news

News July 6, 2024

మారుమూల రాష్ట్రాల్లో ట్రేడింగ్‌పై పెరుగుతున్న ఆసక్తి!

image

స్టాక్ మార్కెట్లలో పెట్టుబడికి మారుమూల రాష్ట్రాల ప్రజలు సైతం ఆసక్తి కనబరుస్తున్నారు. ఏడాదిలో ఈశాన్య రాష్ట్రాలైన మిజోరంలో 81.10% (28,784 మంది క్లైంట్లు), అరుణాచల్ ప్రదేశ్ 62.19% (65,962), త్రిపుర 56.10% (2,52,038), నాగాలాండ్ 52.95% (68,385) వృద్ధి నమోదైంది. ఇక J&Kలో 53.79% (8,87,913), లద్దాక్‌లో 370.57% (1,887), పేద రాష్ట్రంగా గుర్తింపుపొందిన బిహార్‌లో 49.41% (71,97,665) వృద్ధి రికార్డ్ అయింది.

News July 6, 2024

చంద్రబాబుకు రేవంత్ డిన్నర్

image

ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రులు, అధికారులకు సీఎం రేవంత్ ప్రజాభవన్‌లో డిన్నర్ ఏర్పాటు చేశారు. సుమారు రెండు గంటల పాటు చర్చల తర్వాత ఇరు రాష్ట్రాలకు చెందిన నేతలు విందులో పాల్గొన్నారు. నీటి పంపిణీపై మరోసారి చర్చించాలని నిర్ణయించారు. ఈ భేటీ వివరాలను వెల్లడించేందుకు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కాసేపట్లో ప్రెస్ మీట్ నిర్వహించే అవకాశం ఉంది.

News July 6, 2024

చంద్రబాబు ముందు రేవంత్ డిమాండ్ ఇదే!

image

భద్రాచలం నుంచి APలో కలిసిన 7 మండలాల్లోని 5 గ్రామాలను తెలంగాణకు ఇవ్వాలని CM రేవంత్ చంద్రబాబును అడిగినట్లు తెలుస్తోంది. ఎటపాక, గుండాల, పురుషోత్తపట్నం, కన్నాయిగూడెం, పిచ్చుకలపాడు పంచాయతీలను అడిగినట్లు సమాచారం. దీనిపై కేంద్ర హోంశాఖకు లేఖ రాయాలని TG సర్కారు నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే HYDలోని కొన్ని భవనాలు తమకు కేటాయించాలని AP ప్రభుత్వం అడగ్గా.. రేవంత్ సర్కారు తిరస్కరించినట్లు సమాచారం.

News July 6, 2024

జింబాబ్వే చేతిలో భారత్ ఓటమి

image

జింబాబ్వేతో తొలి T20లో భారత్ 13 రన్స్ తేడాతో ఓడిపోయింది. 116 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక 102 రన్స్‌కే ఆలౌటైంది. కెప్టెన్ గిల్(31) రన్స్ చేయగా.. మిగతా బ్యాటర్లు చేతులెత్తేశారు. అభిషేక్, రింకూ డకౌట్ కాగా.. అవేశ్ 16, బిష్ణోయ్ 9, రుతురాజ్ 7, జురెల్ 7, పరాగ్ 2 రన్స్ చేశారు. చివర్లో సుందర్ 27 రన్స్ చేసినా ఫలితం లేకపోయింది. ఈ విజయంతో 5 టీ20ల సిరీస్‌లో జింబాబ్వే1-0తో ఆధిక్యం సాధించింది.

News July 6, 2024

ముగిసిన సీఎంల సమావేశం

image

తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం ముగిసింది. హైదరాబాద్ ‘ప్రజాభవన్’లో చంద్రబాబు, రేవంత్ రెడ్డి దాదాపు రెండు గంటల పాటు విభజన అంశాల పరిష్కారంపై చర్చించారు. రెండు రాష్ట్రాల నుంచి మంత్రులు, అధికారుల కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇరు రాష్ట్రాల ప్రయోజనాలకు భంగం కలగకుండా పరిష్కారాలు ఉండాలని భేటీలో నిర్ణయించారు.

News July 6, 2024

TEAM INDIA: ఆ ఒక్కటి తక్కువైంది..!

image

ప్రపంచ క్రికెట్‌లో టీమ్ ఇండియా దూకుడు కొనసాగిస్తోంది. ఇప్పటివరకు రెండు వన్డే, టీ20 వరల్డ్ కప్‌లను తన ఖాతాలో వేసుకుంది. కానీ రెండు సార్లు ఫైనల్‌కు వెళ్లినా ఐసీసీ టెస్టు ప్రపంచ ఛాంపియన్‌షిప్ మాత్రం సాధించలేకపోయింది. టీ20 వరల్డ్ కప్ విజయం స్ఫూర్తితో WTC కూడా సాధించాలని టీమ్ ఇండియా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. టెస్టుల్లోనూ ఛాంపియన్‌గా నిలిస్తే భారత జైత్రయాత్ర పరిపూర్ణమవుతుందని ఆశిస్తున్నారు.

News July 6, 2024

తాజా సినిమా ముచ్చట్లు

image

* గేమ్ ఛేంజర్‌లో రామ్ చరణ్ షూటింగ్ నేటితో పూర్తి
* రేపు సా.4:05కి ‘సరిపోదా శనివారం’ నుంచి ప్రియాంక మోహన్ ఫస్ట్ లుక్ రివీల్
* ఈనెల 8న ‘మిస్టర్ బచ్చన్’ నుంచి ‘సితార్’ సాంగ్ విడుదల
* మరో 40 రోజుల్లో (ఆగస్టు15న) డబుల్ ఇస్మార్ట్ విడుదల
* రూ.800 కోట్ల వసూళ్లు పూర్తి చేసుకున్న ‘కల్కి 2898 AD’
* ప్రియదర్శి, నభా నటేశ్ ‘డార్లింగ్’ సినిమా ట్రైలర్ రేపు రిలీజ్

News July 6, 2024

PHOTO GALLERY: చంద్రబాబు, రేవంత్ భేటీ

image

తెలుగు రాష్ట్రాల సీఎంలు విభజన అంశాలపై చర్చిస్తున్నారు. హైదరాబాద్ ‘ప్రజాభవన్’లో వీరి భేటీ కొనసాగుతోంది. ఏపీ తరఫున చంద్రబాబు, మంత్రులు అనగాని, దుర్గేశ్, జనార్దన్ రెడ్డి, తెలంగాణ తరఫున భట్టి, శ్రీధర్ బాబు, పొన్నం పాల్గొన్నారు. సమావేశం ఫొటోలను పై గ్యాలరీలో చూడొచ్చు.

News July 6, 2024

పేటీఎంను $100 బిలియన్ కంపెనీగా చేయడమే నా కల: విజయ్‌శేఖర్ శర్మ

image

పేటీఎం సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న వేళ ఆ సంస్థ వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సంస్థ విలువను $100 బిలియన్లకు పెంచడమే తన కల అని పేర్కొన్నారు. ఇకపై లోన్స్ మంజూరు చేయడంపైనా దృష్టిసారిస్తామన్నారు. ఈ సందర్భంగా తనకు వ్యాపారంలో సహకరించిన ఇండియన్ బ్యాంకర్లకు ధన్యవాదాలు తెలిపారు. పేటీఎం మార్కెట్ విలువ $3.5 బిలియన్లకు క్షీణించిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలకు ప్రాధాన్యం సంతరించకుంది.

News July 6, 2024

భారతీయుడు-2కి రెహమాన్‌ను అందుకే తీసుకోలేదు: శంకర్

image

ఏఆర్.రెహమాన్ బిజీగా ఉండటం వల్లే ఆయనను భారతీయుడు-2కి మ్యూజిక్ డైరెక్టర్‌గా తీసుకోలేదని డైరెక్టర్ శంకర్ స్పష్టం చేశారు. ‘భారతీయుడు-2 పనులు ప్రారంభించినప్పుడు రెహమాన్ రోబో 2.0 BGMపై వర్క్ చేస్తున్నారు. పాటలు త్వరగా కావాల్సి ఉండడంతో ఒత్తిడి చేయడం ఇష్టం లేక అనిరుధ్‌ను సంప్రదించాను. నాకు అతని మ్యూజిక్ ఇష్టం. అతను చాలా పాపులర్ కూడా. అందుకే తీసుకున్నా’ అని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.