India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
టీ20 వరల్డ్ కప్ ట్రోఫీ కోసం వివిధ దేశాలు తలపడగా టీమ్ఇండియా ఫైనల్‌లో గెలిచి విశ్వవిజేతగా నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఒరిజినల్ ట్రోఫీని కేవలం ఫొటో షూట్ కోసం మాత్రమే అందిస్తారట. విజేతలు తమ దేశానికి తీసుకెళ్లేందుకు అచ్చం అలాంటిదే ఇయర్, ఈవెంట్ లోగోతో డూప్లికేట్ సిల్వర్‌వేర్ ట్రోఫీని ICC తయారుచేసి అందిస్తుంది. ఒరిజినల్ ట్రోఫీ దుబాయ్‌లోని ఐసీసీ ప్రధాన కార్యాలయంలోనే ఉంటుంది.
TG: CM రేవంత్ సూచన మేరకు సైబర్ నేరాలు, డ్రగ్స్ అరికట్టడంలో తమ వంతు బాధ్యత నిర్వర్తిస్తామని తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి(TFCC) అధ్యక్షుడు దిల్ రాజ్ తెలిపారు. నటులు, దర్శకులు, నిర్మాతలు, పంపిణీదారులు, థియేటర్ల యజమానులు ప్రభుత్వానికి అండగా ఉంటారని స్పష్టం చేశారు. త్వరలోనే ఆయా విషయాలపై చర్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తామని దిల్‌రాజు వివరించారు.
TG: రాబోయేది BRS ప్రభుత్వమేనని కేసీఆర్ అన్నారు. తనను కలిసేందుకు ఎర్రవెల్లి నివాసానికి వచ్చిన కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. ‘ప్రజాస్వామ్యంలో అధికారం, ప్రతిపక్షం శాశ్వతం కాదు. ప్రజా తీర్పే మనకు శిరోధార్యం. అధికారం కోల్పోయామని బాధపడడం సరైన రాజకీయ నాయకుడి లక్షణం కాదు. ప్రజా సంక్షేమం కోసం కొనసాగే నిరంతర ప్రక్రియే రాజకీయం. దానికి గెలుపు ఓటములతో సంబంధం ఉండదు’ అని వ్యాఖ్యానించారు.
బంగ్లాదేశ్ సీనియర్ ప్లేయర్ మహ్మదుల్లా రియాద్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పారు. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. కాగా 38 ఏళ్ల మహ్మదుల్లా ఇప్పటివరకు 50 టెస్టులు, 232 వన్డేలు, 138 టీ20లు ఆడారు. అన్ని ఫార్మాట్లలో కలిపి 10,000కుపైగా రన్స్ సాధించారు. 150కిపైగా వికెట్లు పడగొట్టారు. కాగా మహ్మదుల్లా 2007లో శ్రీలంకపై తన తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడారు.
ప్రధాని మోదీ ఈనెల 8-10 తేదీల మధ్య రష్యా, ఆస్ట్రియా దేశాల్లో పర్యటించనున్నారు. 8, 9 తేదీల్లో మోదీ రష్యాలో పర్యటిస్తారని విదేశాంగ శాఖ వెల్లడించింది. ఆ రెండు రోజులు ఇరు దేశాధినేతలు ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొంటారు. ఆ మర్నాడు మోదీ ఆస్ట్రియాలో పర్యటించనున్నారు. ఆ దేశ నేతలతో ఇరు దేశాల బంధం బలోపేతంపై చర్చలు జరపనున్నారు. ఈ పర్యటన సందర్భంగా మోదీ ఇరు దేశాల్లోని భారతీయులతో ముచ్చటించే అవకాశం ఉంది.
ఈ ఏడాది జూన్ నెలకు గాను ప్లేయర్ ఆఫ్ ది మంత్ నామినీలను ఐసీసీ ప్రకటించింది. భారత ప్లేయర్లు రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రాతో పాటు అఫ్గాన్ బ్యాటర్ గుర్బాజ్ ఈ అవార్డ్‌కు నామినేట్ అయ్యారు. టీ20 WCలో గుర్బాజ్ 281 రన్స్‌తో (124SR) టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచారు. ఇదే టోర్నీలో రోహిత్ శర్మ 257 రన్స్‌తో(156SR), బుమ్రా 15 వికెట్లతో రాణించి భారత్‌కు WC రావడంలో కీలక పాత్ర పోషించారు.
TG: రాష్ట్ర ప్రయోజనాల కోసమే PM మోదీని CM రేవంత్, తాను కలిసినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. మోదీతో భేటీ అనంతరం మాట్లాడుతూ ‘రాష్ట్రానికి 25 లక్షల ఇళ్లు, ITIR ప్రాజెక్టు పునరుద్ధరణ, జిల్లాకొక నవోదయ స్కూల్, IIM మంజూరుపై PMకి వినతిపత్రం అందజేశాం. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి కృషి చేయాలని, వేలం లేకుండా సింగరేణికి బొగ్గు గనులు కేటాయించాలని కోరాం’ అని వెల్లడించారు.
AP: జైల్లో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కలిసేందుకు మాజీ సీఎం జగన్ రూ.25లక్షలు ఖర్చు చేశారని హోంమంత్రి అనిత ఆరోపించారు. ములాఖత్‌లు అయిపోయినా మానవతా దృక్పథంతో జగన్‌కు అనుమతి ఇచ్చామని తెలిపారు. కానీ ఆయన ఘర్షణ వాతావరణం సృష్టించాలని ప్రయత్నించారని, జైలు నుంచి బయటకు వచ్చి మీడియాతో ఏదేదో మాట్లాడి వెళ్లిపోయారని అన్నారు. గత ప్రభుత్వం అక్రమంగా పెట్టిన కేసులపై విచారణ చేపడతామని పేర్కొన్నారు.
హైదరాబాద్‌లోని మియాపూర్ అత్యాచార ఘటనను జాతీయ మహిళా కమిషన్ సీరియస్‌గా తీసుకుంది. నిష్పక్షపాతంగా, వేగంగా విచారణ జరిపి మూడు రోజుల్లోగా నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ రాష్ట్ర డీజీపీకి ఛైర్‌పర్సన్ లేఖ రాశారు. మహిళపై ఆమె సహోద్యోగులు చేసిన సామూహిక అత్యాచారాన్ని కమిషన్ తీవ్రంగా ఖండించింది. బాధితురాలికి పరిహారం, ఉచిత వైద్యం అందించాలని ఆదేశించింది.
TG: లోక్‌సభ ఎన్నికల తర్వాత రాష్ట్రాభివృద్ధిపై పూర్తిస్థాయి దృష్టి పెట్టామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈమేరకు ప్రధాని, కేంద్రమంత్రులను కలిసినట్లు ఢిల్లీ పర్యటన సందర్భంగా చెప్పారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు రాజకీయాలకు అతీతంగా పనిచేస్తామని రేవంత్ స్పష్టం చేశారు.
Sorry, no posts matched your criteria.