news

News July 3, 2024

వెంకటేశ్ కొత్త సినిమాలో ఇద్దరు హీరోయిన్లు

image

విక్టరీ వెంకటేశ్, అనిల్ రావిపూడి కాంబోలో రాబోతున్న సినిమాలో ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించనున్నారు. ఈ విషయాన్ని మూవీ టీమ్ తాజాగా ప్రకటించింది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ మూవీ పూజా కార్యక్రమం రేపు జరగనుంది. వెంకీ మామ, డైరెక్టర్ అనిల్ కలిసి ఇప్పటికే ఎఫ్-2, ఎఫ్-3 సినిమాలు చేసిన సంగతి తెలిసిందే.

News July 3, 2024

నేడు మోదీ, అమిత్ షాతో చంద్రబాబు భేటీ

image

AP: సీఎం చంద్రబాబు నేడు ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నారు. నిన్న రాత్రి ఆయన ఢిల్లీ చేరుకున్నారు. చంద్రబాబు వెంట మంత్రులు పయ్యావుల, జనార్దన్ రెడ్డి, నిమ్మల రామానాయుడు హస్తినకు వెళ్లారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కేంద్ర పెద్దలకు CM చంద్రబాబు వివరించనున్నారు. పారిశ్రామిక రాయితీలు, పలు ప్రాజెక్టులు, పథకాలకు నిధులివ్వాలని కోరనున్నారు. పలువురు కేంద్రమంత్రులతో సీఎం భేటీ అవుతారు.

News July 3, 2024

ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డిపై కేసు నమోదు

image

AP: సాయిబాబా పాఠశాలల ఛైర్మన్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డిపై కేసు నమోదైంది. కడప జిల్లా అక్కాయపల్లిలోని సాయిబాబా పాఠశాలలో పైకప్పు పెచ్చులూడి మీద పడటంతో ఆరుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. దీంతో వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. యజమాన్యం నిర్లక్ష్యం వల్లే పైకప్పు కూలిందని పోలీసులు ఎమ్మెల్సీపై కేసు నమోదు చేశారు.

News July 3, 2024

త్వరలో జిల్లాల పర్యటన: సీఎం రేవంత్

image

TG: సీఎం రేవంత్ రెడ్డి త్వరలో జిల్లాల పర్యటన చేపట్టనున్నారు. ఈ మేరకు ఉన్నతాధికారులతో సమావేశంలో వెల్లడించారు. వారానికో జిల్లా పర్యటన ఉండేలా షెడ్యూల్‌ని త్వరలో విడుదల చేస్తామన్నారు. పథకాలు, అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తానని చెప్పారు. చాలా జిల్లాల్లో కలెక్టర్లు ఆఫీసులు దాటడం లేదని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులంతా క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లేలా చూడాలని సీఎస్‌ను ఆదేశించారు.

News July 3, 2024

పుష్ప2: భారీ యాక్షన్ సీక్వెన్స్ షూట్‌కు రెడీ!

image

హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న పుష్ప-2 మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ సినిమా కొత్త షెడ్యూల్ హైదరాబాద్ శివార్లలోని ఓ ప్రముఖ స్టూడియోలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను ఇక్కడ తెరకెక్కించనున్నారట. సినిమాలో ఇది క్లైమాక్స్‌లో రానుందని సమాచారం. కాగా చిత్రాన్ని డిసెంబర్ 6న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు.

News July 3, 2024

జులై 3: చరిత్రలో ఈరోజు

image

1918: ప్రముఖ తెలుగు సినిమా నటుడు ఎస్వీ రంగారావు జననం
1931: హాస్య నటి సురభి బాలసరస్వతి జననం
1962: హాలీవుడ్ నటుడు టామ్ క్రూజ్ జననం
1980: భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు హర్భజన్ సింగ్ జననం
2015: రచయిత, స్వాతంత్ర్య సమరయోధుడు తెన్నేటి విద్వాన్ మరణం
అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినోత్సవం

News July 3, 2024

నిద్ర పోయాడు.. మ్యాచ్‌కు దూరమయ్యాడు..!

image

బంగ్లాదేశ్ వైస్ కెప్టెన్ తస్కిన్ అహ్మద్ వింత కారణంతో ఇండియాతో జరిగిన T20WC మ్యాచ్‌కు దూరమయ్యారు. అతి నిద్ర కారణంగా ఆయన మ్యాచ్‌ ఆడలేకపోయారు. మ్యాచ్ జరిగే రోజు తస్కిన్ బస్సు వచ్చినా నిద్ర పోతూనే ఉన్నారు. ఆ తర్వాత మరో వాహనంలో స్టేడియానికి వచ్చినా ఫలితం లేకుండా పోయింది. అప్పటికే బంగ్లా జట్టును ప్రకటించారు. దీంతో ఆయన మ్యాచ్‌కు అందుబాటులో లేకుండా పోయారు. ఆయన స్థానంలో మెహదీ హసన్‌ను ఆడించారు.

News July 3, 2024

ఈరోజు నమాజ్ వేళలు

image

తేది: జులై 03, బుధవారం
ఫజర్: తెల్లవారుజామున 4:25 గంటలకు
సూర్యోదయం: ఉదయం 5:46 గంటలకు
జొహర్: మధ్యాహ్నం 12:20 గంటలకు
అసర్: సాయంత్రం 4:57 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6:55 గంటలకు
ఇష: రాత్రి 8.16 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు

News July 3, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News July 3, 2024

రైతు భరోసాపై మంత్రులతో సబ్‌కమిటీ ఏర్పాటు

image

AP: రైతు భరోసాపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ సబ్‌కమిటీకి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఛైర్మన్‌‌గా వ్యవహరించనున్నారు. కమిటీలో సభ్యులుగా మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరావు ఉన్నారు. రైతు భరోసా పథకం విధివిధానాలపై మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సు చేయనుంది.