India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: పోలవరం ప్రాజెక్టులో దెబ్బతిన్న డయాఫ్రం వాల్ స్థానంలో కొత్త నిర్మాణం చేపట్టాలని నిర్ణయించినట్లు కేంద్ర జలసంఘం ఛైర్మన్ కుష్విందర్ తెలిపారు. ఇది ఏ ప్రదేశంలో నిర్మించాలి? పాత నిర్మాణానికి ఎంతదూరంలో కట్టాలి? అనే అంశాలపై నివేదిక ఇవ్వాలని అంతర్జాతీయ నిపుణులను కోరారు. అధ్యయనం చేసి 2వారాల్లో మధ్యంతర రిపోర్టు ఇస్తామని వారు తెలిపారు. ఎగువ కాఫర్ డ్యామ్ పటిష్ఠంగానే ఉందని, లోపాలు లేవని పేర్కొన్నారు.
APలో అన్నిరకాల ప్రభుత్వ, ప్రైవేటు పరిధిలోని 245 ఇంజినీరింగ్ కాలేజీలు, డీమ్డ్ వర్సిటీల్లో 1,81,732 సీట్లకు AICTE ఆమోదం తెలిపింది. CSE, AI, డేటా సైన్స్, IT కోర్సుల్లోనే 1,37,194 సీట్లు ఉన్నాయి. ప్రైవేటు కాలేజీల్లో మొత్తంగా 1.65 లక్షల సీట్లు ఉండగా, ఇందులో 70% కన్వీనర్ కోటాలో, 30% యాజమాన్య కోటాలో భర్తీ చేస్తారు. కాగా ఈ ఏడాది కొత్తగా తిరుపతి, విశాఖలో 2 ఇంజినీరింగ్ కాలేజీలకు అనుమతి లభించింది.
NEETతో పాటు పలు పరీక్షల క్వశ్చన్ పేపర్ల లీకేజీలను నిరసిస్తూ నేడు దేశవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌కు వామపక్ష విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. SFI, AISF, PDSU వంటి యూనియన్లు పాఠశాలలు, కాలేజీలకు వెళ్లి బంద్ నోటీసులు కూడా ఇచ్చాయి. మరోవైపు TGలో నిరుద్యోగ సంఘాలు DSCని 45రోజులు వాయిదా, టెట్ నార్మలైజేషన్, జాబ్ క్యాలెండర్ ప్రకటన, గ్రూప్1 పోస్టుల్లో 1:100 నిష్పత్తి వంటి డిమాండ్లతో బంద్‌కు పిలుపునిచ్చాయి.
AP: మాజీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ నెల్లూరు వెళ్లనున్నారు. సెంట్రల్ జైలులో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో ఆయన ములాఖత్ అవుతారు. ఎన్నికల సమయంలో టీడీపీ ఏజెంట్, కారంపూడి సీఐపై దాడి కేసుల్లో పిన్నెల్లికి మాచర్ల సివిల్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే.
AP: డిప్యూటీ సీఎం, మంత్రి పవన్ కళ్యాణ్ తన నియోజకవర్గం పిఠాపురంలో స్థలం కొన్నారు. ఇల్లు, క్యాంప్ ఆఫీస్ నిర్మాణానికి 3.52 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. రెండు ఎకరాల్లో క్యాంపు కార్యాలయం, మిగిలిన స్థలంలో ఇల్లు నిర్మించుకొని పిఠాపురం వాస్తవ్యుడిగా ఉండనున్నారు. కాగా ఈ ప్రాంతంలో ఎకరం రూ.15-16లక్షలు పలుకుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే మరో పదెకరాల తోటలు జనసేన నేతలు కొనేందుకు సిద్ధమవుతున్నారట.
UPలోని హాథ్రస్‌లో భోలేబాబా ఆధ్యాత్మిక సభలో 121 మంది మృతి చెందడంతో ఆగ్రాలో నిర్వహించాల్సిన మరో రెండు సభలు రద్దయ్యాయి. షెడ్యూల్ ప్రకారం జులై 4 నుంచి 11 మధ్య సయాన్‌లో ఒక సభ, జులై 13 నుంచి 23 తేదీల మధ్య మరో సభ నిర్వహించాల్సి ఉంది. కాగా హాథ్రస్ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ప్రపంచ దేశాలు సైతం ఈ ఘటనపై స్పందించాయి.
TG: గ్రూప్1 మెయిన్స్ పరీక్షకు 1:50 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక ఉంటుందని TGPSC స్పష్టం చేసింది. 1:100 నిష్పత్తి సాధ్యం కాదని తేల్చి చెప్పింది. కాగా 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయాలని కొందరు అభ్యర్థులు ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. ఆ అభ్యర్థనలను పరిశీలించాలని TGPSCకి కోర్టు సూచించింది. సాధారణ పరిపాలనశాఖ జారీ చేసిన GO.55లోని నిబంధనల ప్రకారం ఆ అభ్యర్థనను తిరస్కరిస్తున్నట్లు TGPSC స్పష్టం చేసింది.
AP: ‘కల్కి’ సినిమా టికెట్ రేట్ల పెంపు విషయంలో CS, హోం శాఖ ముఖ్య కార్యదర్శి, నిర్మాత అశ్వినీదత్‌కు హైకోర్టు నోటీసులిచ్చింది. తొలుత 10 రోజుల పాటు ధరలు పెంచుకునేందుకు అనుమతిచ్చి, తర్వాత మరో 4 రోజులు పెంచారని ఓ వ్యక్తి పిటిషన్ వేశారు. ఆ 4రోజులు అధిక ధరలకు విక్రయించకుండా ఉత్తర్వులివ్వాలని కోరారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని అధికారులు, నిర్మాతను కోర్టు ఆదేశించింది. 10వ తేదీకి విచారణ వాయిదా వేసింది.
భారత్ క్రికెట్ అభిమానుల 17ఏళ్ల ఎదురుచూపులకు తెరపడింది. మొత్తానికి టీ20 వరల్డ్ కప్ కొద్ది క్షణాల క్రితం భారత గడ్డపై వాలింది. రోహిత్ సేనకు ఢిల్లీ విమానాశ్రయంలో అభిమానులు ఘనస్వాగతం పలికారు. టోర్నీ శనివారమే ముగిసినా ఫైనల్ జరిగిన బార్బడోస్‌లో తుపాను వల్ల భారత జట్టు రావడం ఆలస్యమైంది. కాగా ఈ రోజు సా.5 గంటలకు ముంబైలో ప్లేయర్లు రోడ్ షోలో పాల్గొంటారు. రాత్రి వాంఖడేలో BCCI భారత జట్టును సన్మానించనుంది.
TG: CM రేవంత్ ఈరోజు మ.1.30 గంటలకు PM మోదీతో పాటు హోంమంత్రి అమిత్ షాను సైతం కలిసే అవకాశముంది. త్వరలో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో CM ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లి, నిధులను కేటాయించాలని కోరారు. కాగా సీఎం రేవంత్‌తో పాటు డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క కూడా ఢిల్లీకి వెళుతున్నట్లు సమాచారం.
Sorry, no posts matched your criteria.