news

News July 3, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News July 3, 2024

శుభ ముహూర్తం

image

తేది: జులై 03, బుధవారం
ద్వాదశి: ఉదయం 07.04 గంటలకు
రోహిణి: తెల్లవారుజామున 4.39 గంటలకు
దుర్ముహూర్తం: ఉదయం 11:37- 12:30 గంటల వరకు
రాహుకాలం: మధ్యాహ్నం 12:00 – 01:30 గంటల వరకు

News July 3, 2024

ఇంటెలిజెన్స్ చీఫ్‌గా మహేశ్ చంద్ర లడ్డా

image

ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా మహేశ్ చంద్ర లడ్డాను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1998 ఐపీఎస్ బ్యాచ్ ఏపీ క్యాడర్‌కు చెందిన మహేశ్ చంద్ర ప్రస్తుతం సీఆర్పీఎఫ్ ఐజీగా పని చేస్తున్నారు. రాష్ట్ర సర్వీసులోకి ఆయనను పంపాలన్న సీఎం చంద్రబాబు విజ్ఞప్తి మేరకు కేంద్రం ఆయనను రిలీవ్ చేసింది. కాగా ప్రస్తుత ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ కుమార్ విశ్వజిత్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది.

News July 3, 2024

HEADLINES TODAY

image

☛ యూపీ: హాథ్రస్‌లో తొక్కిసలాట.. 116మంది మృతి
☛ హిందువులపై రాహుల్ వ్యాఖ్యల్ని దేశం ఎన్నటికీ క్షమించదు: PM మోదీ
☛ TGSRTCలో 3035 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్
☛ చంద్రబాబుతో భేటీకి సీఎం రేవంత్ సుముఖత
☛ డ్రగ్స్ నియంత్రణలో సినీ పరిశ్రమ కీలకంగా వ్యవహరించాలి: CM రేవంత్
☛ AP: పలు జిల్లాల కలెక్టర్ల బదిలీలు
☛ AP: రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు

News July 2, 2024

బాబర్ ఆజం ఓ స్వార్థపరుడు: పార్థివ్

image

పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం సెల్ఫిష్ ఆటగాడని భారత మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్ అభిప్రాయపడ్డారు. అతడికి స్వప్రయోజనాలే ఎక్కువని పేర్కొన్నారు. ‘పాక్‌కు ఫఖార్ జమాన్ ఉన్నా, అతడి స్థానంలో బాబర్ ఓపెనర్‌గా వచ్చారు. చాలా తప్పుడు నిర్ణయమది. పోనీ జమాన్‌ను వన్‌ డౌన్‌లో అయినా పంపలేదు. పాక్ జట్టులో అసలు టీ20 ఆటగాళ్లే లేరు. పలు ఇంటర్నేషనల్ టీమ్స్‌కంటే వారు చాలా వెనుకబడి ఉన్నారు’ అని స్పష్టం చేశారు.

News July 2, 2024

గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు మరో బాధ్యత!

image

AP: గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులతో పెన్షన్లు పంపిణీ చేయిస్తోన్న ప్రభుత్వం వారికి మరో బాధ్యత అప్పగించనుంది. విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పించేందుకు తీసుకొచ్చిన స్కిల్ సెన్సెస్ కార్యక్రమంలో వారిని భాగస్వాములను చేయాలని భావిస్తోంది. APSSDC, పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఇంటింటి సర్వే అవకాశాలపై మంత్రి లోకేశ్ అధికారులతో చర్చించారు.

News July 2, 2024

మృతదేహాలను చూసి గుండెపోటు.. కానిస్టేబుల్ మృతి

image

యూపీ హాథ్రస్ జిల్లాలో జరిగిన తొక్కిసలాటలో 116 మంది మరణించడంతో ఎక్కడ చూసినా శవాల కుప్పలే కనిపిస్తున్నాయి. అక్కడి ఎటా మెడికల్ కాలేజీలో నేలపై పడి ఉన్న మృతదేహాలను చూసి 30 ఏళ్ల పోలీస్ కానిస్టేబుల్ రజనీశ్ గుండెపోటుతో మరణించాడు. అతడిని క్విక్ రెస్పాన్స్ టీమ్(QRT)లో డ్యూటీ కోసం అత్యవసరంగా పిలిపించారు. పదుల సంఖ్యలో మృతదేహాలను చూసి తట్టుకోలేక గుండెపోటుకు గురై ప్రాణాలను వదిలాడు.

News July 2, 2024

షారూఖ్‌కు అరుదైన గౌరవం

image

బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్‌కు అరుదైన గౌరవం లభించింది. స్విట్జర్లాండ్‌లో జరిగే లోకర్నో ఫిల్మ్ ఫెస్టివల్ జ్యూరీ ఆయన్ను జీవితకాల సాఫల్య పురస్కారానికి ఎంపిక చేసింది. సోషల్ మీడియాలో ఈ విషయాన్ని ప్రకటించింది. ఆయనో సూపర్ స్టార్ అని.. హీరోగా, ప్రొడ్యూసర్‌గా భారత సినీ పరిశ్రమపై తనదైన ముద్ర వేశారని ప్రశంసలు కురిపించింది. వచ్చే నెల 7 నుంచి 17 వరకు స్విట్జర్లాంట్‌లో ఈ వేడుక జరగనుంది.

News July 2, 2024

మెగా టోర్నీల్లో పరుగుల వీరులు వీరే..

image

భారత్ ఐసీసీ ట్రోఫీలు గెలిచినప్పుడు టీమ్ ఇండియా తరఫున అత్యధిక స్కోర్ చేసింది వీరే..
1983 వన్డే WC- కపిల్ దేవ్ (303)
2007 టీ20 WC- గౌతమ్ గంభీర్ (227)
2011 వన్డే WC- సచిన్ టెండూల్కర్ (482)
2013 ఛాంపియన్స్ ట్రోఫీ- శిఖర్ ధవన్ (363)
2024 టీ20 WC- రోహిత్ శర్మ (257)

News July 2, 2024

ఉడత భక్తిగా సమాజానికి సేవ చేసుకుంటాను: మోహన్ బాబు

image

TG: రాష్ట్ర ముఖ్యమంత్రి పిలుపు మేరకు తాను డ్రగ్స్‌పై అవగాహన వీడియోలు చేయనున్నట్లు నటుడు మోహన్ బాబు ట్విటర్‌లో తెలిపారు. ‘సినీ నటీనటులు 1, 2 నిమిషాల నిడివిలో వీడియో తీసి ప్రభుత్వానికి పంపమన్నారు. ఇంతకు ముందే ఇలాంటివి నేను కొన్ని చేశాను. అయితే సీఎం ఆదేశాల మేరకు సందేశాత్మకమైన వీడియోలు కొన్నింటిని చేసి ఉడత భక్తిగా సమాజానికి సేవ చేసుకుంటానని తెలియజేస్తున్నాను’ అని ట్వీట్ చేశారు.