news

News October 30, 2024

ప్రభుత్వాన్ని విమర్శించడమే ప్రతిపక్షాల పని: మంత్రి కోమటిరెడ్డి

image

TG: తమ ప్రభుత్వం వచ్చిన కొన్ని నెలల్లోనే వేల ఉద్యోగాలు భర్తీ చేసిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో తాము బలహీనవర్గాలకు ప్రాధాన్యం కల్పించామన్నారు. ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నాయని దుయ్యబట్టారు. బీసీ కులగణన హామీకి కట్టుబడి ఉన్నామని చెప్పారు.

News October 30, 2024

నాగార్జున యూనివర్సిటీకి ESI నోటీసులు

image

AP: నాగార్జున యూనివర్సిటీకి ఈఎస్ఐ జప్తు నోటీసులు ఇచ్చింది. ఉద్యోగుల ESI నిధులు దారి మళ్లించడంతో వర్సిటీ అకౌంట్ నుంచి సదరు మొత్తం రూ.28 లక్షలు తీసుకుంటామని జప్తు నోటీసుల్లో పేర్కొంది. ఉద్యోగులకు చెందిన ఈఎస్ఐ సొమ్మును ఔట్ సోర్సింగ్ సంస్థ వాడుకుందని ఈఎస్ఐ గతంలో డిమాండ్ నోటీసులు ఇచ్చింది. అయితే ఈ నోటీసులపై వర్సిటీ నుంచి స్పందన లేకపోవడంతో ఈ నెల 24న జప్తు నోటీసులిచ్చింది.

News October 30, 2024

JIO SMART GOLD: రూ.10తోనే పెట్టుబడి పెట్టొచ్చు

image

జియో ఫైనాన్స్ డిజిటల్ గోల్డ్ సేవలను ఆరంభించింది. తమ యాప్‌లోని స్మార్ట్‌గోల్డ్ ఆప్షన్ ద్వారా ఇన్వెస్ట్ చేయొచ్చని తెలిపింది. కనీస పెట్టుబడి రూ.10గా పేర్కొంది. ‘కస్టమర్లకు స్మార్ట్‌గోల్డ్ డిజిటల్, సేఫ్, సెక్యూర్ సేవలు అందిస్తుంది. నగదు, గోల్డ్ కాయిన్స్, నగల రూపంలోకి రిడీమ్ చేసుకోవచ్చు. గోల్డ్‌ను ఇంటికే డెలివరీ చేస్తాం’ అని తెలిపింది. Paytm, PhonePe సైతం ఈ సర్వీసెస్ అందిస్తున్న సంగతి తెలిసిందే.

News October 30, 2024

ట్రెండింగ్‌లో ‘బాయ్‌కాట్ సాయిపల్లవి’

image

సాయి పల్లవి <<14456841>>గతంలో చేసిన వ్యాఖ్యల వీడియో<<>> ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 12వేలకు పైగా పోస్టులతో బాయ్‌కాట్ సాయిపల్లవి అన్న హాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కథ ఆధారంగా తన తాజా సినిమా అమరన్ తెరకెక్కిన నేపథ్యంలో ఆమె ఢిల్లీలోని అమరవీరుల స్మారక స్తూపాన్ని సందర్శించారు. సినిమా ప్రమోషన్స్‌ కోసం వార్ మెమోరియల్ వాడుకున్నారంటూ ఆ చర్య కూడా వివాదాస్పదమైంది.

News October 30, 2024

నూతన ఏపీ భవన్ నిర్మాణానికి టెండర్లు

image

ఢిల్లీలో నూతన ఏపీ భవన్‌ను నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రీ డెవలప్‌మెంట్ ఆఫ్ ఏపీ భవన్ పేరుతో డిజైన్లకు టెండర్లను పిలిచింది. 11.53 ఎకరాల్లో నిర్మాణం చేపట్టనుంది. ప్రస్తుతం ఉన్న భవనాలను రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి వినియోగించుకుంటున్నాయి. అయితే ఎన్నికలకు ముందు ఇరు రాష్ట్రాల అధికారులు భవన్ విభజనను ఖరారు చేసుకుని ప్రతిపాదనలు పంపగా కేంద్ర హోం శాఖ ఆమోదం తెలిపింది.

News October 30, 2024

పరువు నష్టం కేసు విచారణ వాయిదా

image

TG: మంత్రి సురేఖ‌పై KTR వేసిన పరువునష్టం దావాపై విచారణను కోర్టు నవంబర్ 13కు వాయిదా వేసింది. నాంపల్లి కోర్టు మెజిస్ట్రేట్ సెలవులో ఉండటంతో ఇన్‌ఛార్జి జడ్జి పిటిషన్ విచారణను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. కాగా నాగచైతన్య-సమంత విడాకులకు కేటీఆర్‌ ఓ కారణం అంటూ కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తన పరువుకు నష్టం కలిగించాయని KTR ఈ దావా వేసిన విషయం తెలిసిందే. నాగార్జున వేసిన పిటిషన్‌పైనా విచారణ వాయిదా పడింది.

News October 30, 2024

కన్నడ నటుడు దర్శన్‌కి మధ్యంతర బెయిల్

image

కన్నడ నాట సంచలనం సృష్టించిన రేణుకాస్వామి హత్య కేసులో నిందితుడైన నటుడు దర్శన్‌కు మధ్యంతర బెయిల్ లభించింది. వెన్నెముక శస్త్రచికిత్స కోసం బెయిల్ ఇవ్వాలని ఆయన కోరడంతో న్యాయస్థానం అంగీకరించింది. 6 వారాల మధ్యంతర బెయిల్ ఇచ్చింది. మరోవైపు రెగ్యులర్ బెయిల్ కోసం దర్శన్ పిటిషన్ దాఖలు చేశారు. కాగా రేణుకా స్వామి మర్డర్ కేసులో జూన్ 11న దర్శన్ అరెస్టయిన సంగతి తెలిసిందే.

News October 30, 2024

CM రేవంత్‌ కామెంట్స్‌పై స్పందించిన KTR

image

TG: KCRపై CM రేవంత్‌ <<14482748>>వ్యాఖ్యలపై<<>> KTR స్పందించారు. ‘నువ్వు చెప్పులు మోసిననాడు ఆయన ఉద్యమానికి ఊపిరిపోశాడు. నువ్వు పదవుల కోసం పరితపిస్తున్ననాడు ఆయన తన పదవిని తృణప్రాయంగా వదిలాడు. నువ్వు ఉద్యమకారుల మీద గన్ను ఎక్కుపెట్టిననాడు ఆయన ఉద్యమానికి తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు. నువ్వు బ్యాగులు మోస్తున్నప్పుడు ఆయన తెలంగాణ భవిష్యత్తుకు ఊపిరి పోశాడు. నువ్వా KCR పేరు తుడిచేది?’ అని KTR ట్వీట్ చేశారు.

News October 30, 2024

రేషన్ కార్డుదారులకు శుభవార్త?

image

AP: నవంబర్ నెల నుంచి రేషన్‌లో నాలుగు రకాల సరుకులు అందించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బియ్యంతో పాటు పంచదార, కందిపప్పును సబ్సిడీపై అందిస్తున్నారు. అక్టోబర్‌లో 50శాతం కార్డుదారులకు కందిపప్పు అందించగా NOV నుంచి 100% అందేలా చర్యలు తీసుకున్నట్లు సమాచారం. మార్కెట్‌లో దీని ధర రూ.170 వరకు ఉండగా రేషన్‌లో రూ.67కే ఇస్తున్నారు. ఇటు బియ్యం వద్దనుకునే వారికి 3KGల జొన్నలు సైతం అందించనున్నట్లు తెలుస్తోంది.

News October 30, 2024

లీవ్ ఇవ్వని ఉన్నతాధికారి.. బిడ్డను కోల్పోయిన ఉద్యోగి

image

ఉన్నతాధికారి నిర్దయ కారణంగా ఓ ఉద్యోగి కడుపులోని బిడ్డను కోల్పోయిన ఘటన ఒడిశాలోని కేంద్రపరా జిల్లాలో జరిగింది. ప్రియదర్శిని అనే 7 నెలల గర్భిణికి ఆఫీసులో కడుపు నొప్పి వచ్చింది. తనను ఆస్పత్రికి తీసుకెళ్లాలని, కనీసం సెలవు ఇవ్వాలని CDPOను కోరినా పట్టించుకోలేదు. సాయంత్రం ఆస్పత్రికి వెళ్లగా అప్పటికే బిడ్డ చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు జిల్లా మేజిస్ట్రేట్ వెల్లడించారు.