news

News July 2, 2024

భోలే బాబా ఎవరంటే?

image

UPలోని సత్సంగ్‌లో <<13551764>>తొక్కిసలాటతో<<>> భోలే బాబా అలియాస్ నారాయణ్ సకర్ విశ్వ హరి గురించి చర్చ మొదలైంది. ఆయన UP ఎటా జిల్లాలోని బహదూర్ నగరి గ్రామానికి చెందినవారు. గతంలో ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేశారు. ‘మానవ్ మంగళ్ మిలన్ సద్భావన సమాగం’ పేరుతో ఆయన చేపట్టే ప్రవచన కార్యక్రమానికి నిత్యం వేల మంది వస్తుంటారు. కరోనా విజృంభిస్తోన్న సమయంలోనూ 50 మందికి అనుమతిస్తే 50వేల మందికిపైగా హాజరవడంతో విమర్శలు ఎదుర్కొన్నారు.

News July 2, 2024

పాలనలో మార్పు కనిపించాలి: చంద్రబాబు

image

AP: పాలనలో మార్పు స్పష్టంగా కనిపించేలా అధికారులు పని చేయాలని CM చంద్రబాబు ఆదేశించారు. సచివాలయంలో మంత్రులు, అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ‘గత ప్రభుత్వ విధానాల వల్ల ప్రజలు సమస్యల్లో కూరుకుపోయారు. వాటి పరిష్కారానికి అధికారులు కృషి చేయాలి. తక్షణమే ప్రజలకు ఇసుక అందుబాటులో ఉంచాలి. అలాగే రాష్ట్రవ్యాప్తంగా రోడ్లను బాగుచేయాలి. నిత్యావసర సరకుల ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలి’ అని ఆయన పేర్కొన్నారు.

News July 2, 2024

రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

image

AP: మహారాష్ట్ర, కేరళ తీరాల వెంబడి ద్రోణి విస్తరించి ఉందని APSDMA వెల్లడించింది. దీని ప్రభావంతో రేపు శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, తూ. గో, ప. గో, ఏలూరు, కృష్ణా, NTR, తిరుపతి, విశాఖపట్నం, అనకాపల్లి, కృష్ణా, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, YSR, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

News July 2, 2024

ఎస్సీ, ఎస్టీలను కాంగ్రెస్ మోసం చేసింది: మోదీ

image

ఎస్సీ, ఎస్టీ సహా అణగారిన వర్గాలను కాంగ్రెస్ మోసం చేసిందన్నారు ప్రధాని మోదీ. కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీల వ్యతిరేక పార్టీ అని అంబేడ్కర్ చెప్పారని, నెహ్రూ ప్రభుత్వ విధానాలు నచ్చక ఆయన రాజీనామా చేసినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో అంబేడ్కర్‌ను ఓడించిందని విమర్శించారు. జగ్జీవన్‌రామ్ ప్రధాని కాకుండా ఆ పార్టీ అడ్డుకుందన్నారు. రిజర్వేషన్లకు కాంగ్రెస్ మొదటి నుంచి వ్యతిరేకమన్నారు.

News July 2, 2024

ఆ గ్రామాలను తిరిగి TGలో కలపాలంటూ రేవంత్‌కు తుమ్మల లేఖ

image

ఈనెల 6న తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ నేపథ్యంలో సీఎం రేవంత్‌కు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు. భద్రాచలం నుంచి ఏపీలో విలీనమైన గ్రామ పంచాయతీలపై ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు. గుండాల, పురుషోత్తమపట్నం, ఏటపాక, కన్నాయిగూడెం, పిచుకులపాడును తిరిగి భద్రాచలంలో కలపాలని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఈ గ్రామాలను ఏపీలో విలీనం చేసిన సంగతి తెలిసిందే.

News July 2, 2024

ఈ దేశం వారిని ఎప్పటికీ క్షమించదు: మోదీ

image

హిందువులపై అసత్య ఆరోపణలు చేయడం సరికాదని ప్రధాని మోదీ అన్నారు. దీనిని సమర్థించేందుకు కుట్ర జరుగుతోందని, ఇది తీవ్రంగా పరిగణించాల్సిన విషయమని తెలిపారు. ‘కాంగ్రెస్ హిందూ ఉగ్రవాదం వంటి పదాలను ఉపయోగించింది. గతంలో వారి మిత్రపక్షం హిందూ మతాన్ని డెంగీతో పోల్చింది. ఈ దేశం వీరిని ఎప్పటికీ క్షమించదు. విపక్ష నేతల ప్రవర్తన సభ హుందాతనానికి మంచిది కాదు’ అని మండిపడ్డారు.

News July 2, 2024

ప్రభుత్వ వెబ్‌సైట్లలో ముఖ్యమైన సమాచారం అదృశ్యం: KTR

image

TG: రాష్ట్ర ప్రభుత్వ వెబ్‌సైట్లు, సోషల్ మీడియా ఖాతాల్లో ముఖ్యమైన సమాచారం అదృశ్యం అయిందని KTR ట్వీట్ చేశారు. ఈ విషయంలో జోక్యం చేసుకుని, విలువైన సమాచారాన్ని భద్రపరచాలని CS శాంతికుమారికి విజ్ఞప్తి చేశారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కొన్ని వెబ్‌సైట్లు తొలగించారు. ముఖ్యమైన సమాచారాన్ని కనిపించకుండా చేశారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలోని ఫొటోలు, వీడియోలను లేకుండా చేశారు’ అని ఆరోపించారు.

News July 2, 2024

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. 11మంది మావోయిస్టుల హతం

image

ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. కొహకమెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధనంది-కుర్రేవాయ్ మధ్య అటవీ ప్రాంతంలో జల్లెడ పడుతున్న భద్రతాబలగాలకు మావోయిస్టులు ఎదురుపడ్డారు. ఈక్రమంలో చోటుచేసుకున్న కాల్పుల్లో 11మంది మావోయిస్టులు హతమయ్యారని అధికారులు తెలిపారు. ఎస్‌టీఎఫ్, ఆర్‌జీ, బీఎస్‌ఎఫ్, ఐటీబీపీ బలగాలు ఈ ఎన్‌కౌంటర్‌లో పాలుపంచుకున్నాయని పేర్కొన్నారు.

News July 2, 2024

శ్రీలంకతో సిరీస్‌కు మైకేల్ వాన్ కుమారుడు

image

ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ కుమారుడు ఆర్కీ వాన్ అండర్-19 జట్టులో చోటు దక్కించుకున్నారు. శ్రీలంకతో జరగబోయే రెండు టెస్టుల సిరీస్ కోసం ఆయన ఎంపికయ్యారు. ఆర్కీ టాపార్డర్ బ్యాటింగ్‌తోపాటు స్పిన్ కూడా వేయగలరు. అలాగే ఆండ్రూ ఫ్లింటాఫ్ చిన్న కుమారుడు రాకీ ఫ్లింటాఫ్, జో డెన్లీ అల్లుడు జైడెన్ డెన్లీ, రెహాన్ అహ్మద్ తమ్ముడు ఫర్హాన్ అహ్మద్ కూడా జట్టులో స్థానం దక్కించుకున్నారు.

News July 2, 2024

BREAKING: ఏపీలో జిల్లాల కలెక్టర్లు బదిలీ

image

*విశాఖ- హరీంద్రప్రసాద్
*అన్నమయ్య- చామకూరి శ్రీధర్
*సత్యసాయి- చేతన్
*కడప- లోతేటి శివశంకర్ *నెల్లూరు- O.ఆనంద్
*తిరుపతి- వెంకటేశ్వర్ *పల్నాడు- అరుణ్ బాబు
*అంబేడ్కర్ కోనసీమ- రావిరాల మహేశ్ కుమార్
*పార్వతీపురం మన్యం- శ్యామ్ ప్రసాద్
*అనకాపల్లి- కె.విజయ
*శ్రీకాకుళం- స్వప్నిక్ దినకర్ *నంద్యాల- రాజకుమారి