news

News July 2, 2024

BREAKING: ఏపీలో జిల్లాల కలెక్టర్లు బదిలీ

image

*విశాఖ- హరీంద్రప్రసాద్
*అన్నమయ్య- చామకూరి శ్రీధర్
*సత్యసాయి- చేతన్
*కడప- లోతేటి శివశంకర్ *నెల్లూరు- O.ఆనంద్
*తిరుపతి- వెంకటేశ్వర్ *పల్నాడు- అరుణ్ బాబు
*అంబేడ్కర్ కోనసీమ- రావిరాల మహేశ్ కుమార్
*పార్వతీపురం మన్యం- శ్యామ్ ప్రసాద్
*అనకాపల్లి- కె.విజయ
*శ్రీకాకుళం- స్వప్నిక్ దినకర్ *నంద్యాల- రాజకుమారి

News July 2, 2024

అదానీపై రిపోర్ట్‌తో హిండెన్‌బర్గ్ ఎంత సంపాదించిందంటే?

image

అదానీ గ్రూప్‌పై రిపోర్టుతో $4.1 మిలియన్లు మాత్రమే ఆర్జించినట్లు హిండెన్‌బర్గ్ వెల్లడించింది. ఓ ఇన్వెస్టర్ ద్వారా ఈ మొత్తం వచ్చినట్లు తెలిపిన సంస్థ ఆ వివరాలు గోప్యంగా ఉంచింది. మరోవైపు అదానీ యూఎస్ బాండ్స్ షార్ట్ సెల్లింగ్ ద్వారా $31000 వచ్చాయని తెలిపింది. కాగా 2023 జనవరిలో స్టాక్ మార్కెట్ షేర్లకు సంబంధించి అదానీ గ్రూప్ అవకతవకలకు పాల్పడుతోందని హిండెన్‌బర్గ్ ఆరోపిస్తూ రిపోర్ట్ రిలీజ్ చేసింది.

News July 2, 2024

ఈ నెలలో ‘దేవర’ నుంచి రెండో సాంగ్?

image

ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ‘దేవర’ మూవీకి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ నెలలోనే మూవీ నుంచి రెండో పాట రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. సముద్ర తీరంలో సాగే ఓ మెలోడీ సాంగ్‌ను విడుదల చేయనున్నట్లు టాక్. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. కొరటాల శివ రూపొందిస్తున్న ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు. సెప్టెంబర్ 27న మూవీ రిలీజ్ కానుంది.

News July 2, 2024

ఇంకా రేకుల షెడ్డులోనే ఓ పోలీసు స్టేషన్: హోంమంత్రి అనిత

image

AP: హోంమంత్రి అనిత విశాఖలోని సెంట్రల్ జైలును ఈరోజు సందర్శించారు. వైసీపీ హయాంలో పోలీస్ వ్యవస్థ పరిస్థితి ఘోరంగా తయారైందని ఈ సందర్భంగా ఆరోపించారు. ‘వైజాగ్‌లో ఇంకా ఓ స్టేషన్ రేకుల షెడ్డులోనే నడుస్తోంది. ఎస్కార్ట్ వాహనాలూ పనిచేయడం లేదన్న ఫిర్యాదులున్నాయి. గత ప్రభుత్వం స్టేషనరీకి కూడా ఖర్చులు ఇవ్వలేదు. మహిళా పోలీసులు ఇబ్బందులు పడ్డారు. పోలీసు క్వార్టర్స్ శిథిలావస్థలో ఉన్నాయి’ అని వ్యాఖ్యానించారు.

News July 2, 2024

‘నీట్’పై చర్చ జరగాలని PM మోదీకి రాహుల్ లేఖ

image

‘నీట్’ పేపర్ లీక్ అంశంపై రేపు పార్లమెంట్‌లో చర్చ జరగాలని కోరుతూ ప్రధాని మోదీకి రాహుల్ గాంధీ లేఖ రాశారు. ’24 లక్షల మంది నీట్ అభ్యర్థులకు దీనిపై సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. వారి ప్రయోజనాల కోసం నిర్మాణాత్మకంగా వ్యవహరించడమే మా లక్ష్యం. ఈ చర్చకు మీరు నాయకత్వం వహిస్తే అది సముచితంగా ఉంటుంది’ అని లేఖలో పేర్కొన్నారు.

News July 2, 2024

నిజమే.. ‘పవర్ స్టార్’ అంటే బ్రాండే: జనసేన

image

AP: ‘పవర్ స్టార్’ పేరిట మార్కెట్‌లో మద్యం ఉందంటూ వైసీపీ చేసిన విమర్శలకు జనసేన కౌంటర్ ఇచ్చింది. ‘అది తెచ్చింది మీరేనని మర్చిపోయారా? నిజమే, పవర్ స్టార్ ఓ బ్రాండ్. కల్తీ మద్యానికి కాదు, మానవత్వానికి. అవినీతికి కాదు, అభివృద్ధికి. సంక్షోభానికి కాదు, సంక్షేమానికి. మీరు సృష్టించిన సంక్షోభం నుంచి AP ప్రజలు త్వరలోనే విముక్తి పొందుతారు. మీరు శాశ్వతంగా బెంగళూరు ప్యాలెస్‌లో రెస్ట్ తీసుకోవచ్చు’ అని పేర్కొంది.

News July 2, 2024

వరలక్ష్మీ శరత్ కుమార్ సంగీత్ పార్టీ వేడుక (PHOTOS)

image

నటి వరలక్ష్మీ శరత్ కుమార్, నికోలయ్ సచ్‌దేవ్‌ల వివాహం బంధుమిత్రుల సమక్షంలో మరికొద్ది సేపట్లో జరగనుంది. ఈక్రమంలో సంగీత్ పార్టీకి సెలబ్రెటీలతో కలిసి వరలక్ష్మి, రాధికా శరత్ సందడి చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఈ వేడుకలో త్రిష, మంచు లక్ష్మి, మమతా మోహన్ దాస్, అర్చనా కల్పతితో పాటు పలువురు సినీ సెలబ్రిటీలు హాజరయ్యారు. పెళ్లి కూతురుతో దిగిన ఫొటోలను త్రిష ఇన్‌స్టాలో పంచుకున్నారు.

News July 2, 2024

రైతు ఆత్మహత్యపై స్పందించిన సీఎం రేవంత్

image

ఖమ్మం జిల్లా చింతకాని మండలం ప్రొద్దుటూరు గ్రామానికి చెందిన రైతు ప్రభాకర్ <<13549226>>సూసైడ్‌<<>> ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఈ ఘటనపై వెంటనే సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. తన పొలాన్ని కొందరు ఆక్రమించారని, సీఎం రేవంత్ న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తూ రైతు ప్రభాకర్ పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.

News July 2, 2024

రోహిత్ ఫోన్ చేయడం వల్లే కోచ్‌గా ఉన్నా: ద్రవిడ్

image

టీ20 WC విజయంతో టీం ఇండియా కోచ్‌ పదవికి రాహుల్ ద్రవిడ్ ఘనంగా వీడ్కోలు పలికారు. అయితే, రోహిత్ తనకు కాల్ చేయకపోయి ఉంటే తాను కోచ్‌గా కొనసాగేవాడిని కాదని ఆయన డ్రెస్సింగ్ రూమ్ స్పీచ్‌లో వెల్లడించారు. బీసీసీఐ పంచుకున్న వీడియో ప్రకారం.. గత ఏడాది నవంబరులో ODI WC ఓటమి అనంతరం రాహుల్ కోచ్‌గా తప్పుకోవాలనుకున్నారట. కనీసం టీ20 WC వరకు అయినా కోచ్‌గా కొనసాగాలని రోహిత్ ఫోన్ చేసి అడగడంతో నిర్ణయం మార్చుకున్నారట.

News July 2, 2024

విభజన హామీలపై ఇరు రాష్ట్రాలు చర్చించాలి: కోదండరామ్

image

విభజన హామీలపై ఇరు రాష్ట్రాల సీఎంలు కలిసి చర్చించుకోవాలని TJS అధ్యక్షుడు కోదండరామ్ అన్నారు. చర్చలు జరిపితేనే రాష్ట్రాల సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పారు. ‘గతంలో కేసీఆర్, జగన్ రాజకీయ అవసరాల కోసమే సమావేశమయ్యారు. ఇరు రాష్ట్రాల ప్రయోజనాల కోసం వారు ఏనాడూ చర్చించలేదు. అందుకే గత ప్రభుత్వ హయాంలో విభజన సమస్యలు ఎక్కువయ్యాయి. ఇప్పటికైనా రేవంత్, చంద్రబాబు దీనిపై దృష్టి సారించాలి’ అని ఆయన పేర్కొన్నారు.