India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
T20 WCలో పాక్ ఘోర పరాభవంతో బాబర్ ఆజమ్ కెప్టెన్సీపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో అతడిని కెప్టెన్‌గా తొలగిస్తారంటూ వస్తున్న వార్తలపై PCB ఛైర్మన్ మోసిన్ నఖ్వీ స్పందించారు. భవిష్యత్తులో కెప్టెన్‌గా బాబర్ కొనసాగడంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. దీనిపై త్వరలోనే కోచ్ కిర్‌స్టెన్, మాజీ ఆటగాళ్ల అభిప్రాయం తీసుకుంటామని చెప్పారు. జట్టుకు ‘మేజర్ సర్జరీ’ అవసరమంటూ WCలో ఓటమి అనంతరం నఖ్వీ వ్యాఖ్యానించారు.
రైళ్లలో సాధారణ ప్రయాణికుల ఇక్కట్లను తీర్చే దిశగా రైల్వే మంత్రిత్వ శాఖ సన్నాహాలు చేస్తోంది. పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చేందుకు రాబోయే రెండేళ్లలో 10వేల నాన్-ఏసీ కోచ్‌ల తయారీకి ప్రణాళికలు రూపొందించింది. 2024-25లో 4,485 కోచ్‌లు, 2025-26లో 5,444 కోచ్‌లు తయారు చేయనున్నట్లు రైల్వే అధికారి తెలిపారు. దీనికి అదనంగా మరో 5,300 జనరల్ కోచ్‌లు రూపొందించాలని యోచిస్తోంది.
తమ కస్టమర్ల డేటా హ్యాక్ కాలేదని టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ స్పష్టం చేసింది. తమ ప్రతిష్ఠ దిగజార్చడానికే కొంతమంది కుట్ర పన్నుతున్నారని ఆరోపించింది. తమ సెక్యూరిటీ వ్యవస్థలోకి ఇప్పటివరకు ఎవరూ చొరబడిన ఆనవాళ్లు లేవని పేర్కొంది. డేటా భద్రతలో ఎలాంటి లొసుగులు లేవని తేల్చిచెప్పింది. కాగా ఓ హ్యాకర్ ఎయిర్‌టెల్ కస్టమర్లకు సంబంధించిన డేటాను ఆన్‌లైన్‌లో రూ.50 వేల డాలర్లకు అమ్మకానికి పెట్టినట్లు వార్తలు వచ్చాయి.
కొలెస్ట్రాల్ తగ్గించే కాస్ట్లీ ఇంజెక్షన్లు భారత్‌లోనూ రానున్న నేపథ్యంలో ఇవి ఇన్సూరెన్స్ పరిధిలోకి వస్తాయా? లేదా? అనేది చర్చనీయాంశమైంది. ‘కేంద్రం ఆమోదంతో ఈ చికిత్స హెల్త్ ఇన్సూరెన్స్ పరిధిలోకి వచ్చినా ఆస్పత్రి ఖర్చులే కవర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంజెక్షన్ ఖర్చును (₹1.25లక్షలు) పేషెంటే భరించాలి. చికిత్సకు ముందు మీ ఇన్సూరర్‌ను సంప్రదించడం లేదా పాలసీ చెక్ చేసుకోవడం మంచిది’ అని నిపుణులు సూచిస్తున్నారు.
మాస్ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న ‘మిస్టర్ బచ్చన్’ మూవీ ఆగస్టు 15న విడుదల కానున్నట్లు తెలుస్తోంది. 14న ప్రీమియర్స్ వేయనున్నట్లు సమాచారం. దీనిపై మూవీ మేకర్స్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇవ్వాల్సి ఉంది. హరీశ్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తున్నారు. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది.
నీట్ పరీక్షలో భారీ స్థాయిలో అక్రమాలు జరిగినట్లు ఆధారాలు లేవని కేంద్రం తెలిపింది. సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లకు సమాధానంగా అఫిడవిట్ వేసింది. ‘పరీక్షను రద్దు చేయాల్సిన అవసరం లేదు. అలా చేస్తే నిజాయితీగా ఎగ్జామ్ రాసిన లక్షలాది మంది విద్యార్థులకు నష్టం కలుగుతుంది. పారదర్శకంగా పోటీ పరీక్షల నిర్వహణకు కట్టుబడి ఉన్నాం. నీట్ లీకేజీలో నిందితులను అరెస్ట్ చేశాం. CBI దర్యాప్తునకు ఆదేశించాం’ అని పేర్కొంది.
TG: రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా సుదర్శన్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. సుదర్శన్ రెడ్డి ప్రస్తుతం జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు. ప్రస్తుత సీఈఓ వికాస్‌రాజ్‌ను ఎన్నికల సంఘం రిలీవ్ చేసింది.
తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డిల భేటీకి ముహూర్తం ఖరారైంది. రేపు సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ ప్రజాభవన్‌లో ఇరువురు సమావేశం కానున్నారు. విభజన చట్టంలోని పెండింగ్ అంశాలపై చర్చించనున్నారు. 9వ షెడ్యూల్, 10వ షెడ్యూల్‌లోని సంస్థల పంపిణీ, విద్యుత్ సంస్థలపై ప్రధానంగా చర్చ జరగనుంది.
టీ20 వరల్డ్ కప్-2024 గెలవడంలో కీలకంగా వ్యవహరించి T20Iలకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్, కోహ్లీ చరిత్రలో నిలిచిపోతారని ఫ్యాన్స్ కొనియాడుతున్నారు. ‘క్రికెట్ గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు మా తండ్రులు సచిన్, గంగూలీ గురించి చెప్పేవారు. మేము మా పిల్లలకు లెజెండ్స్ రోహిత్, కోహ్లీల గురించి చెప్తాం’ అని నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు. వీరి రిటైర్మెంట్‌తో ఓ శకం ముగిసిందంటున్నారు. మీరేమంటారు?
ముంబైలో టీ20 వరల్డ్‌కప్ సెలబ్రేషన్స్ తర్వాత విరాట్ కోహ్లీ తన చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మను కలిశారు. ఈ సందర్భంగా తీసుకున్న ఫొటోలను రాజ్‌కుమార్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ‘విరాట్.. నువ్వు ఫస్ట్ ప్రాక్టీస్ సెషన్ నుంచి ఇంత గొప్ప సక్సెస్ సాధించే వరకూ నన్ను గర్వపడేలా చేశావు. నువ్వు ఇలాగే విజయవంతంగా కొనసాగాలి’ అంటూ పోస్ట్ పెట్టారు. ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Sorry, no posts matched your criteria.