India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: బాసర ట్రిపుల్ ఐటీలో ప్రవేశానికి అర్హులైన వారి జాబితా విడుదలయింది. ఎంపికైన విద్యార్థులకు జులై 8, 9, 10 తేదీల్లో ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఒరిజినల్ సర్టిఫికెట్లతో రావాలని సూచించారు. మొత్తం 1,404 సీట్లు ఉండగా.. అత్యధికంగా సిద్దిపేట జిల్లా నుంచి 330, నిజామాబాద్ జిల్లా నుంచి 157 మంది ఎంపికయ్యారు. పూర్తి వివరాలకు https://www.rgukt.ac.in/ సైట్ చూడండి.
వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024 టోర్నీలో భారత్ శుభారంభం చేసింది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్ ఛాంపియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 3వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇంగ్లండ్ విధించిన 166 పరుగుల లక్ష్యాన్ని 7 వికెట్లు కోల్పోయి 19 ఓవర్లలో చేధించింది. రాబిన్ ఉతప్ప 50 పరుగులతో(32 బంతుల్లో, 4 ఫోర్లు, 2 సిక్సులు) చెలరేగారు. గుర్‌క్రీత్(33), నమన్ ఓజా(25) రాణించగా కెప్టెన్ యువరాజ్(2 రన్స్) నిరాశపర్చారు.
రష్యాతో తమ బంధం మునుపెన్నడూ లేనంత బలంగా ఉందని చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ పేర్కొన్నారు. కజకిస్థాన్‌లో జరుగుతున్న షాంఘై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్(SCO) సదస్సు సందర్భంగా ఇరువురు దేశాధ్యక్షులు కలుసుకున్నారు. ఈ సందర్భంగా పుతిన్‌ను తన పాత స్నేహితుడిగా జిన్‌పింగ్ అభివర్ణించారు. అంతర్జాతీయ పరిస్థితులు కుదుపులకు లోనవుతున్న నేపథ్యంలో ఇరు దేశాలు ఒకదానికొకటి సహకరించుకోవాలని ఆయన అభిలషించారు.
ఉద్యోగులకు వేతనాలు పెంచారనే కారణంతో దుకాణ యజమానులను మయన్మార్‌లోని సైనిక ప్రభుత్వం జైలుకు పంపించింది. ద్రవ్యోల్బణం పెరుగుతున్న వేళ ఇలా జీతాలు పెంచడం సమాజంతో అశాంతి నెలకొంటుందని సైన్యం భావిస్తోందట. వారి వ్యాపారాలను సైతం మూసివేయించి పలువురికి మూడేళ్ల జైలు శిక్ష విధించింది. కాగా 2021లో అక్కడి ఆంగ్‌సాన్ సూకీ ప్రభుత్వాన్ని సైన్యం కూలదోసింది. అప్పటి నుంచి దేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.
AP: ప్రత్యేక హోదా.. తీర్మానాలు చేస్తే వస్తే అంశం కాదని కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. అలా అయితే దేశంలోని అన్ని రాష్ట్రాలు తీర్మానాలు చేస్తాయన్నారు. హోదా అంశంపై ప్రధాని స్థాయిలో నిర్ణయం తీసుకోవాలన్నారు. బీహార్‌కు సైతం ఇదే వర్తిస్తుందన్నారు. ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకే గతంలో ప్రత్యేక హోదా స్థానంలో ప్యాకేజీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఆ నిధులతో AP అభివృద్ధికి కేంద్రం సిద్ధంగా ఉందన్నారు.
విదేశాల్లోని రెస్టారెంట్లలో భారతీయ వంటకాల పేర్ల చూసి పారిశ్రామికవేత్త హర్ష గొయొంక అవాక్కయ్యారు. ఆయన వెళ్లిన హోటల్‌లో సాంబార్ వడ పేరును ‘డంక్డ్ డోనట్’, ఇడ్లీని ‘డంక్డ్ రైస్ కేక్’, దోశను ‘నేకెడ్ క్రీప్’గా మార్చేశారు. ‘వడ, ఇడ్లీ, దోశలు ఇంత ఫ్యాన్సీగా మారుతాయని ఎవరికి తెలుసు’ అని ఆయన ఫన్నీ ట్వీట్ చేశారు. కాగా ప్లేట్ సాంబార్ వడ ధర రూ.1300, ఇడ్లీ రూ.1200 ఉండటం చూసి నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు.
1897: స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామ రాజు జననం
1898: మాజీ ప్రధాని గుల్జారీలాల్ నందా జననం
1933: ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కొణిజేటి రోశయ్య జననం
1961: మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం. కీరవాణి జననం
1902: తత్వవేత్త స్వామి వివేకానంద మరణం
1934: శాస్త్రవేత్త మేరీ క్యూరీ మరణం
1963: భారత జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య మరణం
నీట్ యూజీ పేపర్ లీకేజీ కేసులో మరో కీలక సూత్రధారి అమన్ సింగ్‌ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఝార్ఖండ్‌లోని ధన్‌బాద్‌లో అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఇప్పటికే హజారీబాగ్‌లోని ఒయాసిస్ స్కూల్ ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్‌తో పాటు మరో ఇద్దరిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. అక్కడ కాలిపోయిన నీట్ ప్రశ్నపత్రాలను బిహార్ పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
అసోం రాష్ట్రాన్ని వరదలు వణికిస్తున్నాయి. బ్రహ్మపుత్ర, దాని ఉపనదులు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. 23 జిల్లాలు వరద ప్రభావానికి గురి కాగా 2,90,000 మంది పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. ఇటు కజిరంగా నేషనల్ పార్క్, టైగర్ రిజర్వ్ కేంద్రాలు నీటిలో మునిగిపోయాయి. దీంతో వన్యప్రాణులు అల్లాడుతున్నాయి. ఒక రైనో సహా 8 జంతువులు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.
AP: సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదిగా ప్రమోద్‌ను నియమిస్తూ గవర్నమెంట్ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే గుజ్జర్లపూడి రాజు, దిలీప్ కుమార్, నాగరాజు, సోమరెడ్డి కృష్ణారెడ్డి, వెంకట సాయికృష్ణలను ప్రభుత్వ ప్లీడర్లుగా నియమించింది. మరో 14 మందిని అసిస్టెంట్ ప్లీడర్లుగా నియమించింది.
Sorry, no posts matched your criteria.