India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తోన్న పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘మట్కా’ నుంచి స్పెషల్ పోస్టర్ విడుదలైంది. 15 రోజుల్లో సినిమా రిలీజ్ అవుతుందని తెలియజేస్తూ రెట్రో లుక్‌లో వరుణ్, మీనాక్షిల బ్లాక్ అండ్ వైట్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ‘మట్కా’ మూవీ నవంబర్ 14న ఐదు భాషల్లో థియేటర్లలో రిలీజ్ కానుంది.
దీపావళి సందర్భంగా చాలామంది స్వీట్లు ఆరగిస్తుంటారు. స్వీట్లపై ఉండే సిల్వర్‌పూతలో కొన్నిసార్లు కల్తీ జరిగే అవకాశం ఉంది. ఆ కల్తీని గుర్తిస్తే అనారోగ్య సమస్యల నుంచి బయటపడొచ్చు. స్వీట్‌పై ఉన్న సిల్వర్ పేపర్ కల్తీదో లేదో తెలుసుకునేందుకు కాస్త సిల్వర్ పొరను తీసుకొని రెండు వేళ్లతో రబ్ చేయండి. అది పౌడర్‌గా మారితే అది స్వచ్ఛమైంది. చిన్నచిన్న ముక్కలుగా మారిందంటే అది అల్యూమినియంతో కల్తీ జరిగిందని అర్థం.
బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే మోడల్ వాకర్ బ్లాంకోతో రిలేషన్‌షిప్‌లో ఉన్నారని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే దానికి బలం చేకూర్చేలా ఆమె బాయ్‌ఫ్రెండ్ వాకర్ ఓ పోస్టు చేశారు. ఈరోజు అనన్య బర్త్ డే సందర్భంగా అతడు ఇన్‌స్టాలో ఆమెకు విషెస్ చెప్పారు. ‘హ్యాపీ బర్త్ డే బ్యూటిఫుల్. నువ్వెంతో స్పెషల్. ఐ లవ్ యూ ఆనీ’ అని ఆమె ఫొటోను పోస్టు చేశారు. అనన్య ‘లైగర్’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు.
TG: కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ‘కళ్యాణమస్తు’ హామీ ఏమైందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. మ్యానిఫెస్టోలో చెప్పినట్లుగా కూతురు పెళ్లి చేసిన నిరుపేద కుటుంబాలకు రూ.లక్ష సాయంతో పాటు తులం బంగారం ఎప్పుడు ఇస్తారో ధన త్రయోదశి రోజైనా ఇవాళ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. హ్యండ్ ఇచ్చిన హ్యండ్, హ్యండ్ బ్రేక్ ఆన్ ప్రోగ్రెస్ అంటూ హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చారు.
iOS యూజర్లకు గుడ్ న్యూస్. ఆండ్రాయిడ్ మాదిరిగా Apple iOS 18.1కు అప్డేట్ అయిన iPhone యూజర్లు ఇకపై కాల్ రికార్డింగ్ చేయొచ్చు. iPhone SE నుంచి iPhone 16 PRO MAX వరకు ఉన్న సిరీస్ ఫోన్లు మాత్రమే ఈ ఫీచర్‌కు సపోర్ట్ చేస్తాయి. కాల్ చేసేటపుడు లెఫ్ట్ సైడ్ పైన స్టార్ట్ కాల్ రికార్డింగ్ బటన్ ఉంటుంది. దాన్ని ట్యాప్ చేస్తే రికార్డింగ్ మొదలవుతుంది. కాల్ రికార్డ్ అవుతున్నట్లు ఇద్దరికీ ఆడియో నోట్ వినిపిస్తుంది.
భారత బంగారం నిల్వలు 854.73 మెట్రిక్ టన్నులని RBI తెలిపింది. స్వదేశంలో 510.46, విదేశాల్లో 324.01 మెట్రిక్ టన్నులు నిల్వ ఉంచినట్టు పేర్కొంది. మరో 20.26 టన్నులు గోల్డ్ డిపాజిట్ల రూపంలో ఉందని వెల్లడించింది. దీనిని లిక్విడిటీ, ఫైనాన్షియల్ సెక్యూరిటీకి సపోర్టుగా ఉంచుతామని తెలిపింది. 2024 మార్చి నాటికి విదేశీ మారకంలో 8.15గా ఉన్న బంగారం సెప్టెంబర్ నాటికి 9.32 శాతానికి పెరిగినట్టు వివరించింది.
యాక్టర్ సల్మాన్, MLA జీషన్ సిద్దిఖీని బెదిరించిన మహ్మద్ తయ్యబ్ (20) నోయిడాలో రోజుకూలీ అని ముంబై పోలీసులు చెప్పారు. అతడు వడ్రంగి పనిచేస్తాడన్నారు. అతడికి చెడు ఉద్దేశం లేదని, వెర్రితనంతో ఇలా చేశాడని ముదియా హఫీజ్‌లోని అతడి తల్లి అన్నారు. సరదాగా ఆ మెసేజులు పంపాడని అతడి సిస్టర్స్ చెప్పారు. పేద కుటుంబం నుంచి వచ్చిన తయ్యబ్‌ది రౌడీ క్యారెక్టరని, డాన్ కావాలన్నదే అతడి డ్రీమ్ అని నైబర్స్ చెప్తున్నారు.
కార్పొరేట్ సెక్టార్‌లో పొమ్మనలేక పొగబెట్టడం తరహాలో ఉద్యోగుల సైలెంట్ ఫైరింగ్ మొదలైనట్లు న్యూయార్క్ పోస్ట్ కథనం పేర్కొంది. ఉద్యోగులకు కఠిన టాస్కులు ఇవ్వడం, WFH తొలగించడంతో చాలా మంది జాబ్స్‌కు గుడ్ బై చెప్పేలా చేస్తున్నారంది. ఆ స్థానాలను AIతో భర్తీ చేస్తారని పేర్కొంది. అయితే మనుషులు చేసే అన్ని టాస్క్‌లను AI చేయలేదని, వచ్చే పదేళ్లలో 5% ఉద్యోగాలనే AI భర్తీ చేస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
భారత ప్లేయర్ సంజూ శాంసన్‌పై ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్ ప్రశంసలు కురిపించారు. అతడి బ్యాటింగ్ అద్భుతంగా ఉంటుందని కొనియాడారు. ‘భారత ఆటగాళ్లలో రోహిత్ శర్మ, గిల్, పంత్, విరాట్.. వీళ్లందరి ఆటా నాకు చాలా ఇష్టం. కానీ సంజూ శాంసన్ అని మరో ఆటగాడున్నాడు. మీరంతా అతడి ఆటను ఎంత ఆస్వాదిస్తారో నాకు తెలీదు కానీ.. నేను మాత్రం టీ20ల్లో సంజూ బ్యాటింగ్ చూడటాన్ని చాలా ఇష్టపడతాను’ అని తెలిపారు.
TG: ఐఏఎస్‌లు నవీన్ మిట్టల్, సోమేష్ కుమార్, అమోయ్ కుమార్‌పై కొందరు ఈడీకి ఫిర్యాదు చేశారు. HYD కొండాపూర్ మజీద్ బండలో 88 ఎకరాల భూమిని బాలసాయి ట్రస్ట్‌కు దానం చేయగా భూపతి అసోసియేట్స్‌కు 42 ఎకరాలు ఇచ్చినట్లు జీవో జారీ చేశారని బాధితులు ఫిర్యాదులో తెలిపారు. తమ భూమికి ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి IASలు మోసం చేశారని ఆరోపించారు. కాగా ఇప్పటికే అమోయ్ కుమార్‌ను ఈడీ విచారించింది.
Sorry, no posts matched your criteria.