India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు కాపు నేత హరి రామజోగయ్య లేఖ రాశారు. ‘మీ హయాంలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెట్టిస్తారని ఆశిస్తున్నా. కాపులకు 5 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి. కృష్ణా జిల్లాకు వంగవీటి మోహనరంగ పేరు పెట్టాలి. మీరు సినిమాలు, పాలనకు సమానంగా సమయం కేటాయించాలి. జిల్లా, మండల పరిషత్, పంచాయతీ వ్యవస్థలను బలోపేతం చేయాలి’ అని కోరారు.
సాధారణ వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినవారు ఇంట్లోనే హైడ్రోజన్-పెరాక్సైడ్‌ను పీల్చితే సరిపోతుందని హీరోయిన్ సమంత సలహా ఇచ్చారు. అయితే ఆ సలహా తప్పని, ఇలా చేస్తే చనిపోయే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రజారోగ్యానికి హాని కలిగించేలా చేయడం నేరమంటూ మండిపడుతున్నారు. కాగా ‘సమంత పోస్ట్‌లో ట్యాగ్ చేసిన డాక్టర్‌తో మీరు వాదిస్తే బాగుండేది’ అని ఓ డాక్టర్ చేసిన ట్వీట్‌కు హీరో రాహుల్ రవీంద్రన్ కౌంటర్ ఇచ్చారు.
TG: ఈ నెల 7, 8 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీగా వర్షాలు కురవొచ్చని వాతావరణ శాఖ తెలిపింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో 7న, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల్లో 8న వర్షపాతం ఉంటుందని పేర్కొంది. మిగిలిన జిల్లాల్లోనూ చెదురుమదురుగా వర్షాలు పడొచ్చని అంచనా వేసింది.
TG: విద్యుత్ బిల్లుల చెల్లింపుల్లో కొత్తగా QR కోడ్ విధానాన్ని ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ తీసుకొచ్చింది. రీడింగ్ తీశాక వచ్చే బిల్లు కిందే QR కోడ్ ఉంటుంది. వినియోగదారులు ఫోన్‌లో దీనిని స్కాన్ చేసి డెబిట్, క్రెడిట్ కార్డులు, UPI, నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించవచ్చు. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో అమల్లోకి రాగా.. త్వరలో అన్ని జిల్లాల్లో QR కోడ్ బిల్లులు రానున్నాయి.
పాపులర్ వెబ్ సిరీస్ మీర్జాపూర్-3 అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. మొత్తం 10 ఎపిసోడ్లను ఒకేసారి రిలీజ్ చేశారు. తెలుగు సహా అన్ని భాషల్లో సిరీస్ అందుబాటులో ఉంది. రెండో సీజన్‌లో మున్నా(దివ్యేందు శర్మ)ను అంతం చేసి మీర్జాపూర్‌ను గుడ్డు(అలీ ఫజల్) సొంతం చేసుకుంటారు. దాన్ని గుడ్డు ఎలా పాలిస్తారు? అతడిని చంపి మీర్జాపూర్‌ను దక్కించుకోవడానికి లోకల్ గ్యాంగ్స్ చేసే ప్రయత్నాలను పార్ట్-3లో చూపించారు.
హైదరాబాద్ పెద్దఅంబర్‌పేట వద్ద నల్గొండ సీసీఎస్ పోలీసులు కాల్పులు జరిపారు. ఔట్ రింగ్ రోడ్డు వద్ద దోపిడీ దొంగలను పట్టుకునే క్రమంలో వారు దాడికి తెగబడటంతో పోలీసులు గాల్లోకి తుపాకులు కాల్చారు. అనంతరం నలుగురు సభ్యుల దొంగల ముఠాను అదుపులోకి తీసుకున్నారు.
బ్రిటన్ ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘన విజయం సాధించింది. మ్యాజిక్ ఫిగర్(326)ను దాటి 364 సీట్లను కైవసం చేసుకుంది. ప్రధాని రిషి సునాక్ నేతృత్వంలోని కన్జర్వేటివ్ పార్టీ 77 సీట్లు, లిబరల్ డెమొక్రాట్స్ 48 సీట్లలో గెలిచింది. మరిన్ని ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. ఓటమికి తనదే బాధ్యతని సునాక్ వెల్లడించారు. లేబర్ పార్టీ నేత కైర్ స్టార్మర్‌కు ఫోన్ చేసి అభినందించారు. ఇవాళే అధికార మార్పిడి జరుగుతుందన్నారు.
TG: ప్రజలకు అత్యవసర వైద్య సేవలు అందేలా ప్రభుత్వ ఆసుపత్రులను వైద్య, ఆరోగ్య శాఖ మ్యాపింగ్ చేయనుంది. ప్రతి 30కి.మీ పరిధిలో ఎమర్జెన్సీ సేవలు అందించే ప్రభుత్వ ఆసుపత్రి ఉండేలా చర్యలు చేపట్టింది. అత్యవసర వైద్య సేవలు పొందడంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను ఇటీవల ప్రాథమికంగా గుర్తించింది. ఏ గ్రామానికి ఏ వైద్య వసతి ఎంత దూరంలో ఉందో గుర్తించడంతో పాటు ఆసుపత్రిలో వసతులను మ్యాపింగ్‌లో రికార్డు చేస్తోంది.
TG: BRS పార్టీకి మరో షాక్ తగలనుంది. గద్వాల BRS MLA కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు అనుచరులతో వెల్లడించారు. ఆయన చేరికను గద్వాల జడ్పీ ఛైర్‌పర్సన్ సరిత తిరుపతయ్య సహా స్థానిక కాంగ్రెస్ నేతలు వ్యతిరేకిస్తున్నారు. దీంతో తనను కలిసిన సరితకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు.
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న 21వ సినిమా నుంచి ఫస్ట్ లుక్ విడుదలైంది. కళ్యాణ్ రామ్ జన్మదినం సందర్భంగా మేకర్స్ పోస్టర్‌ను విడుదల చేశారు. ప్రదీప్ చిలుకూరి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో విజయశాంతి కీలక పాత్రలో కనిపించనున్నారు. అశోక్ ముప్ప, సునీల్ బలుసు నిర్మిస్తుండగా, అంజనీశ్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీకి టైటిల్, విడుదల తేదీని ప్రకటించాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.