news

News July 6, 2024

గ్రూప్-2 పరీక్ష వాయిదాకు ప్రభుత్వం నిర్ణయం?

image

TG: రాష్ట్రంలో జులైలో డీఎస్సీ, ఆగస్టులో గ్రూప్-2 పరీక్షలు ఉన్నాయి. వెనువెంటనే ఎగ్జామ్స్‌ నిర్వహించడంపై నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. దీంతో గ్రూప్-2ను వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇవాళ ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. కాగా ఈ నెల 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ, రెండు రోజుల గ్యాప్‌తో ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలకు షెడ్యూల్ వెలువడిన విషయం తెలిసిందే.

News July 6, 2024

ఇరాన్ అధ్యక్షుడిగా మసూద్ పెజెష్కియన్

image

ఇరాన్ అధ్యక్ష ఎన్నికల్లో మసూద్ పెజెష్కియన్ గెలుపొందారు. ఇస్లామిస్ట్ వాది అయిన సయీద్ జలీలిపై గెలుపొందడంతో మసూద్ పాలన ఎలా ఉంటుందోనని రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. పోలింగ్‌లో పెజెష్కియన్‌కు 1.63 కోట్ల ఓట్లు రాగా సయీద్‌కు 1.35 కోట్ల ఓట్లు వచ్చాయి. మూడు కోట్ల మంది పోలింగ్‌లో పాల్గొన్నట్టు ఇరాన్ ప్రభుత్వం వెల్లడించింది. కాగా మసూద్ ఎన్నికతో ఇరాన్‌లో సంస్కరణలు జరిగే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు.

News July 6, 2024

BREAKING: భారీగా పెరిగిన బంగారం ధరలు

image

బంగారం ధరలు మరోసారి పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.650 పెరిగి రూ.67,650కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.710 పెరగడంతో రూ.73,800 పలుకుతోంది. కేజీ వెండి ధర ఏకంగా రూ.1,600 పెరిగి రూ.99,300కు చేరింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపుగా ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

News July 6, 2024

ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌ను సాధిస్తాం: మంత్రి సత్యకుమార్

image

AP: గ్రామాల్లో కలుషిత నీటితో అతిసార కేసులు పెరుగుతున్నాయని హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ తెలిపారు. ‘పరీక్షలు నిర్వహిస్తే 240 చోట్ల కలుషిత నీరు కారణమని తేలింది. పరిసరాల పరిశుభ్రతపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్య రంగంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమిస్తాం. వ్యవస్థను ప్రక్షాళన చేసి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌ను సాధిస్తాం’ అని వెల్లడించారు. విజయవాడ యనమలకుదురులో ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు.

News July 6, 2024

భారత్‌లో తగిన ఉద్యోగాలు కల్పించడం కష్టం: సిటీ బ్యాంక్ రిపోర్ట్

image

దేశ ఆర్థిక వ్యవస్థ ఏటా 7% వృద్ధితో పరుగులు పెట్టినా నిరుద్యోగాన్ని అధిగమించడం కష్టమేనని సిటీ బ్యాంక్ ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. నిరుద్యోగ భారం తగ్గాలంటే ఏటా 1.2 కోట్ల ఉద్యోగాలు కల్పించాలన్నారు. కానీ ప్రస్తుత వృద్ధి ప్రకారం ఏటా 80లక్షల నుంచి 90లక్షల ఉద్యోగాలు మాత్రమే భారత్‌ సృష్టించగలదన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, తయారీ రంగంలో ఎగుమతుల వృద్ధిపై ఫోకస్ మొదలైన చర్యలు తీసుకోవాలని సూచించారు.

News July 6, 2024

వాసుదేవరెడ్డి, కొడాలి నానిపై కేసు నమోదు

image

AP: బేవరేజెస్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి, మాజీ మంత్రి కొడాలి నాని, కృష్ణా జిల్లా గత జేసీ మాధవీలతపై గుడివాడలో కేసు నమోదైంది. గోదాము లీజు వ్యవహారంలో వాసుదేవరెడ్డి తన పేరెంట్స్‌ను దుర్భాషలాడారని, మనస్తాపంతో తన తల్లి చనిపోయారని దుగ్గిరాల ప్రభాకర్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఇందులో మాధవీలత, కొడాలి నాని ప్రమేయం ఉందని ఆరోపించారు. ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News July 6, 2024

కేంద్రాన్ని ₹లక్ష కోట్లు డిమాండ్ చేసిన చంద్రబాబు?

image

ఎన్డీఏలో కీలకంగా మారిన CM చంద్రబాబు కేంద్రం ముందు పలు డిమాండ్లు పెట్టినట్లు సమాచారం. అమరావతి నిర్మాణం, ఇతర కీలక ప్రాజెక్టులు, పథకాల అమలు కోసం ₹లక్ష కోట్లకుపైగా నిధులను కోరినట్లు ఎకనామిక్ టైమ్స్, బ్లూమ్‌బర్గ్ వెల్లడించాయి. కేంద్ర బడ్జెట్‌లో ఈ కేటాయింపులు చేయాలని PMపై ఒత్తిడి చేసినట్లు పేర్కొన్నాయి. ముఖ్యంగా రాజధానికి ₹50వేల కోట్లు, పోలవరానికి ₹12వేల కోట్లు, ఆర్థిక లోటు భర్తీకి ₹7వేల కోట్లు కోరారట.

News July 6, 2024

కరిగిపోతున్న మంచు శివలింగం!

image

జమ్మూ కశ్మీర్‌లోని అమర్‌నాథ్ యాత్రకు సంబంధించి ఓ వార్త భక్తులను నిరాశకు గురిచేస్తోంది. అమర్‌నాథ్ గుహలోని మంచు శివలింగం కరిగిపోతున్నట్లు సమాచారం. దీంతో బల్తాత్, పహల్గం మార్గాల్లో భక్తులు దర్శించుకోలేని పరిస్థితి ఏర్పడింది. గత వారం రోజులుగా అక్కడ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 52 రోజుల పాటు జరిగే అమర్‌నాథ్ యాత్ర AUG 19తో ముగియనుంది. ఈ ఏడాది ఇప్పటివరకు 1.52 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు.

News July 6, 2024

వాట్సాప్ చాట్‌ను సాక్ష్యంగా పరిగణించలేం: HC

image

వాట్సాప్‌ చాట్‌ను ఎవిడెన్స్‌ యాక్ట్‌-1872 ప్రకారం సాక్ష్యాలుగా పరిగణించలేమని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. అవి వాస్తవమైనవేనంటూ తగిన ధ్రువీకరణ పత్రం ఉంటే తప్ప సాక్ష్యంగా గుర్తించలేమని తెలిపింది. డెల్‌ ఇంటర్నేషనల్‌ సర్వీసెస్‌ సంస్థపై అదీల్‌ ఫిరోజ్‌ అనే వినియోగదారుడు 2022లో జిల్లా వినియోగదారుల ఫోరంలో కేసు వేశాడు. దీనిపై విచారణ సందర్భంగా కమిషన్ ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ హైకోర్టు ఇలా స్పందించింది.

News July 6, 2024

వారిద్దరూ నా ఫేవరెట్ ప్లేయర్లు: గిల్

image

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తన ఫేవరెట్ ప్లేయర్లని యంగ్ ఓపెనర్ శుభమన్ గిల్ అన్నారు. భారత క్రికెట్‌లో వారిద్దరూ లెజెండ్స్ అని కొనియాడారు. వారు సాధించిన ఘనతలను అందుకోవడం కష్టంతో కూడుకున్నదని మీడియా సమావేశంలో చెప్పారు. ప్రతి ఆటగాడికి ప్రత్యేక గోల్స్ ఉంటాయనీ అయితే ఒత్తిడిని జయిస్తేనే అవి సాధ్యమవుతాయని అన్నారు. జింబాబ్వేతో నేటి నుంచి జరిగే T20 సిరీస్‌కు గిల్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.