్రేయాంక, సాజన.

రిజర్వ్‌డ్ ప్లేయర్స్: శ్వేతా సెహ్రావత్, సైకా ఇషాక్, తనూజా కన్వర్, మేఘనా సింగ్.

News July 6, 2024

టీమ్ ఇండియా చెత్త రికార్డు

image

వారం క్రితం వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచిన భారత క్రికెట్ టీమ్.. నేడు జింబాబ్వే చేతిలో చిత్తయింది. సీనియర్లు లేకుండా బరిలోకి దిగిన కుర్రాళ్లు.. 116 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలపడ్డారు. అంతర్జాతీయ టీ20ల్లో టీమ్ ఇండియాపై ప్రత్యర్థి డిఫెండ్ చేసుకున్న అత్యల్ప లక్ష్యం ఇదే. 2016లో న్యూజిలాండ్ నిర్దేశించిన 127 పరుగుల లక్ష్యాన్ని, 2009లో SA చేసిన 131 పరుగులను భారత్ ఛేదించలేకపోయింది.

News July 6, 2024

ఆగస్టు 2న ‘ఎటో వెళ్లిపోయింది మనసు’ రీరిలీజ్

image

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘ఎటో వెళ్లిపోయింది మనసు’ మూవీ రీరిలీజ్‌కు సిద్ధమైంది. వచ్చే నెల 2న ఈ సినిమాను రీరిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించారు. గౌతమ్ మేనన్ తెరకెక్కించిన ఈ మూవీలో సమంత హీరోయిన్‌గా నటించారు. ఇళయరాజా మ్యూజిక్ అందించారు. 2012 డిసెంబర్ 14న ఈ మూవీ విడుదలై హిట్‌గా నిలిచింది.

News July 6, 2024

మారుమూల రాష్ట్రాల్లో ట్రేడింగ్‌పై పెరుగుతున్న ఆసక్తి!

image

స్టాక్ మార్కెట్లలో పెట్టుబడికి మారుమూల రాష్ట్రాల ప్రజలు సైతం ఆసక్తి కనబరుస్తున్నారు. ఏడాదిలో ఈశాన్య రాష్ట్రాలైన మిజోరంలో 81.10% (28,784 మంది క్లైంట్లు), అరుణాచల్ ప్రదేశ్ 62.19% (65,962), త్రిపుర 56.10% (2,52,038), నాగాలాండ్ 52.95% (68,385) వృద్ధి నమోదైంది. ఇక J&Kలో 53.79% (8,87,913), లద్దాక్‌లో 370.57% (1,887), పేద రాష్ట్రంగా గుర్తింపుపొందిన బిహార్‌లో 49.41% (71,97,665) వృద్ధి రికార్డ్ అయింది.