news

News July 3, 2024

వైఎస్ జగన్ కేసులపై రోజువారీ విచారణ: హైకోర్టు

image

TG: సీబీఐ కోర్టులో ఉన్న ఏపీ మాజీ సీఎం జగన్ కేసులపై రోజువారీ విచారణ జరగాలని తెలంగాణ హైకోర్టు తాజాగా ఆదేశించింది. ఆ కేసుల అంశంపై మాజీ మంత్రి హరిరామజోగయ్య గతంలో తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. తాజాగా ఆ పిటిషన్‌ను విచారించిన సందర్భంగా ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. చాలా కేసులున్న కారణంగా వీలైనంత త్వరగా విచారణను పూర్తి చేయాలని సూచించింది.

News July 3, 2024

గోల్డ్ మెడల్‌తో పంత్ పోస్ట్.. అక్షర్, సిరాజ్ కామెంట్స్ వైరల్!

image

టీ20 వరల్డ్ కప్-2024 ట్రోఫీని గెలుపొందిన క్రమంలో గోల్డ్ మెడల్‌తో దిగిన ఫొటోను టీమ్ఇండియా ప్లేయర్ రిషభ్ పంత్ ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ‘ఈ మెడల్ మీకు అద్భుతమైన అనుభూతిని అందిస్తుంది’ అని చెప్పుకొచ్చారు. అయితే, ఇలాంటి మెడల్ తమ దగ్గర కూడా ఉందని అక్షర్ పటేల్‌తో పాటు మహ్మద్ సిరాజ్‌ కామెంట్స్ చేశారు. వీరంతా ఒకే హోటల్‌లో ఉండి ఇలా చేస్తున్నారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

News July 3, 2024

ఈ నెల 8 నుంచి ఉచితంగా ఇసుక: CM

image

AP: ఈ నెల 8 నుంచి ఉచిత ఇసుక విధానం అమల్లోకి తేవాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఈ మేరకు చర్యలు చేపట్టాలని మంత్రి కొల్లు రవీంద్రకు ఆదేశాలు జారీ చేశారు. లోడింగ్, రవాణా ఛార్జీలు నిర్ణయించేందుకు కలెక్టర్ల అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేయనున్నారు. ఉచిత ఇసుక విధానంపై పూర్తి వివరాలను మంత్రి కొల్లు రవీంద్ర సాయంత్రం మీడియాకు వివరించనున్నారు.

News July 3, 2024

పారిస్ డైమండ్ లీగ్‌లో పాల్గొనకపోవడంపై నీరజ్ రియాక్షన్ ఇదే..

image

పారిస్ డైమండ్ లీగ్ నుంచి తప్పుకున్నారనే ప్రచారాన్ని జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఖండించారు. తన సీజన్ క్యాలెండర్‌లో ఈ లీగ్ లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఒలింపిక్స్‌కు సన్నద్ధమవడంపై ఫోకస్ చేసినట్లు పేర్కొన్నారు. అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ధన్యవాదాలు తెలిపారు. పోటీలో ఉన్న అథ్లెట్లకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ నెల 26 నుంచి పారిస్ ఒలింపిక్స్ ప్రారంభం కానున్నాయి.

News July 3, 2024

ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ వాయిదా

image

TG: పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని దాఖలైన పిటిషన్లపై విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ కోరిన సంగతి తెలిసిందే.

News July 3, 2024

కాంగ్రెస్ బెదిరింపులకు భయపడం: హరీశ్ రావు

image

TG: ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం క్రిమినల్ కేసులు పెట్టడం దుర్మార్గమని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. కాంగ్రెస్ బెదిరింపులకు తాము భయపడమని ఆయన అన్నారు. ‘పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసును ఖండిస్తున్నాం. ప్రజల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడమే ఆయన చేసిన నేరమా? అక్రమ కేసులను చట్టపరంగా ఎదుర్కొంటాం. ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ పోరాటం కొనసాగిస్తుంది’ అని ఆయన పేర్కొన్నారు.

News July 3, 2024

హాథ్రస్‌ ఘటన కేసులో మరిన్ని విషయాలు!

image

UPలోని హాథ్రస్‌లో జరిగిన విషాద ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. ముఖ్య నిర్వాహకుడు దేవప్రకాశ్‌తో పాటు మరికొందరిపై BNSలోని హత్యానేరం తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. భోలే బాబాను అరెస్ట్ చేసే అంశంపై ఆ రాష్ట్ర DGP ప్రశాంత్ కుమార్ స్పందించారు. దర్యాప్తులో ఉన్న సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని చెప్పారు. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం 2 లక్షల మందికి బందోబస్తుగా 40+ మంది పోలీసులే విధుల్లో ఉన్నారట.

News July 3, 2024

నాసిరకం విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు: చంద్రబాబు

image

AP: అనుమతి లేని, నాసిరకం విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఖరీఫ్ సీజన్ కార్యాచరణపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా పంటల సాగులో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సహకార సంఘాల ద్వారా ఎరువుల పంపిణీకి ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ఖరీఫ్‌లో 4 లక్షల భూసార పరీక్షలు చేయాలని సూచించారు.

News July 3, 2024

‘35 చిన్న కథ కాదు’ మూవీ టీజర్ అప్డేట్

image

నివేదా థామస్, విశ్వదేవ్, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో ‘35 చిన్న కథ కాదు’ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ టీజర్‌ ఇవాళ సాయంత్రం 6 గంటలకు విడుదల కానుంది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ ‘ఇదో, మా సిన్న కుటుంబం తొలి సూపు’ అని హీరోయిన్ నివేదా ట్వీట్ చేశారు. డైరెక్టర్ నంద కిశోర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఆగస్టు 15న విడుదల కానుంది. హీరో రానా సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.

News July 3, 2024

సభను కాదు, మర్యాదను విడిచి వెళ్లారు: ధన్‌ఖడ్

image

రాజ్యసభలో ప్రధాని మోదీ ప్రసంగానికి అడ్డుతగిలి, సభ నుంచి వాకౌట్ చేసిన విపక్ష సభ్యులపై రాజ్యసభ ఛైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖడ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘సభలో వారు అమర్యాదగా ప్రవర్తిస్తున్నారు. విపక్ష నేతలు సభను కాదు. మర్యాదను విడిచి వెళ్లారు. ప్రజాస్వామ్యాన్ని అవమానించారు. రాజ్యాంగ స్ఫూర్తిని కాలరాస్తున్నారు. రాజ్యాంగం అనేది చేతిలో పుస్తకం కాదు.. జీవితానికి మార్గనిర్దేశం’ అని వ్యాఖ్యానించారు.